Chandrababu: మద్దత ధర అడిగితే అక్రమంగా కేసు పెట్టారు.. పండగ పూట రైతును జైల్లో పెట్టారు
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రైతులకు ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గానికి చెందిన రైతు నరేంద్రను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. మద్దతు ధర అడిగితే అక్రమంగా కేసు పెట్టడమేంటని ప్రశ్నించారు. అన్నదాతలకు ప్రభుత్వం తప్పకుండా క్షమాపణలు చెప్పాలన్నారు. శావల్యాపురానికి చెందిన రైతు నరేంద్ర ఎలాంటి తప్పు చేయలేదన్నారు. సంక్రాంతి పండగ రోజున నరేంద్ర జైలులో ఉండటానికి కారణమైన వైసీపీ ప్రభుత్వం వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. పండుగ రోజున అన్నదాత కుటుంబం క్షోభకు కారణమైన ప్రభుత్వాన్ని.. రైతులు క్షమించరన్నారు.
మద్దతు ధర అడగడమే.. ఆ రైతు చేసిన తప్పైందని.. అలాంటి ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. జగన్ ప్రభుత్వం.. మెుత్తం ప్రభుత్వాన్నే.. అవమానించిందని చెప్పారు. వినుకొండ ఎమ్మెల్యే ఆదేశాలతోనే.. అక్రమ కేసు పెట్టినట్టు తెలిసిందని చంద్రబాబు అన్నారు. తప్పుడు కేసు పెట్టిన వినుకొండ రూరల్ సీఐ అశోక్ కుమార్ సస్పెండ్ అయ్యారన్నారు. ప్రభుత్వం తన తప్పు తెలుసుకుని వెంటనే రైతు నరేంద్రను విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. నరేంద్ర కుటుంబానికి పరిహారం చెల్లించాలన్నారు.
వినుకొండ రైతు నరేంద్రను వెంటనే జైలు నుంచి విడుదల చెయ్యాలి.
— N Chandrababu Naidu (@ncbn) January 15, 2022
గుంటూరు జిల్లా, వినుకొండ నియోజకవర్గం, శావల్యాపురం రైతు నరేంద్ర ను వెంటనే జైలు నుంచి విడుదల చెయ్యాలి. చేయని తప్పుకు సంక్రాంతి పండుగ రోజు రైతు నరేంద్ర జైలులో ఉండడానికి కారణమైన వైసీపీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి.(1/3)
పండుగ పూట ఆ అన్నదాత కుటుంబం క్షోభకు కారణమైన ప్రభుత్వాన్ని రైతులోకం క్షమించదు. మద్దతు ధర అడిగిన పాపానికి రైతును జైల్లో పెట్టి @ysjagan ప్రభుత్వం రైతు వర్గాన్నే అవమానించింది. వినుకొండ ఎమ్మెల్యే ఆదేశాలతోనే అక్రమ కేసు పెట్టినట్లు ఇప్పటికే నిర్ధారణ అయ్యింది.(2/3)
— N Chandrababu Naidu (@ncbn) January 15, 2022
తప్పుడు కేసు పెట్టిన వినుకొండ రూరల్ సీఐ అశోక్ కుమార్ సస్పెండ్ అయ్యారు. ప్రభుత్వం తన తప్పు తెలుసుకుని వెంటనే రైతు నరేంద్ర ను విడుదల చెయ్యాలి... వేధింపులకు గురిచేసినందుకు నరేంద్ర కుటుంబానికి పరిహారం చెల్లించాలి.(3/3)
— N Chandrababu Naidu (@ncbn) January 15, 2022
Also Read: జంగాలు వచ్చి గంట వాయిస్తేనే సంక్రాంతికి పెద్దలు వచ్చేది... సిక్కోలులో ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం...
Also Read: Tirupati: తిరుమలలో ఇదేందయ్యా సామీ.. శ్రీనివాసుడి సన్నిధిలో నిబంధనలు తుంగలో తొక్కుతున్న నేతలు