Who Is Next CDS : తదుపరి త్రివిధ దళాధిపతిగా ఆయనే .. త్వరలో అధికారిక ప్రకటన !
భారత తదుపరి త్రివిధ దళాధిపతిగా జనరల్ నరవణెను ఖరారు చేసే అవకాశం ఉంది.
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ఆకస్మిక మరణం అందర్నీ కలచి వేస్తోంది. త్రివిధ దళాలను షాక్‌కు గురి చేసింది. సీడీఎస్ బాధ్యతలు అత్యంత కీలకమైనవి. అందుకే తదుపరి సీడీఎస్ ఎవరు అన్నదానిపై ఆసక్తి ఏర్పడింది. ఒక వేళ ప్రమాదం జరగకపోయినా వచ్చే నెలలోనే బిపిన్ రావత్ పదవీ విరమణ చేయాల్సి ఉంది. అందుకే తదుపరి సీడీఎస్ ఎవరన్నదానిపై ఇప్పటికే అంతర్గతంగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు కూడా ప్రారంభించింది.
Also Read : ఎట్టకేలకు హెలికాప్టర్ బ్లాక్ బాక్స్ లభ్యం.. డీకోడింగ్ కోసం తరలింపు.. వీడియో
త్రివిధ దళాధిపతిగా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లకు సారధ్యం వహిస్తున్న వారిలో ఒకరిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్మీ అధిపతిగా ఉన్న జనరల్ మనోజ్ ముకుంద్ నరవణె అందరి కన్నా సీనియర్. ఆయనే ఈ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆర్మీ, నేవీ, వాయుసేన అధిపతుల్లో ఒకరిని సీనియార్టీ ప్రకారం ఈ పదవికి ఎంపిక చేస్తారు. నేవీ, వాయుసేనల అధిపతులు ఇటీవల కాలంలోనే పదవులు చేపట్టినందున వారిలో సీనియర్ అయిన జనరల్ నరవణెకే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
బిపిన్ రావత్ తర్వాత ఆర్మీ చీఫ్‌గా 2019 డిసెంబరు 31న బాధ్యతలు చేపట్టారు. నేవీ అధిపతిగా అడ్మిరల్ ఆర్.హరి కుమార్ డిసెంబర్ మొదట్లో బాధ్యతలు తీసుకున్నారు. వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌధరి రెండు నెలల కిందటే బాద్తలు తీసుకున్నారు. అందుకే వారితో పోలిస్తే జనరల్ నరవణెకే అవకాశాలు అధికంగా ఉన్నట్టు భావిస్తున్నారు. నరవణె సీడీఎస్ అయితే ఆర్మీ అధిపతిగా నార్తరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ యోగేష్ కుమార్ జోషీకిగానీ, ఆర్మీ ఉప అధిపతి లెఫ్టినెంట్ జనరల్ చండీ ప్రసాద్ మహంతికిగానీ అవకాశాలు ఉన్నాయి.
Also Read: Chief of Defence Staff: ఏంటీ సీడీఎస్.. కార్గిల్ యుద్ధ కాలంలోనే ఈ పదవిపై చర్చలు జరిగాయా?
ప్రస్తుతం ఉన్న క్లిష్టమైన పరిస్థితుల కారణంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే త్రివిద దళాధిపతిని నియమించే అవకాశం ఉంది. భారత్‌లో అంతకు ముందు త్రివిద దళాధిపతి లేరు. 2019లోనే తొలి సారిగా ఆ పదవి ఏర్పాటు చేసారు. తొలిసారిగా బిపిన్ రావత్ బాధ్యతలు చేపట్టారు. కొత్త సీడీఎస్‌ను రక్షణ వ్యవహారాల కేబినెట్ సబ్ కమిటీ ఖరారు చేయనుంది.
Also Read: CDS Bipin Rawat Chopper Crash: బిపిన్ రావత్.. ఆర్మీ లెజెండ్.. వెన్నుచూపని యోధుడు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి