అన్వేషించండి

PM Modi: రూపాయికి 66వేల రూపాయల పెట్టుబడి! ప్రధాని మోదీ విదేశీ పర్యటన ఖర్చుపై కీలక ప్రకటన!

PM Modi: ప్రధాని మోదీ విదేశీ పర్యటనలపై ప్రభుత్వం చేసిన ఖర్చుకు, దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడులకు మధ్య ఉన్న సంబంధంపై రాజ్యసభలో కీలక ప్రకటన చేసింది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చు, భారీ ఎఫ్‌డీఐ నిష్పత్తి వెల్లడి.
  • ప్రతి రూపాయి ఖర్చుకు 65,620 రూపాయల ఎఫ్‌డీఐ లభించిందని లెక్కలు.
  • 2021-2025 మధ్య ₹482 కోట్లు ఖర్చు, ₹31.69 లక్షల కోట్ల ఎఫ్‌డీఐ.
  • పర్యటనలు ఆర్థిక సంబంధాలు బలపరిచినా, పెట్టుబడులు ఇతరత్రా ఆధారపడతాయి.

PM Modi: భారత విదేశాంగ విధానం, ఆర్థిక దౌత్యంలో ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలు ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటూ వచ్చాయి. తాజాగా ఈ పర్యటనల కోసం ప్రభుత్వం చేసిన ఖర్చు, అదే కాలంలో దేశంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు  మధ్య ఉన్న ఆసక్తికరమైన నిష్పత్తిని రాజ్యసభలో వెల్లడించిన లెక్కలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. 2021 నుంచి 2025 మధ్య కాలంలో ప్రధాని పర్యటనల కోసం వెచ్చించిన ప్రతి రూపాయికి , దేశానికి సుమారు 66వేల రూపాయల ఎఫ్‌డీఐ లభించినట్టు ఈ లెక్కలు చెబుతున్నాయి. 

రాజ్యసభలో సమర్పించిన సమాచారం ప్రకారం, ఏప్రిల్‌ 2021 నుంచి డిసెంబర్‌ 2025 మధ్య కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల కోసం ప్రభుత్వం మొత్తం 482.92 కోట్లు ఖర్చు చేసింది. ఇదే కాలంలో భారత్‌కు అందిన మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 381.8 బిలియన్ డాలర్లు. 

దీనిని భారత కరెన్సీలోకి మార్చి చూస్తే మొత్తం పెట్టుబడుల విలువ దాదాపు 31, 69లక్షల కోట్లు అవుతుంది. ఈ రెండు లెక్కలు చూస్తే ప్రధాని పర్యటనలపై పెట్టిన ప్రతి ఒక రూపాయి ఖర్చుకు దేశానికి 65, 620 రూపాయలు పెట్టుబడిగా వచ్చినట్టు స్పష్టమవుతోంది. 

ఏడాది వారీగా పర్యటనల ఖర్చు వివరాలు

కరోనా మహమ్మారి తర్వాత అంతర్జాతీయ దౌత్య సంబంధాలు మళ్లీ పుంజుకోవడంతో ప్రధాన పర్యటనల ఖర్చు కూడా క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2021లో మూడు పర్యటనల ఖర్చు రూ. 36.12. 2022లో ఏడు పర్యటనలు చేశారు. దీని కోసం  55. 83 కోట్లు ఖర్చు చేశారు. 2023లో ఆరు దేశాల్లో పర్యటనకు అయిన ఖర్చు 93. 63 కోట్లు. 2024లో 109.51 కోట్లు ఖర్చు చేసి 11దేశాల్లో పర్యటించారు. 2025లో  187.83 కోట్లతో 11 పర్యటనలు చేశారు. 2026 జూన్ వరకు ఆరు పర్యటనలు చేశారు. దీని కోసం చేసిన ఖర్చు 187.33 కోట్లు. మొత్తంగా ఏప్రిల్ 2021 నుంచి డిసెంబర్‌2025 వరకు ప్రధాని మొత్తంగా 38 పర్యటనలు చేశారు. 

ప్రధాని పర్యటనలు కేవలం దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలకే పరిమితం కాలేదని, అవి ఆర్థిక భాగస్వామ్యాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ పర్యటనల సందర్భంగా కుదుర్చుకున్న ఎంవోయూలు వివిధ రంగాల్లో విదేశీ పెట్టబడులకు మార్గం సుగమం చేస్తున్నాయని వెల్లడించింది. 

అయితే ఈ లెక్కలను విశ్లేషించేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రధాని పర్యటనల ఖర్చుకు, వచ్చిన పెట్టుబడులకు మధ్య చూపిస్తున్న కేవలం ఒక పోలిక మాత్రమే. వచ్చిన పెట్టుబడులన్నీ  నేరుగా ప్రధాని పర్యటన ద్వారా వచ్చినవని ప్రభుత్వం ఎక్కడా నేరుగా చెప్పలేదు. విదేశీ పెట్టబడులు అనేది దేశ ఆర్థిక విధానాలు, మార్కెట్‌ పరిస్థితులు, ప్రపంచ ఆర్థిక గమనంపై కూడా ఆధారపడి ఉంటాయి. 

Frequently Asked Questions

ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చుకు, వచ్చిన పెట్టుబడులకు నిష్పత్తి ఎంత?

ఏప్రిల్ 2021 నుండి డిసెంబర్ 2025 వరకు ప్రధాని పర్యటనలపై ఖర్చు చేసిన ప్రతి రూపాయికి, దేశానికి సుమారు 66,000 రూపాయల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) లభించాయి. ఇది ఆర్థిక దౌత్యానికి సానుకూల సంకేతం.

ఏప్రిల్ 2021 నుండి డిసెంబర్ 2025 మధ్య ప్రధాని విదేశీ పర్యటనలకు ఎంత ఖర్చయింది మరియు ఎంత FDI లభించింది?

ఈ కాలంలో ప్రధాని పర్యటనల కోసం 482.92 కోట్లు ఖర్చవ్వగా, భారత్‌కు 381.8 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు లభించాయి. ఇది సుమారు 31.69 లక్షల కోట్ల రూపాయలు.

ప్రధాని విదేశీ పర్యటనల ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి?

ప్రధాని పర్యటనలు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలతో పాటు ఆర్థిక భాగస్వామ్యాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ పర్యటనల ద్వారా విదేశీ పెట్టుబడులకు మార్గం సుగమమవుతుంది.

ప్రధాని పర్యటనల వల్లనే విదేశీ పెట్టుబడులు వస్తున్నాయని ప్రభుత్వం నేరుగా చెప్పిందా?

లేదు, వచ్చిన పెట్టుబడులన్నీ నేరుగా ప్రధాని పర్యటనల వల్లనే అని ప్రభుత్వం నేరుగా చెప్పలేదు. విదేశీ పెట్టుబడులు ఆర్థిక విధానాలు, మార్కెట్ పరిస్థితులు, ప్రపంచ ఆర్థిక గమనం వంటి ఇతర అంశాలపై కూడా ఆధారపడి ఉంటాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi: రూపాయికి 66వేల రూపాయల పెట్టుబడి! ప్రధాని మోదీ విదేశీ పర్యటన ఖర్చుపై కీలక ప్రకటన!
రూపాయికి 66వేల రూపాయల పెట్టుబడి! ప్రధాని మోదీ విదేశీ పర్యటన ఖర్చుపై కీలక ప్రకటన!
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Advertisement

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget