By: ABP Desam | Updated at : 14 Jan 2022 06:04 PM (IST)
Edited By: Rajasekhara
ఇట్స్ అఫీషియల్.. రాజకీయాలకు చిరంజీవి రిటైర్మెంట్ ! ఓటమి ఒప్పుకున్నట్లేనా ?
రాజ్యసభ సభ్యత్వం ముగియక ముందు నుంచే చిరంజీవి రాజకీయాల గురించి మాటలు మానేశారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం పునరుద్ధరించుకోలేదు. ఏపీలో అనేక రాజకీయ ఆందోళనలు జరుగుతున్నా ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు. ఓ వైపు బీజేపీ నుంచి ఆఫర్లు వస్తున్నాయని.. రాహుల్ గాంధీ కూడా యాక్టివ్ కావాలని కోరుతున్నారని ప్రచారం జరిగింది. కానీ చిరంజీవి ఎప్పుడూ రాజకీయ ప్రకటనలు చేయలేదు. అదే సమయంలో తాను రాజకీయాల నుంచి విరమించుకున్నానని స్వయంగా చెప్పలేదు. ఓ సారి ఆయన సోదరుడు పవన్ కల్యాణ్ మాత్రం ప్రకటించారు. ఇక చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకున్నారని మీడియాకు చెప్పారు. అయితే చిరంజీవి నోటి వెంట ఆ మాట మాత్రం ఎప్పుడూ రాలేదు. తొలి సారిగా ఇవాళ చెప్పారు. తాను రాజకీయాకు దూరం అన్నారు. ఇక మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన చిరంజీవికి లేదని క్లారిటీ వచ్చేసినట్లయింది.
రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేను మళ్ళీ రాజకీయాలలోకి,చట్టసభలకు రావటం జరగదు.దయచేసి ఊహాగానాలని వార్తలుగా ప్రసారం చేయవద్దు.ఈ వార్తలకి,చర్చలకు ఇప్పటితో పుల్ స్టాప్ పెట్టమని కోరుతున్నాను.#GiveNewsNotViews
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 14, 2022
Also Read: చిరంజీవికి జగన్ రాజ్యసభ సీటు ఆఫర్ ఇచ్చారా ? నిజమా ? మైండ్ గేమా ?
ఎన్టీఆర్ రికార్డును చెరపలేకపోయిన చిరు !
ప్రజారాజ్యం పార్టీని ప్రారంభించి ఎన్టీఆర్ తర్వాత అతి తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలనుకున్న ఆయన కలలన్నీ నెలల్లోనే కల్లలైపోయాయి. 2008 ఆగష్టు 26న ప్రజారాజ్యం పార్టీని తిరుపతిలో ప్రకటించారు. సామాజిక న్యాయం పేరుతో ప్రజల్లోకి వెళ్లారు. పార్టీకి వచ్చిన హైప్‌ను కొనసాగించడంలో విఫలం అయ్యారు. 2009లో జరిగిన ఎన్నికల్లో కేవలం 18 సీట్లతో సరిపెట్టుకున్నారు. అయితే ఆ తర్వాత నిలకడైన రాజకీయాలు చేయలేకపోయారు. ప్రజారాజ్యానికి మూడేళ్లు కూడా నిండకుండానే 2011 ఆగష్టులో కాంగ్రెస్‌లో విలీనం చేశారు. దానికి ప్రతిగా రాజ్యసభ సభ్యత్వం తీసుకున్న చిరంజీవి తర్వాత కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. యూపీఏ-2 క్యాబినెట్లో పర్యాటకశాఖ మంత్రిగా పనిచేశారు. చిరంజీవి కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే కేంద్రం ఆంధ్రప్రదేశ్ ను విభజించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్యాంధ్ర స్టాండ్ తీసుకున్న ప్రజారాజ్యం అధినేత కాంగ్రెస్ లో విలీనమైన తర్వాత కేంద్రమంత్రిగా ఉన్నా విభజనను వ్యతిరేకించలేకపోయారు.
Also Read: దేశమంతా ఒకే జీఎస్టీ - టిక్కెట్ రేట్లూ అలాగే ఉండాలి.. జగన్ సర్కార్‌కు చిరంజీవి విజ్ఞప్తి !
2014 తర్వాత కొంత కాలం రాజకీయాల్లో .. తర్వాత సినిమాల్లో బిజీ!
