By: ABP Desam | Updated at : 09 Dec 2021 12:37 PM (IST)
లోక్‌సభలో మాట్లాడుతున్న రాజ్ నాథ్
తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ మరణంపై నేటి సభలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటన చేశారు. బుధవారం హెలికాప్టర్ ప్రమాదం జరిగిందని, ఆ విషాదకర ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్ సహా 13 మంది ఆర్మీ ఉన్నతాధికారులు మరణించారని చెప్పారు. ఈ మిలిటరీ హెలికాప్టర్ ప్రమాదంపై భారత వైమానిక దళం మూడంచెల విచారణకు ఆదేశించిందని రాజ్ నాథ్ తెలిపారు. ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ ఈ విచారణకు నేత్రుత్వం వహిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే ఈ విచారణ టీమ్ వెల్లింగ్టన్ చేరుకుందని విచారణ కూడా మొదలుపెట్టిందని రాజ్ నాథ్ లోక్ సభలో వివరించారు. సీడీఎస్ బిపిన్ రావత్ సహా మరణించిన 13 ఉన్నతాధికారుల అంత్యక్రియలను ఆర్మీ గౌరవ మర్యాదలతో నిర్వహించనున్నారని రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు.
అంతకుముందు లోక్ సభలో సీడీఎస్ బిపిన్ రావత్, ఇతర ఉన్నతాధికారుల మరణంపై రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళి అర్పించారు. నేడు (డిసెంబరు 12)న చనిపోయిన వారి భౌతిక కాయాలను తమిళనాడు నుంచి ప్రత్యేక ఎయిర్ ఫోర్స్ విమానంలో ఢిల్లీకి తీసుకురానున్నారు.
కూనూర్ సమీపంలో వెల్లింగ్టన్ కాలేజీ స్టూడెంట్స్‌తో ఇంటరాక్ట్ అయ్యేందుకు బిపిన్ రావత్ దంపతులు అక్కడకు వెళ్లారు. సులూరు ఎయిర్‌బేస్ నుంచి హెలికాప్టర్ బయలుదేరిందని.. 12.08 నిమిషాలకు ఆ హెలికాప్టర్‌తో ఏటీసీ సంబంధాలు తెగిపోయాయని తెలిపారు. అయితే స్థానికులు మంటల్లో కాలిపోతున్న హెలికాప్టర్‌ను చూశారని, దాంట్లో ప్రాణాలను కొట్టుమిట్టాడుతున్నవారిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించినట్లు తెలిపారు. ప్రమాదంలో మృతిచెందిన రక్షణ దళ సిబ్బంది పేర్లను రాజ్‌నాథ్ చదివి వినిపించారు.
Also Read: CDS Chopper Black Box: ఎట్టకేలకు హెలికాప్టర్ బ్లాక్ బాక్స్ లభ్యం.. డీకోడింగ్ కోసం తరలింపు.. వీడియో
Also Read: Bipin Rawat: "అగ్గిపెట్టె" కారణంగా ఎన్డీఏలోకి రావత్ ఎలా వచ్చారు?
Also Read: Chief of Defence Staff: ఏంటీ సీడీఎస్.. కార్గిల్ యుద్ధ కాలంలోనే ఈ పదవిపై చర్చలు జరిగాయా?
Also Read: CDS Bipin Rawat Chopper Crash: బిపిన్ రావత్.. ఆర్మీ లెజెండ్.. వెన్నుచూపని యోధుడు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Mohammed Zubair Arrested : జర్నలిస్ట్ మహ్మద్ జుబేర్ అరెస్ట్, ఓ మతాన్ని కించపరిచేలా మాట్లాడారని ఆరోపణలు
AAI Junior Executive Recruitment: సైన్స్‌లో డిగ్రీ చేసిన వాళ్లకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆహ్వానం- లక్షన్నర వరకు జీతం
PSLV C-53 Launch : ఈ నెల 30న నింగిలోకి పీఎస్ఎల్వీ సీ53, శ్రీహరికోటలో ప్రయోగ ఏర్పాట్లు షురూ
Wanted Bride Posters : పెళ్లి కూతురు కావాలని ఊరి నిండా జగన్ పోస్టర్లు - పిల్ల దొరుకుతుందా ?
Get Free iPadi: సెల్ఫీ తీసి పంపిస్తే ఐపాడ్- దిల్లీ ప్రభుత్వం అదిరిపోయే ఆఫర్
Actor Prasad: చెట్టుకి ఉరేసుకొని చనిపోయిన నటుడు - కారణమేంటంటే?
Srilanka Crisis : శ్రీలంకలో పెట్రోల్ సెలవులు - ఎప్పటి వరకో తెలియదు!
Mahindra Scorpio N Launched: తక్కువ ధరతో, సూపర్ ఫీచర్లతో కొత్త స్కార్పియో - మహీంద్రా మళ్లీ కొట్టిందిగా!
Tollywood: ప్లాప్ సినిమాలను బ్లాక్ బస్టర్స్ అంటున్నారే!