అన్వేషించండి

IITian sells chai in LA: లేఆఫ్స్‌లో జాబ్ పోయిందని ఫీల్ కాలేదు - లాస్ ఏజెంల్స్‌లో మసాలా చాయ్‌తో ఎదిగిపోయాడు !

Techi chai : అమెరికాలో ఒక్క టీ 700కు అమ్ముతున్నాడు బీహార్‌కు చెందిన ఐఐటీ గ్రాడ్యూయేట్. రేటు ఎక్కువ అనుకోవట్లేదు..అమెరికన్లు కూడా ఎగబడి కొంటున్నారు.

IITian who sells chai in LA after being laid off: లాస్ ఏంజిల్స్ వీధుల్లో  8 డాలర్లకు అంటే సుమారు రూ. 670 కి టీ అమ్ముతున్న ఒక ఐఐటియన్ (IITian) కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ ఆలోచింపజేస్తోంది. టెక్ ప్రపంచంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ఒక వ్యక్తి, అకస్మాత్తుగా ఎదురైన ఉద్యోగ గండం నుంచి కుంగిపోకుండా తన జీవితాన్ని ఎలా మలుచుకున్నాడో ఈ కథ తెలియజేస్తుంది.                  

బీహార్‌కు చెందిన ప్రభాకర్ ప్రసాద్ ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. ఎన్నో కష్టాలకోర్చి దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐటి ఖరగ్‌పూర్ (IIT Kharagpur) లో సీటు సంపాదించి ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాలో స్థిరపడి, ఒక ప్రముఖ టెక్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా దశాబ్ద కాలం పాటు పనిచేశారు. అయితే, 2025 ఫిబ్రవరిలో టెక్ రంగంలో వచ్చిన భారీ లేఆఫ్స్  వల్ల ఆయన తన ఉద్యోగాన్ని కోల్పోయారు.                           

ఉద్యోగం పోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉండకుండా, ప్రభాకర్ తనలో ఉన్న వ్యాపారవేత్తను నిద్రలేపారు. తనకు ఎంతో ఇష్టమైన, భారతదేశపు గుర్తింపు అయిన మసాలా చాయ్ ను లాస్ ఏంజిల్స్ ప్రజలకు పరిచయం చేయాలని నిర్ణయించుకున్నారు. అలా  బిహారీ ఛాయ్‌వాలా గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. కేవలం టీ మాత్రమే కాకుండా, మన ఊరి రుచికరమైన  పోహా ను కూడా ఆయన అక్కడ విక్రయిస్తున్నారు.                      

మొదట్లో ఒక ఐఐటి గ్రాడ్యుయేట్ ఇలా రోడ్డు పక్కన టీ అమ్మడం ఏంటని చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ, ప్రభాకర్ మాత్రం తన పనిని గర్వంగా భావిస్తున్నారు.  కార్పొరేట్ ఉద్యోగంలో ఉన్నప్పుడు నాకు చాలా డబ్బు ఉండేది కానీ స్వేచ్ఛ లేదు. ఇప్పుడు డబ్బు తక్కువైనా, నా మనసుకు నచ్చిన పని చేస్తున్నాను.. నేను ఇప్పుడు సంపూర్ణంగా స్థిరపడినట్లు భావిస్తున్నాను అని ఆయన తన సంతోషాన్ని పంచుకున్నారు.

ప్రభాకర్ తయారు చేసే టీకి ఇప్పుడు లాస్ ఏంజిల్స్‌లో భారీ క్రేజ్ ఏర్పడింది. ఆయన దగ్గర ఒక కప్పు టీ ధర 8 డాలర్లు ఉండగా, పోహా ధర 16 డాలర్లు ఉంటుంది. అక్కడి ఫార్మర్స్ మార్కెట్లలో ఆయన స్టాల్ ముందు జనం క్యూ కడుతున్నారు. భారతీయ రుచులను విదేశీయులకు పక్కా దేశీ స్టైల్‌లో అందిస్తూ, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.           

ప్రభాకర్ ప్రసాద్ కథ మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. జీవితంలో ఎదురుదెబ్బలు తగిలినప్పుడు కుంగిపోకుండా, మన దగ్గర ఉన్న నైపుణ్యాన్ని లేదా ఆసక్తిని వ్యాపారంగా మార్చుకుంటే విజయం దానంతట అదే వస్తుందని ఆయన నిరూపించారు. విద్యావంతుడు ఏ పని చేసినా అందులో ఒక పద్ధతి, పట్టుదల ఉంటాయని ఆయన  టీ వ్యాపారం  నిరూపిస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

Handloom Day Modi Reel: జాతీయ చేనేత దినోత్సవంపై ప్రధాని మోదీ కొత్త రీల్‌! చేనేత వస్త్రాలు కొని రీల్స్ చేయాలని పిలుపు!
జాతీయ చేనేత దినోత్సవంపై ప్రధాని మోదీ కొత్త రీల్‌! చేనేత వస్త్రాలు కొని రీల్స్ చేయాలని పిలుపు!
PM Modi: రూపాయికి 66వేల రూపాయల పెట్టుబడి! ప్రధాని మోదీ విదేశీ పర్యటన ఖర్చుపై కీలక ప్రకటన!
రూపాయికి 66వేల రూపాయల పెట్టుబడి! ప్రధాని మోదీ విదేశీ పర్యటన ఖర్చుపై కీలక ప్రకటన!
Viral Video - Tragic Football Incident: ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతున్న మ్యాచ్.. అంత‌లోనే పిడుగుపాటు.. ప్లేయ‌ర్ మృత్యువాత‌.. 12 మందికి గాయాలు!
ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతున్న మ్యాచ్.. అంత‌లోనే పిడుగుపాటు.. ప్లేయ‌ర్ మృత్యువాత‌.. 12 మందికి గాయాలు!
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget