Mee Ticket App: ఈ యాప్ మీ దగ్గర ఉంటే చాలు - క్యూలైన్లలో నిలబడాల్సిన పని లేదు, ఒక్క క్లిక్‌తోనే అన్ని సేవలు
Telangana News: తెలంగాణలో ఆర్టీసీ, దేవాలయ దర్శన టికెట్లు, పార్కులు, పర్యాటక ప్రదేశాల ఎంట్రీ టికెట్లు ఇలా అన్నీ సర్వీసులు ఒకే యాప్‌లో అందుబాటులోకి వచ్చాయి. మంత్రి శ్రీధర్‌బాబు దీన్ని ఆవిష్కరించారు.
All Services In Telangana Available In Mee Ticket App: తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఒక్క మొబైల్ యాప్‌లోనే అన్నీ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ఆర్టీసీ, మెట్రో టికెట్లు, రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల దర్శనం, ఇతర సేవలకు సంబంధించిన టికెట్లు, పార్కులు, పర్యాటక ప్రవేశాల ఎంట్రీ టికెట్లు ఇలా ఏ సర్వీస్ కావాలన్నీ ఒకే ఒక్క క్లిక్‌తో పొందొచ్చు. ఇందుకోసం 'మీ టికెట్' యాప్‌ను రూపొందించింది. తెలంగాణ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సర్వీసెస్ డెలివరీ (ESD) సంస్థ రూపొందించిన ఈ 'మీ టికెట్' (Mee Ticket) యాప్‌ను రాష్ట్ర, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు (Minister Sridharbabu) గురువారం సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ యాప్‌నకు మీ సేవ రూపకల్పన చేసింది. భవిష్యత్తులో మరింత మెరుగైన సేవలు అందించేలా యాప్స్ రూపొందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు ఈ సందర్భంగా తెలిపారు.
అన్నీ టికెట్లు ఒకే యాప్‌లో..
I am delighted to launch “Mee Ticket” app, an initiative to simplify access to various services across Telangana.
— Sridhar Babu Duddilla (@OffDSB) January 9, 2025
With “Mee Ticket,” citizens can book RTC, Metro, temple darshan, parks, zoos, boating, museums, and entertainment tickets effortlessly, all in one place. Developed… pic.twitter.com/lul0sGESMh
అన్ని రకాల టికెట్ల బుకింగ్‌ను ఒకే ప్లాట్ ఫాంపైకి తెచ్చేందుకు వీలుగా ఈ యాప్ రూపొందించినట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. 'ఈ యాప్‌లో తెలంగాణలోని 15 ప్రముఖ దేవాలయాలు, 129 పార్కులు, 54 బోటింగ్ ప్రదేశాలు, జూ, మెట్రో, ఆర్టీసీ, మ్యూజియాలు, ప్లే అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ జోన్స్‌కు సంబంధించిన టికెట్లను తీసుకోవచ్చు. జీహెచ్ఎంసీ పరిధిలోని కమ్యూనిటీ హాళ్లు, జిమ్‌లు, స్పోర్ట్ కాంప్లెక్స్‌లను బుకింగ్ చేసుకోవచ్చు. మీరు ఎంచుకున్న లొకేషన్‌కు సమీప ప్రాంతాల్లోని చూడదగిన ప్రదేశాలుంటే.. ఆ సమాచారం కూడా యాప్‌లో ఆటోమేటిక్‌గా కనిపిస్తుంది. ఈ యాప్‌ను చాలా సులువుగా వినియోగించుకోవచ్చు. యూపీఐ ద్వారా చెల్లింపులు చెయ్యొచ్చు. ఇతర ప్లాట్ ఫాంల మాదిరిగా ఈ యాప్‌లో అదనంగా ఎలాంటి ఛార్జీలను వసూలు చేయం’ అని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో 'మీ సేవ' కమిషనర్ రవికిరణ్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ డా.జి.మల్సూర్, జూపార్క్ డైరెక్టర్ డా.సునీల్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు సుపరిపాలన అందించాలన్నదే సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. టెక్నాలజీ సాయంతో పౌర సేవలను ప్రజల ముంగిటకు చేరవేస్తున్నామని.. ఈ ప్రక్రియలో సంబంధిత నిపుణులను భాగస్వామ్యం చేస్తున్నట్లు వివరించారు. అన్ని రకాల టికెట్ బుకింగ్స్‌ను ఒకే ప్లాట్ ఫాంపైకి తెచ్చేందుకు వీలుగా ఈ యాప్ రూపొందించామని.. రాబోయే రోజుల్లో ఇలాంటి తరహా యాప్‌లను మరిన్ని అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు.
Also Read: TGSRTC: ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ షాక్ - సంక్రాంతి ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు