Coonoor Crash Video: బిపిన్ రావత్ హెలికాప్టర్ చివరి క్షణాల్లో ఇలా.. పెద్ద శబ్దంతో దట్టమైన మంచులోకి.. వీడియో
తమిళనాడులోని కునూరు అటవీ ప్రాంతంలో ఈ ఎంఐ-17 ఆర్మీ హెలీకాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ సహా 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ మరణించిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మొత్తం 13 మంది ఆర్మీ ఉన్నతాధికారులు మరనించారు. ఈ దుర్వార్త విని దేశమంతా విషాదం అలుముకుంది. అయితే, వారు ప్రయాణించిన ఎంఐ-17 హెలికాప్టర్ చివరి దృశ్యాలు ఇప్పుడు బయటికి వచ్చాయి. సరిగ్గా ప్రమాదం జరిగేందుకు ఒక నిమిషం ముందు కింది నుంచి తీసిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. అదే ప్రాంతంలో ఉన్న స్థానికులు ఆ వీడియోలను తమ సెల్ ఫోన్లలో బంధించారు. హెలికాప్టర్ ప్రయాణిస్తూ దట్టమైన పొగమంచులో కనుమరుగు కావడం ఆ వీడియోలో కనిపిస్తోంది. కింద ఉన్న స్థానికులు కూడా ఏదో పెద్ద శబ్దంతో భయంతో వెళ్లిపోతున్నట్లు వీడియోలు బయటకు వచ్చాయి.
తమిళనాడులోని కునూరు అటవీ ప్రాంతంలో ఈ ఎంఐ-17 ఆర్మీ హెలీకాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ సహా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ సైనికుడు కూడా అదే హెలికాప్టర్‌లో ఉండి మరణించారు.
నేడు ఢిల్లీకి భౌతిక కాయాలు
హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన బిపిన్ రావత్, ఆయన సతీమణి మృతదేహాలను గురువారం ఢిల్లీ తీసుకువెళ్లనున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజలకు అంతిమ నివాళులర్పించేందుకు అనుమతిస్తారు. ఆ తర్వాత ఢిల్లీ కంటోన్మెంట్‌లోని బ్రార్ స్క్వేర్ శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర సాగనుంది. అంత్యక్రియల ఊరేగింపు కామరాజ్ మార్గ్ నుండి ప్రారంభమవుతుంది. గురువారం సాయంత్రంలోగా వారి పార్థివ దేహాన్ని సైనిక విమానంలో దేశ రాజధానికి తీసుకు వచ్చే అవకాశం ఉంది.
#WATCH | Final moments of Mi-17 chopper carrying CDS Bipin Rawat and 13 others before it crashed near Coonoor, Tamil Nadu yesterday
— ANI (@ANI) December 9, 2021
(Video Source: Locals present near accident spot) pic.twitter.com/jzdf0lGU5L
Also Read: Bipin Rawat: "అగ్గిపెట్టె" కారణంగా ఎన్డీఏలోకి రావత్ ఎలా వచ్చారు?
Also Read: CDS Bipin Rawat Helicopter Crash: సీడీఎస్ హెలికాప్టర్ ప్రమాదంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ప్రకటన
Also Read: Mi 17V Helicopter : వరల్డ్ బెస్ట్ హెలికాఫ్టర్లలో ఒకటి Mi-17V-5 ..! మరి ప్రమాదం ఎలా జరిగింది ?
Also Read: CDS Bipin Rawat Chopper Crash: బిపిన్ రావత్.. ఆర్మీ లెజెండ్.. వెన్నుచూపని యోధుడు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి