X

Pooja Hegde: త్రివిక్ర‌మ్ గారూ... ఆ సీన్ యూట్యూబ్‌లో రిలీజ్ చేయండి!

ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌కు పూజా హెగ్డే ఓ రిక్వెస్ట్ చేశారు. ఓ సీన్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేయ‌మ‌ని కోరుతున్నారు. ఇంత‌కీ, అది ఏ సీన్‌? ఏమిటి ఆ క‌థ‌? ఓ లుక్కేయండి.

FOLLOW US: 

మేడ‌మ్ సార్‌... మేడ‌మ్ అంతే! - 'అల వైకుంఠ‌పుర‌ములో' సినిమాలో పూజా హెగ్డే పాత్ర గురించి మాత్ర‌మే కాదు, ఆమె న‌ట‌న గురించి చెప్పాల్సి వ‌చ్చినా... ఆ డైలాగ్ సూట్ అవుతుంది ఏమో! అమ్ము అలియాస్ అమూల్య పాత్ర‌లో పూజా హెగ్డే అంత చ‌క్క‌గా న‌టించారు. రెండేళ్ల క్రితం సంక్రాంతికి విడుద‌లైందీ సినిమా. ఈ సంద‌ర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేక్ష‌కులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చిన పూజా హెగ్డే... సినిమా గురించి కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టారు.

'క‌థ విన్న త‌ర్వాత మీ రియాక్ష‌న్ ఏంటి?' అని ఒక‌రు ప్ర‌శ్నించగా... "వింటున్నంత సేపూ న‌వ్వుతూనే ఉన్నా" అని పూజా హెగ్డే చెప్పారు. ఇంకో విష‌యం ఏంటంటే... అల్లు అర్జున్‌, సుశాంత్‌, నివేదా పేతురాజ్‌, పూజా హెగ్డే మీద ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ ఓ సీన్ తీశారు. అదంటే త‌న‌కు ఎంతో ఇష్ట‌మ‌ని, షూటింగ్ చేసేట‌ప్పుడు ఎంతో ఎంజాయ్ చేశాన‌ని పూజా హెగ్డే తెలిపారు. అది ఇప్ప‌టివ‌ర‌కూ విడుద‌ల చేయ‌లేద‌ని, బ‌హుశా టీమ్ యూట్యూబ్‌లో విడుద‌ల చేస్తుంద‌ని ఆశిస్తున్నాన‌ని ఆమె పేర్కొన్నారు.
Also Read: ఏపీలో టికెట్ రేట్స్ పెరిగితే మాకు బోనస్! టికెట్ రేట్స్ తగ్గించిన తర్వాతే... - నాగచైతన్య ఇంటర్వ్యూ
సినిమాలో మేడ‌మ్ సార్ మేడ‌మ్ అంతే డైలాగ్ త‌న‌కు న‌చ్చిన డైలాన్ అని, అది చిన్న లైన్ అయిన‌ప్ప‌టికీ ఎంతో మీనింగ్ ఉంద‌ని పూజా హెగ్డే అన్నారు. అల్లు అర్జున్ ఆ డైలాగ్ చెప్పిన విధానం అద్భుతం అన్నారు. 'బుట్ట‌బొమ్మ' షూటింగ్‌కు ముందు డేట్స్ ఇష్యూస్‌తో లండ‌న్ నుంచి హ‌డావిడిగా రావాల్సి వ‌చ్చింద‌ని, ఆ సాంగ్ సూప‌ర్‌హిట్ అవ్వ‌డం త‌న‌కు ఎంతో సంతోషంగా ఉంద‌ని పూజా హెగ్డే అన్నారు. ఇటీవ‌ల చెన్నై బీచ్‌కు వెళ్లినప్పుడు... కొంత‌మంది 'బుట్ట‌బొమ్మ‌... బుట్ట‌బొమ్మ' అని పిలిచార‌ని, ఎంతో సంతోష‌మేసింద‌ని ఆమె తెలిపారు. అయితే... సినిమాలోని 'సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న' పాట త‌న ఫేవ‌రెట్ అన్నారు. అల్లు అర్జున్ కుమార్తె అర్హ‌తో క‌లిసి కేర్‌వ్యాన్‌లో 'రాములో... రాములా' పాట‌కు డ్యాన్స్ వేసిన వీడియో కూడా పూజా హెగ్డే ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

View this post on Instagram
 
A post shared by Pooja Hegde (@hegdepooja)

Also Read: పవన్ కల్యాణ్‌తో వ‌న్స్‌మోర్ ప్లీజ్... - నిధి అగర్వాల్ ఇంటర్వ్యూ
Also Read: థియేటర్ల కోసం సినిమాలు దాచాల్సిన అవసరం నాకు లేదు! వాళ్లు హ్యాపీగా ఉండాలనే... - నాని ఇంటర్వ్యూ
Also Read: అమ్మో... అప్పుడు చాలా భయపడ్డాను! - సాయి పల్లవి ఇంటర్వ్యూ
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Allu Arjun ala vaikunthapurramuloo Pooja hegde Trivikram Buttabomma AVPL Pooja Hegde Allu Arha Allu Arha Dance For Buttabomma

సంబంధిత కథనాలు

Samantha: నేను ఇంకా బ్రతికి ఉన్నానంటే వారిద్దరే కారణం.. సమంత పోస్ట్..

Samantha: నేను ఇంకా బ్రతికి ఉన్నానంటే వారిద్దరే కారణం.. సమంత పోస్ట్..

Supritha: సురేఖావాణి కూతురు ఓల్డ్ ఐడియా.. వర్కవుట్ అవ్వలేదే.. 

Supritha: సురేఖావాణి కూతురు ఓల్డ్ ఐడియా.. వర్కవుట్ అవ్వలేదే.. 

Maruthi About Prabhas Movie: ప్ర‌భాస్‌తో సినిమా... కాదని చెప్పలేదు! అలాగని, కన్ఫర్మ్ చేయలేదు!

Maruthi  About Prabhas Movie: ప్ర‌భాస్‌తో సినిమా... కాదని చెప్పలేదు! అలాగని, కన్ఫర్మ్ చేయలేదు!

Akhanda on OTT: ఓటీటీలో 'అఖండ' రికార్డ్.. 24 గంటలు గడవకముందే..

Akhanda on OTT: ఓటీటీలో 'అఖండ' రికార్డ్.. 24 గంటలు గడవకముందే..

AAGMC Teaser: దర్శకుడిగా సుధీర్ బాబు... డాక్ట‌ర్‌గా కృతి శెట్టి! ఇద్దరి మధ్య ఏం జరిగిందంటే?

AAGMC Teaser: దర్శకుడిగా సుధీర్ బాబు... డాక్ట‌ర్‌గా కృతి శెట్టి! ఇద్దరి మధ్య ఏం జరిగిందంటే?
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Snakes Near Dead Body: ఇంట్లో శవం.. ఆ గది నిండా 124 పాములు.. ఏం జరిగింది?

Snakes Near Dead Body: ఇంట్లో శవం.. ఆ గది నిండా 124 పాములు.. ఏం జరిగింది?

Union Budget 2022: ఒక్కో మంత్రిది ఒక్కో స్టైల్‌! ఆర్థిక మంత్రుల బ్రీఫ్‌కేస్‌ స్టైల్‌ చూడండి!

Union Budget 2022: ఒక్కో మంత్రిది ఒక్కో స్టైల్‌! ఆర్థిక మంత్రుల బ్రీఫ్‌కేస్‌ స్టైల్‌ చూడండి!

Telangana Corona Update: తెలంగాణలో కొత్తగా 4,393 కరోనా కేసులు నమోదు.. ఇద్దరు మృతి

Telangana Corona Update: తెలంగాణలో కొత్తగా 4,393 కరోనా కేసులు నమోదు.. ఇద్దరు మృతి

KL Rahul Record: ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు రేటు.. జాక్‌పాట్ కొట్టిన కేఎల్ రాహుల్.. ఒప్పందం విలువ ఎంతంటే?

KL Rahul Record: ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు రేటు.. జాక్‌పాట్ కొట్టిన కేఎల్ రాహుల్.. ఒప్పందం విలువ ఎంతంటే?