By: ABP Desam | Updated at : 09 Dec 2021 10:10 AM (IST)
బిపిన్ రావత్ అన్‌టోల్డ్ స్టోరీ
తమిళనాడులోని కూనూర్ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్‌తో సహా 13 మంది వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఇవాళ వారి భౌతిక దేహాలను ఢిల్లీకి తీసుకురానున్నారు. శుక్రవారం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్‌కు చెందిన జనరల్ రావత్ ఎప్పుడూ సైన్యంలో చేరాలని కలలు కనేవారు. ఓ సందర్భంలో విద్యార్థులతో మాట్లాడుతూ ఓ సంఘటన పంచుకున్నారు. తాను ఎన్‌డీఏలో చేరేందుకు ప్రిపేర్ అవుతున్నప్పటి సంఘటన.
రావత్ ఎన్డీఏ పరీక్ష పాసైన తర్వాత యూపీఎస్‌సీ నుంచి ఇంటర్య్వూకి పిలుపు వచ్చింది. ఇంటరర్వ్యూ కోసం ఒకప్పటి అలహాబాద్ ఇప్పటి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లారు రావత్. నాలుగైదు రోజుల ట్రైనింగ్, టెస్టింగ్ తర్వాత కొందర్ని ఫైనల్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేశారు. అందులో రావత్ ఒకరు. ఇంటర్వ్యూ కోసం అభ్యర్థులంతా రూమ్ బయట నిల్చొని ఉన్నారు. ఒక్కొక్కర్నీ గది లోపలికి పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నారు.
ఆ సమయమే జీవితంలో చాలా ముఖ్యమైన నిమిషాలని గ్రహించారు రావత్. ఎన్డీఏలోకి వెళ్లాలన్నా... బయటకు వెళ్లిపోవాలన్నా ఇదే ముఖ్యమని భావించారు రావత్. ఈ ఆలోచలు మెదడులో కదులుతుండగానే బోర్డు సభ్యులు రావత్‌ను పిలిచారు. లోపలికి వెళ్లి చూస్తే అంతా పెద్దపెద్ద వాళ్లే. బ్రిగేడియర్ ర్యాంక్ ఉన్న వ్యక్తులే ఎదురుగా కూర్చొని ఉన్నారు. ఓ కుర్రాడిని చూసిన అక్కడి బోర్డు సభ్యులు చాలా స్నేహపూర్వకంగా మెలిగారు. నాలుగైదు సింపుల్ ప్రశ్నలే అడిగారు. క్రమంగా భయం పోగట్టారు. ఆ తర్వాత ఓ సభ్యులు రావత్ హాబీలు అడిగారు. తడుముకోకుండా ట్రెక్కింగ్ అంటే ఇష్టమని చెప్పారు రావత్. వెంటనే మరో ప్రశ్న దూసుకొచ్చింది. నాలుగైదు రోజుల ట్రెక్కింగ్‌కు వెళ్లాలనుకుంటే నీతో ఏం తీసుకెళ్తావని క్వశ్చన్ చేశారు బోర్డు సభ్యుడు.
రావత్ తీవ్రంగా ఆలోచించి... నాలుగైదు రోజుల ట్రెక్కింగ్‌కు వెళ్లాలనుంటే అగ్గిపెట్ట తీసుకెళ్తానని చెప్పారు. ఆశ్చర్యపోయిన ఇంటర్వ్యూబోర్డు సభ్యులు ఎందుకు అగ్గిపెట్టే తీసుకెళ్తావు అని డౌట్ ఎక్స్‌ప్రెస్ చేశారు. అగ్గిపెట్టే ఉంటే ట్రెక్కింగ్‌లో చాలా పనులు చేసుకోగలనని చెప్పారు రావత్. యంగ్‌గా ఉన్నప్పుడు ఓ వ్యక్తి తనను తాను గుర్తించుకోవడం చాలా అవసరమని... అందుకే తన ట్రెక్కింగ్‌లో అగ్గిపెట్టె ముఖ్యమైనదని వివరించారు. ఆ ఒక్క వస్తువులో చాలా పనులను సులభంగా చేసుకుంటానన్న రావత్ జవాబుతో ఇంటర్వ్యూ బోర్డు ఇంప్రెస్ అయిపోయింది. ఆ తర్వాత రావత్ ఎన్డీఏకు సెలెక్ట్ అవడం.. అందులో చేరి సీడీఎస్‌వరకు ఎదిగారు.
Also Read: CDS Bipin Rawat Helicopter Crash: సీడీఎస్ హెలికాప్టర్ ప్రమాదంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ప్రకటన
Also Read: Mi 17V Helicopter : వరల్డ్ బెస్ట్ హెలికాఫ్టర్లలో ఒకటి Mi-17V-5 ..! మరి ప్రమాదం ఎలా జరిగింది ?
Also Read: CDS Bipin Rawat Helicopter Crash: సీడీఎస్ హెలికాప్టర్ ప్రమాదంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సమీక్ష
Also Read: Chief of Defence Staff: ఏంటీ సీడీఎస్.. కార్గిల్ యుద్ధ కాలంలోనే ఈ పదవిపై చర్చలు జరిగాయా?
Also Read: CDS Bipin Rawat Chopper Crash: బిపిన్ రావత్.. ఆర్మీ లెజెండ్.. వెన్నుచూపని యోధుడు!
Also Read: Chopper Crash Coonoor: సీడీఎస్ బిపిన్ రావత్ ఇక లేరు.. హెలికాప్టర్ కూలిన ఘటనలో 13 మంది మృతి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
భారత్‌ను నంబర్ వన్‌గా మారుద్దాం రండీ- 2024 టార్గెట్‌గా కేజ్రీవాల్ ఉద్యమం
Rohingya Refugee: రోహింగ్యాలకు ప్రత్యేక ఫ్లాట్లు, భద్రత - అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పిన కేంద్రం
Nipun F-INSAS LCA: ఇండియన్ ఆర్మీకి కొత్త వెపన్స్ వచ్చాయ్, ఆ సైన్యానికి వణుకు తప్పదు!
Semi Bullet Train : హైదరాబాద్ - బెంగళూరు మధ్య సెమీ హైస్పీడ్ రైలు - ఎన్ని గంటల్లో వెళ్లొచ్చంటే ?
Kerala Court: మహిళల డ్రెసింగ్, లైంగిక వేధింపులపై కేరళ సెషన్స్ కోర్టు సంచలన కామెంట్స్
KCR Medchal : దేశాన్ని మతం పేరుతో విడదీసే ప్రయత్నం - తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కేసీఆర్ !
YSRCP Vs Janasena : వైఎస్ఆర్సీపీ నేతలది బ్రిటిష్ డీఎన్ఏ - కులాల మధ్య చిచ్చు పెట్టడమే వారి రాజకీయమన్న జనసేన !
Common Charging Port: మొబైల్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్స్ అన్నిటికీ ఒకే చార్జర్లు - కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!
Munugode Bypoll : రేవంత్ టార్గెట్‌గా సీనియర్ల దండయాత్ర - మునుగోడు ముందు మునిగిపోతున్న టీ కాంగ్రెస్ !