(Source: ECI/ABP News/ABP Majha)
Chandrababu Saiteja : సాయితేజ కుటుంబానికి రూ.కోటి సాయం, ఉద్యోగం ఇవ్వండి.. ఏపీ ప్రభుత్వానికి చంద్రబాబు విజ్ఞప్తి !
హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయిన లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబానికి రూ. కోటి సాయం, ఉద్యోగం ఇవ్వాలని చంద్రబాబు ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
తమిళనాడు హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయిన చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎర్రబల్లి పంచాయతీకి చెందిన లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మకు చంద్రబాబు లేఖ రాశారు.
Also Read : తదుపరి త్రివిధ దళాధిపతిగా ఆయనే .. త్వరలో అధికారిక ప్రకటన !
భరతమాతకు సేవ చేయాలని 20 ఏళ్ల వయసులోనే ఆర్మీలో చేరి, 29 ఏళ్లకే అమరుడైన లాన్స్ నాయక్ సాయితేజకు తెలుగుదేశం పార్టీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోందని చంద్రబాబు తెలిపారు. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడలో పుట్టి పెరిగి సాధారణ సైనికుడిగా ఎంపికై కేవలం తొమ్మిదేళ్ల సర్వీసులో ఏకంగా త్రివిధ దళాదిపతి వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో చేరే స్థాయికి చేరడం వెనుక అతని కృషి, పట్టుదల, కష్టం నేటి యువతకు ఆదర్శమన్నారు.
Also Read : ఎట్టకేలకు హెలికాప్టర్ బ్లాక్ బాక్స్ లభ్యం.. డీకోడింగ్ కోసం తరలింపు.. వీడియో
గిరిజన కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగారు. హెలికాప్టర్ ప్రమాదంలో వీరమరణం పొందిన సాయితేజ కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం అందజేయడంతోపాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిండం సముచితమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాయితేజ కుటుంబాన్ని తక్షణమే అన్నివిధాలా ఆదుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరమణం పొందిన సైనికులకు భారీ పరిహారం ఇస్తోంది. గుంటూరు జిల్లాకు చెందిన జశ్వంత్ రెడ్డి కుటుంబానికి రూ. 50 లక్షలు, ఎల్వోసీ వద్ద ఎదురుకాల్పుల్లో మరణించిన చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారి పల్లెకు చెందిన హవాల్దార్ ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి రూ.50 లక్షలు, ఛత్తీస్ ఘడ్ నక్సల్స్ కాల్పుల్లో చనిపోయిన జవాన్ రౌత్ జగదీష్ కుటుంబానికి రూ. 30లక్షలు వంటి సాయాన్ని గతంలో ఏపీ ప్రభుత్వం చేసింది. అందుకే సాయితేజ కుటుంబానికీ భారీ సాయం చేస్తారని భావిస్తున్నారు. ఈ లోపు మాజీ సీఎం చంద్రబాబు సాయం చేయాలని లేఖ రాశారు.
Also Read: CDS Bipin Rawat Chopper Crash: బిపిన్ రావత్.. ఆర్మీ లెజెండ్.. వెన్నుచూపని యోధుడు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి