CID Raids: మాజీ ఐఏఎస్ ఇంట్లో సీఐడీ సోదాలు.. ఇంటి ముందు టీడీపీ నేతలు-పోలీసుల మధ్య ఉద్రిక్తత
లక్ష్మీనారాయణ ఇంట్లో ఏపీ పోలీసులు సోదాలకు వచ్చారు. వారు ఇంట్లో పని మనుషులతో దురుసుగా సీఐడీ పోలీసులు ప్రవర్తించారని లక్ష్మీనారాయణ ఆరోపిస్తున్నారు.
ఏపీలో విశ్రాంత ఐఏఎస్ అధికారి ఇంట్లో సీఐడీ అధికారులు ఉన్నట్టుండి సోదాలు చేపట్టడం ఉద్రిక్తతకు దారి తీసింది. శుక్రవారం ఉదయం విశ్రాంత ఐఏఎస్ అధికారి అయిన లక్ష్మీ నారాయణ ఇంటికి సీఐడీ అధికారులు వచ్చారు. అయితే, వారు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా వచ్చి హడావుడి చేస్తున్నారని లక్ష్మీ నారాయణ ఆరోపించారు.
Also Read : నూతన సచివాలయ పనులను పరిశీలించిన కేసీఆర్.. త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు మొదటి డైరెక్టర్‌గా లక్ష్మీ నారాయణ పనిచేశారు. చంద్రబాబు ప్రభుత్వ సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు ట్రైనింగ్ ఇచ్చింది. ఈ క్రమంలో ట్రైనింగ్ సెంటర్లలో అవినీతి జరిగిందనే ఆరోపణలపై లక్ష్మీనారాయణ ఇంట్లో ఏపీ పోలీసులు సోదాలకు వచ్చారు. అయితే, ముందస్తు నోటీసు ఇవ్వకుండా లక్ష్మీనారాయణ ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో పని మనుషులతో దురుసుగా సీఐడీ పోలీసులు ప్రవర్తించారని లక్ష్మీనారాయణ ఆరోపిస్తున్నారు. నోటీస్ ఇవ్వకుండా సెర్చ్ ఎలా చేస్తారని ప్రశ్నించారు.
దీంతో ఆయనతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. మరోవైపు లక్ష్మీనారాయణకు టీటీడీపీ నాయకులు మద్దతుగా నిలిచారు. తెలంగాణ టీడీపీ నాయకులు కూడా రావడంతో సీఐడీ అధికారులు వెనక్కి తగ్గారు. అప్పటికప్పుడు నోటీస్ ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. సోదాలు ముగించి పంచనామా ప్రక్రియ చేపట్టారు. సోదాల్లో భాగంగా కొన్ని పత్రాలతో పాటు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గతంలో చంద్రబాబు దగ్గర కూడా లక్ష్మీనారాయణ ఓఎస్డీగా పనిచేశారు. పదవీ విరమణ తర్వాత ఏపీ ప్రభుత్వానికి లక్ష్మీనారాయణ సలహాదారుగా పని చేశారు.
Also Read: సాయితేజ కుటుంబానికి రూ.కోటి సాయం, ఉద్యోగం ఇవ్వండి.. ఏపీ ప్రభుత్వానికి చంద్రబాబు విజ్ఞప్తి !
Also Read: పరువు కోసం బావ హత్య.. కాబోయే బామ్మర్దులు కత్తులతో ఘాతుకం
Also Read: Revanth Reddy: పార్లమెంటులో వాళ్లదంతా ఉత్తుత్తి పోరాటం.. టీఆర్ఎస్, బీజేపీది కుమ్మక్కు రాజకీయం
Also Read : ఈ పిల్లలు జీవితాంతం బస్సుల్లో ఫ్రీగా తిరగొచ్చు.. ఎండీ సజ్జనార్ గ్రేట్ ఆఫర్, ఎందుకంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి