అన్వేషించండి

Chiru Jagan Meet : పది రోజుల్లో సమస్యకు పరిష్కారం - చిరంజీవికి సీఎం జగన్ హామీ !

పది రోజుల్లో సినీ పరిశ్రమ సమస్యలకు పరిష్కారం చూపిస్తామని చిరంజీవికి సీఎం జగన్ హామీ ఇచ్చారు. జగన్ ఆహ్వానం మేరకే వచ్చానని..ఆయనతో భేటీ సంతృప్తినిచ్చిందన్నారు.


టిక్కెట్ రేట్ల అంశంపై వారం, పది రోజుల్లో కొత్త జీవోను ఏపీ ప్రభుత్వం విడుదల చేస్తుందని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌తో దాదాపుగా గంటన్నసేపు జరిగిన భేటీ తర్వాత తిరిగి వెళ్తూ విజయవాడ ఎయిర్‌పోర్టు వద్ద మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్‌తో జరిగిన సమావేశం సంతృప్తి కరంగా సాగిందన్నారు. జగన్ ఆహ్వానం మేరకే తాను ఈ రోజు వచ్చానని ఇండస్ట్రీ సమస్యలను వివరించానన్నారు. పది రోజుల్లో సినీ పరిశ్రమ తరపున డ్రాఫ్ట్ తయారు చేసి ఇస్తే దాన్నే జీవోగా ఇస్తామని హామీ ఇచ్చారని చిరంజీవి తెలిపారు. 

Also Read: ఏపీలో టికెట్ రేట్స్‌తో మాకు స‌మ‌స్య‌ లేదని ఎందుకు అన్నానంటే.. నాగార్జున వివరణ!

సినిమా ఇండస్ట్రీ పైకి కనిపించేంత గ్లామర్ ఫీల్డ్ కాదని చిరంజీవి స్పష్టం చేశారు. రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికుల వేల మందిఉన్నారన్నారు. కరోనా కారణంగా ఇండస్ట్రీలో అనిశ్చిత వాతావరణ ఏర్పిడందని... ఎంతో మంది కార్మికులు ఇబ్బంది పడుతున్నారని గుర్తు చేశారు. దీనికి తోడు టిక్కెట్ రేట్లు ఇతర సమస్యల వల్ల గత కొన్ని నెలలుగా పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందన్నారు. ఈ సమస్యలన్నింటినీ సీఎం ముందు పెట్టానన్నారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల కష్టాలు.. నిర్మాతల సమస్యలు ఇలా అన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. సీఎం జగన్ తనకు సోదరుడి లాంటి వారన్నారు.

Also Read: అక్కడ వినిపించుకునే నాథుడు ఉండాలి కదా..? టికెట్ రేట్ ఇష్యూపై బాలయ్య వ్యాఖ్యలు..

 తాను ఎవరి పక్షాన ఉండనని.. అందరిని సమదృష్టితో చూస్తానని సీఎం జగన్ చెప్పారని చిరంజీవి తెలిపారు. వారం పది రోజుల్లోనే సమస్యకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.  ఫిల్మ్ చాంబర్, ఎగ్జిబిటర్ ప్రతినిధులను పిలిచి మీటింగ్ పెడతామని జగన్ తెలిపినట్లుగా చిరంజీవి తెలిపారు. సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది కాబట్టి అందరూ సంయమనం పాటించాలని చిరంజీవి పిలుపునిచ్చారు. 

Also Read: తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ...

ధరలు పెంచుతారా.. తగ్గిస్తారా అన్నది కాదు.. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుందని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. సామాన్యులకు అందుబాటులోకి వినోదాన్ని తెచ్చేందుకే టిక్కెట్ రేట్లు తగ్గించామన్న జగన్ ప్రకటనపై చిరంజీవి భిన్నంగా స్పందించారు.  వినోదాన్ని పేదలకు అందుబాటులోకి తేవాలన్న నిర్ణయం మంచిదన్నారు. ఈ విషయంలో జగన్‌ను అభినందిస్తున్నానన్నారు. ఏదో మంచి చేయాలన్న ఆలోచన ప్రభుత్వం వైపు నుంచి కనిపిస్తోందన్నారు. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

 

 