2014లో జరిగిన ఎన్నికల్లో యూపీఏ సర్కార్ బొక్కబోర్లా పడింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నామరూపాల్లేకుండా పోయింది. పట్టుమని పది స్థానాల్లో కూడా డిపాజిట్లు రాలేదు. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ తరపున కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేకపోవడంతో సినిమాల వైపు దృష్టి సారించారు. విభజన ఎఫెక్ట్, ఓటు బ్యాంక్ మొత్తం వైఎస్ఆర్‌సీపీతో వెళ్లిపోవడంతో ఏపీలో కాంగ్రెస్ బలపడే సూచనలు లేకపోవడంతో పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నాన్ని విరమించుకుని ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అయ్యారు.
Also Read: "టాలీవుడ్ బాస్ " పాత్రకు చిరంజీవి న్యాయం చేయలేకపోతున్నారా..!?
చిరంజీవి ఇక రాజకీయాల్లో రారని త ఎన్నికలకు ముందు పవన్ ప్రకటన !
"అన్నయ్య ఇక రాజకీయాల్లోకి రారు.. ఆయన సినిమాలు చేసుకుంటారు.." అని గతంలో ఉత్తరాంధ్ర పోరాటయాత్ర చివరి రోజుల్లో పవన్ కల్యాణ్ మీడియాకు చెప్పారు. కానీ చిరంజీవి మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. పవన్ కల్యాణ్ ఆ ప్రకటన చేసిన తర్వాతి రోజే హైదరాబాద్‌లో ఆలిండియా చిరంజీవి ఫ్యాన్స్ మొత్తం జనసేనలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసుకుని మరీ పవన్ కల్యాణ్ సమక్షంలో చేరిపోయారు. అయితే చిరంజీవి పేరు రాజకీయాల్లో అప్పుడప్పుడూ ప్రచారంలోకి వస్తోంది. కర్ణాటక ఎన్నికలప్పుడు.. ఆయన పేరు స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉంది. కానీ చిరంజీవి ప్రచారానికి వెళ్లలేదు. తాను కాంగ్రెస్ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోలేదని ఇక ఆ పార్టీతో తనకు ఏ సంబంధం లేదని చిరంజీవి పీఆర్వో టీం ఓ సారి క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు చిరంజీవే ఆ అంశంపై స్పష్టత ఇచ్చారు.
Also Read: పది రోజుల్లో సమస్యకు పరిష్కారం - చిరంజీవికి సీఎం జగన్ హామీ !
సినీ రంగంలో మెగాస్టార్..రాజకీయంలో మాత్రం ఫెయిల్ !
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ తర్వాత అంతటి ఇమేజ్ ఉన్న వ్యక్తి చిరంజీవి. సినిమా రంగంలో ఎన్నో గొప్ప విజయాలు సాధించిన ఆయన రాజకీయాల్లో మాత్రం విఫలమయ్యారు. ఓ చోట ఎమ్మెల్యేగా ఓడిపోయారు. పట్టుమని పదేళ్లు కూడా ప్రజాజీవితంలో ఇమడలేకపోయారు. పార్టీని మూడేళ్లు కూడా నడపలేకపోయారు. అయితే తాను రాజకీయాలకు అన్ ఫిట్ అని ఆయన త్వరగానే తెలుసుకుని బయటపడ్డారన్న అభిప్రాయం మాత్రం ఎక్కువ మందిలో ఉంది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
APPSC Group-4 Exam: 'గ్రూప్-4' మెయిన్స్ తేదీ ఖరారు, హాల్‌టికెట్లు ఎప్పటినుంచంటే?
Tadikonda Mla Office Attack : తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఆఫీస్ పై దాడి, ఫ్లెక్సీలు చించేసిన వైసీపీ కార్యకర్తలు!
వైజాగ్ లో జీ -20 సదస్సు హడావుడి, రూ.100 కోట్లతో సుందరీకరణ పనులు
సమ్మర్ లో కశ్మీర్ వెళ్లాలి అనుకుంటున్నారా ? ఇదిగో ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ
Nellore Ysrcp : సీఎం జగన్ కి షాకిచ్చిన నలుగురిలో ముగ్గురు నెల్లూరోళ్లే
YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్సీపీకి నష్టం చేస్తున్నాయా ?
MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!
AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు
రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల