Covid Update: ఏపీలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి.. 5 వేలకు చేరువలో కేసులు
ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కొత్తగా 4,955 కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. 24 గంటల్లో 35,673 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 4,955 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా ఒకరు మృతి చెందారు. మరో 397 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,870 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. విశాఖ జిల్లాలో 1,103, చిత్తూరు 1,039, శ్రీకాకుళం 385, గుంటూరు 377, తూర్పు గోదావరి 327, అనంతపురం జిల్లాలో 300 కరోనా కేసులు చొప్పున నమోదయ్యాయి.
#COVIDUpdates: 15/01/2022, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) January 15, 2022
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,98,815 పాజిటివ్ కేసు లకు గాను
*20,61,436 మంది డిశ్చార్జ్ కాగా
*14,509 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 22,870#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/7q8OdMZ6tg
దేశంలో కేసులు
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇరవై నాలుగు గంటల్లో ఆరువేల నలభై ఒక్క కేసులు నమోదయ్యాయి. నిన్నటి కేసులతో పోల్చుకుంటే ఐదు శాతం ఎక్కువ. కరోనా కేసులు సంఖ్య కూడా భారీగా రిజిస్టర్ అయ్యాయి. రెండు లక్షల అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ముఫ్పై మూడు కేసులు వెలుగు చూశాయి.
కొత్తగా వెలుగు చూసిన కేసులతో ఇప్పుడు యాక్టివ్ కేసులు పద్నాలుగు లక్షల పదిహేడు వేల ఎనిమిది వందల ఇరవైకి చేరుకుంది. రోజువారి పాజిటివ్ రేటు 16.66 వద్ద ఉంది. 24 గంటల్లో 1,22, 684 మంది వైరస్ బారిన పడి రికవరీ అయ్యారు. అటు రికవరీ రేటు 95.20గా ఉంది.
24 గంటల్లో 402 మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4, 85, 752కు చేరింది.