టాప్ హెడ్ లైన్స్

Sonia Gandhi Biopic: సోనియా గాంధీ బయోపిక్‌ డైరెక్టర్ ఫిక్స్.. క్రాంతి మాధవ్ పేరును ప్రకటించిన జగ్గారెడ్డి!
సోనియా గాంధీ బయోపిక్‌ డైరెక్టర్ ఫిక్స్.. క్రాంతి మాధవ్ పేరును ప్రకటించిన జగ్గారెడ్డి!
Naga Vamsi Rishab Shetty : కాంతార హీరోతో నాగవంశీ కొత్త మూవీ - క్రేజీ టైటిల్ ఫిక్స్... జానర్ ఏంటో తెలుసా?
కాంతార హీరోతో నాగవంశీ కొత్త మూవీ - క్రేజీ టైటిల్ ఫిక్స్... జానర్ ఏంటో తెలుసా?
Samantha Ruth Prabhu : బిడ్డ పుట్టిన తర్వాత సమంత రీఎంట్రీ! - ఆ మూవీకి ఓకే చెప్పారా... రేసులో మరో వెబ్ సిరీస్?
బిడ్డ పుట్టిన తర్వాత సమంత రీఎంట్రీ! - ఆ మూవీకి ఓకే చెప్పారా... రేసులో మరో వెబ్ సిరీస్?
Chiranjeevi Kaaka : మళ్లీ ఆటో జానీ వచ్చేస్తున్నాడు - సంక్రాంతికి మాస్ జాతర కన్ఫర్మ్ 'కాకా'!
మళ్లీ ఆటో జానీ వచ్చేస్తున్నాడు - సంక్రాంతికి మాస్ జాతర కన్ఫర్మ్ 'కాకా'!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: యాచించి కాదు, శాసించి సాధించాం.. ఢిల్లీ మెడలు వంచిన నేత కేసీఆర్: అలుగునూరు సభలో కేటీఆర్
యాచించి కాదు, శాసించి సాధించాం.. ఢిల్లీ మెడలు వంచిన నేత కేసీఆర్: అలుగునూరు సభలో కేటీఆర్
Rayapati Sambasiva Rao Passes Away: మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు కన్నుమూత.. ప్రముఖులు సంతాపం
మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు కన్నుమూత.. ప్రముఖులు సంతాపం
Amanchi Krishna Mohan: వేటపాలెంలో దొంగ ఓట్ల వివాదం.. ఆమంచి కృష్ణమోహన్ కారుపై దాడి, గాలిలోకి కాల్పులు జరిపిన పోలీసులు
వేటపాలెంలో దొంగ ఓట్ల వివాదం.. ఆమంచి కృష్ణమోహన్ కారుపై దాడి, గాలిలోకి కాల్పులు జరిపిన పోలీసులు
PM Modi Tirupati Tour: ప్రధాని మోదీ 3 రోజుల తిరుపతి పర్యటన షెడ్యూల్ ఖరారు.. అమిత్ షా, అజిత్ దోవల్ సైతం
ప్రధాని మోదీ 3 రోజుల తిరుపతి పర్యటన షెడ్యూల్ ఖరారు.. అమిత్ షా, అజిత్ దోవల్ సైతం
AP Pothole Complaint: రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి 'మనమిత్ర'కు పంపండి.. వెంటనే మరమ్మతులు- ఏపీ ప్రభుత్వం
రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి 'మనమిత్ర'కు పంపండి.. వెంటనే మరమ్మతులు- ఏపీ ప్రభుత్వం
Delimitation Bill Special Majority: డీలిమిటేషన్ బిల్లు ఓటింగ్ ఎందుకింత సంక్లిష్టం?.. వాయిస్ ఓటు ద్వారా ఎందుకు ఆమోదించలేరు!
డీలిమిటేషన్ బిల్లు ఓటింగ్ ఎందుకింత సంక్లిష్టం?.. వాయిస్ ఓటు ద్వారా ఎందుకు ఆమోదించలేరు!
KTR: తుఫాను తీరం తాకినట్లు, కరీంనగర్ నుంచి కేసీఆర్ భూకంపం పుట్టించిన రోజు: దీక్షా దివస్‌లో కేటీఆర్
తుఫాను తీరం తాకినట్లు, కరీంనగర్ నుంచి కేసీఆర్ భూకంపం పుట్టించిన రోజు: దీక్షా దివస్‌లో కేటీఆర్
Kannamma OTT : ఓటీటీలోకి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ - దేవుడి విగ్రహాన్ని కాపాడే భక్తురాలి కథ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ - దేవుడి విగ్రహాన్ని కాపాడే భక్తురాలి కథ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget