By: ABP Desam | Updated at : 09 Dec 2021 12:37 PM (IST)
డీకోడింగ్ కోసం తరలిస్తున్న బ్లాక్ బాక్స్
కూనూరు హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో బ్లాక్ బాక్స్ దొరికింది. విమానాలు, హెలికాప్టర్ల ప్రమాదం జరిగాక అందుకు గల కారణాలను విశ్లేషించేందుకు బ్లాక్ బాక్స్ కీలకంగా మారుతుంది. తాజాగా ఈ బ్లాక్ బాక్స్‌ను ప్రమాదం జరిగిన ప్రాంత పరిసరాల్లోనే భద్రతా సిబ్బంది కనుగొన్నారు. దాన్ని సేకరించి డీకోడింగ్ కోసం తరలించారు. వింగ్ కమాండర్ ఆర్.భరద్వాజ్ నేత్రుత్వంలో వైమానిక దళానికి చెందిన 25 మంది ప్రత్యేక టీమ్ ఈ బ్లాక్ బాక్స్ శోధనలో పాల్గొన్నారు. బుధవారం హెలికాప్టర్ ప్రమాదం జరిగిన తర్వాతి నుంచి అత్యవసర ప్రాతిపదికన వీరంతా గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న మధ్యాహ్నం నుంచి ప్రమాదంలో మరణించిన ఆర్మీ అధికారుల భౌతిక కాయాలను గుర్తించి సమీపంలోని ఆర్మీ క్యాంపునకు తరలించారు. గాయపడ్డవారిని వెల్లింగ్టన్‌లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు.
తాజాగా లభ్యమైన బ్లాక్ బాక్స్ ద్వారా హెలికాప్టర్ ప్రమాదానికి దారి తీసిన కీలక సమాచారం లభ్యం కానుంది. చివరి క్షణాల్లో వారికి ఎదురైన ప్రతికూల పరిస్థితులు తదితర అన్ని వివరాలు బ్లాక్ బాక్స్‌లో రికార్డు కానున్నాయి. ఈ డేటా రికార్డర్‌ను బ్లాక్ బాక్స్‌గా పిలిచినా ముదురు నారింజ రంగులో ఈ బాక్స్ ఉంటుంది. కాక్ పిట్‌లో పైలట్ల మధ్య జరిగిన సంభాషణలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) మధ్య సంభాషణ మొత్తం ఇందులో రికార్డ్ అవుతుంది. ఈ బాక్సును డీకోడింగ్ చేసి అందులో సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయి.
ఆరుగురు సీనియర్ వైద్యులతో కూడిన ప్రత్యేక టీమ్.. హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చావు బతుకుల మధ్య పోరాడుతున్న గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ప్రాణాలు కాపాడేందుకు యత్నిస్తున్నారు. శౌర్య చక్ర అవార్డు గ్రహీత అయిన వరుణ్ సింగ్‌కు ఈ ప్రమాదంలో దాదాపు 60 శాతం కాలిన గాయాలు అయినట్లుగా ఆర్మీ వర్గాలు తెలిపాయి.
Also Read: Chief of Defence Staff: ఏంటీ సీడీఎస్.. కార్గిల్ యుద్ధ కాలంలోనే ఈ పదవిపై చర్చలు జరిగాయా?
Also Read: CDS Bipin Rawat Chopper Crash: బిపిన్ రావత్.. ఆర్మీ లెజెండ్.. వెన్నుచూపని యోధుడు!
Also Read: Chopper Crash Coonoor: సీడీఎస్ బిపిన్ రావత్ ఇక లేరు.. హెలికాప్టర్ కూలిన ఘటనలో 13 మంది మృతి
Also Read: Colleague Murder: కొలీగ్ తల నరికి మొండెం పక్కనే రాత్రంతా నిద్ర.. పొద్దున్నే లేచి..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
J&K Terrorists: ఈ ఊరి వాళ్ల ధైర్యం చూశారా, మోస్ట్‌వాంటెడ్ టెర్రరిస్టులనే పట్టుకుని బంధించారు
Single-Use Plastic Ban: ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాల ఉత్పత్తులపై జీస్టీ తగ్గించాలి, దిల్లీ మంత్రి విజ్ఞప్తి
BJP Mission South: భాజపాకు సౌత్ ఫోబియా పోయినట్టేనా? మిషన్ సౌత్ ఇండియా ప్లాన్ వర్కౌట్ అవుతుందా?
BJP National Executive Meeting: ప్రధాని మోదీ స్పీచ్‌లో ఇవే హైలైట్ కానున్నాయా, ఆయన ఏం మాట్లాడతారు?
Watch Video: దటీజ్ ఇండియన్ ఆర్మీ - అమర్నాథ్ యాత్రికుల కోసం 4 గంటల్లోనే బ్రిడ్జి నిర్మాణం
IND vs ENG 5th Test Day 3: ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన భారత్ - టీ సమయానికి స్కోరు ఎంతంటే?
Pawan Kalyan : బూతులు తిట్టేందుకే ఎమ్మెల్యేల ప్రెస్ మీట్లు, ప్రజాసమస్యల పరిష్కారానికి వైసీపీకి టైం లేదు- పవన్ కల్యాణ్
Balakrishna: 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' టీమ్ తో బాలయ్య - లుక్ అదుర్స్
Bandi Sanjay : తెలంగాణకు మోదీ నిధులిస్తుంటే, కేసీఆర్ దారి మళ్లిస్తున్నారు- బండి సంజయ్