Tirupati Airport Row : తిరుపతి ఎయిర్‌పోర్టు దగ్గర రోడ్లు తవ్వేసిందెవరు ? విచారణకు చెన్నై నుంచి అధికారులు...
తిరుపతి ఎయిర్‌పోర్టుకు నీటి సరఫరా నిలిపివేసిన ఉదంతం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. దీనిపై చెన్నై నుంచి అధికారుల కమిటీ వచ్చి నిజానిజాలను నిర్ధారించనుంది.
తిరుపతి విమానాశ్రయానికి, ఎయిర్‌పోర్టు సిబ్బంది ఉండే కాలనీకి నీటి సరఫరా ఆపేసిన అంశం ఢిల్లీ స్థాయికి చేరింది. ఎయిర్‌పోర్టులోకి వెళ్లడానికి పర్మిషన్ లేదని అడ్డుకున్నందున .. తిరుపడి రెండో డిప్యూటీ మేయర్, ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి వాటర్ సప్లయ్ నిలిపివేస్తూ పైప్ లైన్లు పగలగొట్టి, ట్యాంకర్లు కూడా వెళ్లకుండా రోడ్లు కూడా తవ్వేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఇదే విషయాన్ని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సింధియా ఘటనపై విచారణకు ఆదేశించారు.
We will examine the issue at our end & take necessary action. Passengers & staff at the airport will not face any further inconvenience. https://t.co/6rk6E6vqYN
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) January 13, 2022
Also Read: ఇట్స్ అఫీషియల్.. రాజకీయాలకు చిరంజీవి రిటైర్మెంట్ ! ఓటమి ఒప్పుకున్నట్లేనా ?
విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి నిర్ణయించడంతో ఈ మేరకు ఎయిర్‌పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు ఇచ్చింది. చెన్నై యూనిట్‌కు చెందిన అధికారుల కమిటీ విచారణ జరిపి జరిగిందేమిటో తేల్చనున్నారు. సున్నితమైన అంశం కావడంతో ఎయిర్ పోర్టు అధికారులెవరూ మీడియాతో మాట్లాడటం లేదు. అలాగే తిరుపతి మున్సిపల్ అధికారులు కూడా స్పందించడం లేదు.
Also Read: తిరుపతి ఎయిర్‌పోర్టు అధికారులు-లీడర్స్ మధ్య రగడ.. ఆయన తీరే కారణమా! ప్రతీకారం కూడా..?
కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం.. అది కూడా భద్రత పరంగా అత్యంత సన్నితమైన విమానాశ్రయానికి సంబధించిన వ్యవహారం కావడంతో అధికారుల విచారణ కీలకంగా మారింది. ఉద్దేశపూర్వకంగానే ఎయిర్‌పోర్టుకు.. ఎయిర్‌పోర్టు సిబ్బంది ఉన్న క్వార్టర్లను నీటిని నిలిపేసి.. డ్రైనేజీ వ్యవస్థను ధ్వంసం చేసి ఉన్నట్లయితే.. కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించే అవకాశం ఉంది.
Also Read: తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ...
తిరుపతి ఎయిర్‌పోర్టుకు... ఉద్యోగుల క్వార్టర్స్‌కు నీటి సరఫరా నిలిపివేత అంశం రాజకీయంగానూ సంచనలం సృష్టించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల తీరుపై విపక్షాలు ఇప్పటికే విమర్శలు చేస్తున్నాయి. అయితే అవన్నీ తప్పుడు ఆరోపణలు అని వైఎస్ఆర్‌సీపీ నేతలంటున్నారు. చెన్నై ఎయిర్‌పోర్ట్ అధారిటీ అధికారుల నివేదిక తర్వాత నిజమేంటో బయటకు వచ్చే అవకాశం ఉంది.
Also Read: త్రివిక్రమ్ గారూ... ఆ సీన్ యూట్యూబ్‌లో రిలీజ్ చేయండి!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి