Today Top Headlines: ఏపీలో రియల్ ఎస్టేట్‌కు ఊతమిచ్చేలా రూల్స్ ఛేంజ్ - తెలంగాణలో ఒక్క యాప్‌తోనే అన్నీ సేవలు, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Today Top Headlines In AP And Telangana:
1. ఏపీలో భవన నిర్మాణదారులకు గుడ్ న్యూస్
ఏపీలో బిల్డర్లు, రియల్టర్లు, డెవలపర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల నిబంధనలు సులభతరం చేస్తూ సర్కారు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ బిల్డింగ్ రూల్స్ - 2017, ఏపీ ల్యాండ్ డెవలప్‌మెంట్ రూల్స్ - 2017లో సవరణలు చేస్తూ వేర్వేరుగా జీవోలు జారీ అయ్యాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా భవన, లే అవుట్ల అనుమతుల్లో ఈ మేరకు ప్రభుత్వం మార్పులు చేసింది. ఇంకా చదవండి.
2. ఏపీలో స్కూల్ విద్యా విధానంలో సమూల మార్పులు
ఏపీలో పాఠశాల విద్యా విధానంలో తిరిగి పాత పద్ధతిని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. రాష్ట్రంలో అంగన్వాడీలతో కలిపి ఐదు రకాల పాఠశాలలనే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. జగన్(Jagan) తీసుకొచ్చిన విధానానికి స్వస్తి పలుకుతూ పాత విధానాన్నే అమలు చేయనుంది. ఈ మేరకు జీఓ నెంబర్ -117 రద్దు చేసి.. కొత్తగా తీసుకురానున్న నూతన విధానంపై పాఠశాల విద్యాశాఖ మెమో జారీ చేసింది. దీనిపై ఉపాధ్యాయులు(Teachers), విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్న అనంతరం జీవో విడుదల చేయనున్నారు. ఇంకా చదవండి.
3. తిరుమల గిరుల్లో వైకుంఠ ఏకాదశి శోభ
వైకుంఠ ఏకాదశి (Vaikunta Ekadashi) సందర్భంగా తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వివిధ కైంకర్యాలు, అభిషేకాలు, సేవల అనంతరం ఉదయం 3.45 గంటల నుంచే అధికారులు స్వామి దర్శనానికి అనుమతించారు. ప్రోటోకాల్ ప్రముఖులకు అనుకున్న సమయానికి ముందే దర్శనం కల్పించారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచే పలువురు రాజకీయ, క్రీడా ప్రముఖులు సహా సామాన్య భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారు. ఇంకా చదవండి.
4. తెలంగాణలో ఒకే యాప్‌లో అన్ని సేవలు
తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఒక్క మొబైల్ యాప్‌లోనే అన్నీ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ఆర్టీసీ, మెట్రో టికెట్లు, రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల దర్శనం, ఇతర సేవలకు సంబంధించిన టికెట్లు, పార్కులు, పర్యాటక ప్రవేశాల ఎంట్రీ టికెట్లు ఇలా ఏ సర్వీస్ కావాలన్నీ ఒకే ఒక్క క్లిక్‌తో పొందొచ్చు. ఇందుకోసం 'మీ టికెట్' యాప్‌ను రూపొందించింది. తెలంగాణ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సర్వీసెస్ డెలివరీ (ESD) సంస్థ రూపొందించిన ఈ 'మీ టికెట్' (Mee Ticket) యాప్‌ను రాష్ట్ర, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు (Minister Sridharbabu) గురువారం సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. ఇంకా చదవండి.
5. పని ఒత్తిడి భరించలేక బ్యాంకు ఉద్యోగిని ఆత్మహత్య
తీవ్ర పని ఒత్తిడి తాళలేక ఓ బ్యాంకు ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ బాచుపల్లి (Bachupally) పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పిఠాపురానికి (Pithapuram) చెందిన కోట సత్యలావణ్య (32)కు అదే ప్రాంతానికి చెందిన బత్తుల వీరమోహన్‌తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరు బాచుపల్లి కేఆర్‌సీఆర్ కాలనీలోని ఎం.ఎన్.రెసిడెన్సీలో నివాసం ఉంటున్నారు. భర్త సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కాగా.. భార్య బాచుపల్లి రాజీవ్‌గాంధీ నగర్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్‌గా చేస్తున్నారు. ఇంకా చదవండి.