Top Headlines: ఏపీలో పీపీపీ మోడల్, అసలేంటో తెలుసా? - భాగ్యనగరంలో ఇళ్ల ధరలకు రెక్కలు, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Top Headlines In AP And Telangana:
1. ఏపీలో పీపీపీ మోడల్, అసలేంటో తెలుసా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పబ్లిక్,ప్రైవేటు పార్టనర్ షిప్ గురించి ఇటీవలి కాలంలో ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకూ ఈ మోడల్ కొన్ని విభాగాల్లో అమలు చేస్తున్నారు. అయితే చంద్రబాబునాయుడు ఏపీలో అభివృద్ధి పనులకు ఈ మోడల్ అనుసరించాలనుకుంటున్నారు. అంటే రోడ్లను ప్రైవేటు కంపెనీలతో వేయిస్తారు. ప్రజల నుంచి టోల్ వసూలు చేస్తారు. ఇప్పటి వరకూ జాతీయ రహదారుల్లో ఈ విధానం ఉంది. ఇప్పుడు రాష్ట్ర రహదారులకూ తీసుకు వస్తారు. అలాగే గోదావరి నీటిని బనకచర్ల వరకూ తీసుకెళ్లేందుకూ ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. ఇంకా చదవండి.
2. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు
రాప్తాడు నియోజకవర్గ ప్రజల వాణిని మరోసారి ఎమ్మెల్యే పరిటాల సునీత అసెంబ్లీలో వినిపించారు. అసెంబ్లీలో జాకీ పరిశ్రమ తెలంగాణకు తరలిపోయిన అంశం గురించి బుధవారం ప్రస్తావించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి వల్ల జాకీ సంస్థ రాప్తాడు సమీపంలో పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందన్నారు. 2017లో పరిశ్రమ ఏర్పాటు కోసం 27 ఎకరాలను.. ఏపీఐఐసీ ద్వారా ఉత్తర్వులు ఇచ్చినట్టు గుర్తు చేశారు. రూ.129 కోట్లు పెట్టుబడి పెట్టి ఏటా 32.4 మిలియన్ల దుస్తులను తయారు చేసే పరిశ్రమ పనులు కూడా 2018లో ప్రారంభించారని తెలిపారు. ఇంకా చదవండి.
3. రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం స్లంప్‌నకు కారణంగా హైడ్రా విమర్శలు ఎదుర్కొంటోంది. హైడ్రా భయంతో ఇళ్లు కొనాలనుకున్న వాళ్లు కూడా ఆగిపోయారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీనికి హైడ్రా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నిజానికి హైడ్రా చట్టవిరుద్దమన ఒక్క బిల్డింగ్ ను కూడా కూల్చలేదు.ఇంకా చెప్పాలంటే ప్లాన్లు వంటి వాటి జోలికి కూడా వెళ్లలేదు. చెరువు స్థలాల్లో,.. ప్రభుత్వ స్థలాల్లో ఉన్న అనుమతులు లేని భవనాలనే కూల్చారు. ఇంకా చదవండి.
4. భాగ్యనగరంలో ఇళ్ల ధరలకు రెక్కలు
2024-25 ఆర్థిక సంవత్సరం (FY25) ప్రథమార్థంలో (2024 ఏప్రిల్-సెప్టెంబర్ కాలం), భారతదేశంలోని టాప్-7 నగరాల్లో అమ్ముడైన ఇళ్ల సగటు ధర రూ. 1.23 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో ఇది ఒక కోటి రూపాయలుగా ఉంది. దీంతో పోలిస్తే, ఈ ఏడాది సగటు ధర ఏకంగా 23 శాతం పెరిగింది. కోవిడ్-19 మహమ్మారి తర్వాత కొత్త లాంచ్‌లు, ఖరీదైన గృహాల విక్రయాలు పెరగడమే ఈ వృద్ధికి కారణమని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ (Anarock) వెల్లడించింది. అనరాక్ డేటాను బట్టి చూస్తే, భారతదేశ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో హైదరాబాద్ వాటా క్రమంగా పెరుగుతోంది, కీలకంగా మారుతోంది. ఇంకా చదవండి.
5. ఉమ్మడి ఆదిలాబాద్‌లో పులుల సంతతి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులుల సంచారం కలకలం రేపుతోంది. గత కొద్దిరోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులులు సంచరిస్తూ హడలెత్తిస్తున్నాయి. రోజుకో చోట పశువులపై దాడి చేస్తూ... రోడ్లపై వెళ్లే వారికి వ్యవసాయ పనుల్లో ఉన్న రైతులకు పంట చేలల్లో కనిపిస్తున్నాయి. ఇదివరకే నిర్మల్ జిల్లాలో హడలెత్తించిన పెద్దపులి సారంగాపూర్, అడెల్లితండా, కుంటాల మీదుగా తిరిగి మహబూబ్ ఘాట్ దాటి మామడ అటవీ ప్రాంతంలోకి ప్రవేశించింది. ఇంకా చదవండి.