Chandrababu Daggubati : ఒకే వేదికపై నారా, దగ్గుబాటి.. సుదీర్ఘ కాలం తర్వాత అనూహ్య పరిణామం !
చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఓ కుటుంబ కార్యక్రమంలో పాల్గొన్నారు. పక్కపక్కనే నిలబడి ఫోటోలు దిగడం.. ఆత్మీయంగా మాట్లాడుకోవడం విశేషంగా మారింది.
![Chandrababu Daggubati : ఒకే వేదికపై నారా, దగ్గుబాటి.. సుదీర్ఘ కాలం తర్వాత అనూహ్య పరిణామం ! Chandrababu and Daggubati Venkateswara Rao appeared side by side after many years Chandrababu Daggubati : ఒకే వేదికపై నారా, దగ్గుబాటి.. సుదీర్ఘ కాలం తర్వాత అనూహ్య పరిణామం !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/10/89267600d3ffd66180891af5ca05879d_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నందమూరి తారక రామారావు ఫ్యామిలీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. చాలా కాలంగా మాటలు లేని దగ్గుబాటి, నారా కుటుంబాలు ఓ వేడుకలో కలిసి కనిపించారు. ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి కూతురు వివాహనిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లో జరిగింది.ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబం అంతా హాజరైంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, బీజేపీ నేత పురందేశ్వరి కూడా కుటుంబాలతో సహా హాజరయ్యారు. రాజకీయాలను పక్కన బెట్టి అందరూ ఆత్మీయంగా మాట్లాడుకున్నారు.
ఎన్టీఆర్ కుటుంబం అంతా ఒక్కటిగానే అంటున్నప్పుడు ఎన్టీఆర్ కుమార్తెలను పెళ్లి చేసుకున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నారా చంద్రబాబునాయుడు కుటుంబాల మధ్య చాలా కాలంగా మాటలు లేవు. ఆగస్టు సంక్షోభం తర్వాత ఇరువురి మధ్య విభేదాలొచ్చాయి. దాంతో చంద్రబాబునాయుడుకు వారు పూర్తి వ్యతిరేకులయ్యారు. చంద్రబాబు పేరును ప్రస్తావించడానికి కూడా దగ్గుబాటి కుటుంబం ఇష్టపడదన్న ప్రచారం ఉంది.
అదే సమయంలో కుటుంబపరమైన ఎన్నో వేడుకలు జరిగినప్పటికీ రెండుకుటుంబాలు ఒకే వేదికపై కనిపించలేదు. కానీ ఇప్పుడు మాత్రం రెండు కుటుంబాలు ఒకే వేదికపై కనిపించడమే కాదు.. పక్క పక్కనే నిలుచుని ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. ఈ వేడుక ఇప్పుడు ఎన్టీఆర్ కుటుంబంలో ఓ విశేషంగా మారగా.. రాజకీయంగానూ చర్చనీయాంశం అవుతోంది. ఇటీవల ఎన్టీఆర్ కుమార్తె, చంద్రబాబు సతీమణి అయిన నారా భువనేశ్వరిపై వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేసిన వివాదంలోనూ అందరూ ఒక్కటయ్యారు. పురందేశ్వరి సహా అందరూ ఖండించారు.
Also Read : మాజీ ఐఏఎస్ ఇంట్లో సీఐడీ సోదాలు.. ఇంటి ముందు టీడీపీ నేతలు-పోలీసుల మధ్య ఉద్రిక్తత
ఈ క్రమంలో ఎన్టీఆర్ కుటుంబం అంతా ఒక్కటయిందన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు నారా, దగ్గుబాటి కుటుంబాలు కూడా పాత వివాదాలను మర్చిపోయి కలిసిపోతే రాజకీయంగానూ సంచలనం అయ్యే అవకాశం ఉంది. దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీలో ఉన్నప్పటికీ .. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గత ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత పార్టీకి దూరంగా ఉన్నారు. ఆయన కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం దగ్గుబాటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
Also Read : శ్రీవారికి రూ. మూడున్నర కోట్ల విలువైన ఆభరణాల విరాళం ఇచ్చిన ఆజ్ఞాత భక్తుడు !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)