అన్వేషించండి

 Wellington Defence Staff College: 'బిపిన్ రావత్' హెలికాప్టర్ క్రాష్.. మరో 10 నిమిషాల్లో ల్యాండ్ అవ్వాల్సింది.. ఇంతలోనే..

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్రాష్ అయింది. అయితే ఆయన డిఫెన్స్ సర్వీసెస్ కాలేజీకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఆయన మృతి చెందారు.

భారత మెుట్ట మెుదటి సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్రాష్ అయింది. ఆయన వెల్లింగ్టన్ లోని డిఫెన్స్ సర్వీసెస్ కాలేజీలో లెక్చరర్ ఇచ్చేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. తమిళనాడులోని కూనూరు సమీపంలో హెలికాప్టర్ క్రాష్ అయింది. ఇప్పటి వరకూ.. 13 మంది చనిపోయారు. హెలికాప్టర్ లో మెుత్తం 14 మంది ప్రయాణించారు. మృతుల్లో బిపిన్ రావత్ కూడా ఉన్నారు.  

ఈరోజు ఉదయం బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్, ఇతర ఆర్మీ అధికారులు.. విమానంలో ఢిల్లీ నుంచి తమిళనాడుకు బయలుదేరారు. సుమారు 11.35 గంటలకు సూలూరు ఎయిర్ ఫోర్స్ కు చేరుకుంది. ఆ తర్వాత..  ఎంఐ-17వీఎఫ్‌ హెలికాప్టర్‌లో వెల్లింగ్టన్ లోని డిఫెన్స్ సర్వీస్ కాలేజీలో లెక్చరర్ ఇచ్చేందుకు రావత్ బృందం బయలుదేరింది. ప్రయాణిస్తుండగా.. ఒక్కసారిగా.. సుమారు 12.20 గంటల సమయంలో హెలికాప్టర్ క్రాష్ అయింది. 

సూలూర్ ఐఏఎఫ్ స్థావరం నుంచి వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ కాలేజీ (డీఎస్‌సీ)కి వెళ్తుండగా హెలికాప్టర్ కూలిపోయింది.  మరో 10 నిమిషాల్లో హెలికాప్టర్ ల్యాండ్ అవ్వాల్సి ఉంది. తర్వాత రోజు జరిగే ఓ కార్యక్రమంలో బిపిన్ రావత్ పాల్గొనాల్సి ఉంది. హెలికాప్టర్ క్రాష్ అయిన ప్రాంతం వెల్లింగ్టన్‌ ఆర్మీ క్యాంప్‌కు 16 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. పది నిమిషాల్లో ఆర్మీ క్యాంప్‌లో హెలికాప్టర్‌ ల్యాండ్‌ అవ్వాల్సి ఉంది. అంతలోనే ఈ ప్రమాదం జరిగింది.

2019 డిసెంబర్ లో ఆర్మీ చీఫ్‌గా పదవీ విరమణ చేసిన భారతదేశపు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా బిపిన్ రావత్ బాధ్యతలు చేపట్టారు. గతంలోనూ రావత్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఫిబ్రవరి 3, 2015న నాగాలాండ్‌లోని దిమాపూర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ఆ సమయంలో ఆయన లెఫ్టినెంట్ జనరల్.

Also Read: Chopper Crash Coonoor: కుప్పకూలిన సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్.. 14 మందిలో 13 మంది మృతి!

Also Read: Mi 17V Helicopter : వరల్డ్ బెస్ట్ హెలికాఫ్టర్లలో ఒకటి Mi-17V-5 ..! మరి ప్రమాదం ఎలా జరిగింది ?

Also Read: Chief of Defence Staff: ఏంటీ సీడీఎస్.. కార్గిల్ యుద్ధ కాలంలోనే ఈ పదవిపై చర్చలు జరిగాయా?

Also Read: CDS Bipin Rawat Helicopter Crash: సీడీఎస్ హెలికాప్టర్ ప్రమాదంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సమీక్ష

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Fact Check: రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Embed widget