Hyderabad News: తీవ్ర పని ఒత్తిడి - భవనం పై నుంచి దూకి బ్యాంకు మహిళా ఉద్యోగి ఆత్మహత్య, బాచుపల్లిలో తీవ్ర విషాదం
Bank Woman Employee: పని ఒత్తిడి భరించలేక ఓ బ్యాంకు ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ బాచుపల్లి పీఎస్ పరిధిలో జరిగింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Bank Woman Employee Forceful Death In Hyderabad: తీవ్ర పని ఒత్తిడి తాళలేక ఓ బ్యాంకు ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ బాచుపల్లి (Bachupally) పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పిఠాపురానికి (Pithapuram) చెందిన కోట సత్యలావణ్య (32)కు అదే ప్రాంతానికి చెందిన బత్తుల వీరమోహన్‌తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరు బాచుపల్లి కేఆర్‌సీఆర్ కాలనీలోని ఎం.ఎన్.రెసిడెన్సీలో నివాసం ఉంటున్నారు. భర్త సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కాగా.. భార్య బాచుపల్లి రాజీవ్‌గాంధీ నగర్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్‌గా చేస్తున్నారు.
వీరు సంక్రాంతికి సొంతూరికి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకున్నారు. గురువారం మధ్యాహ్నం బ్యాంకులో ఉన్నతాధికారులకు చెప్పి ఇంటికి వెళ్లిన ఆమె నేరుగా అపార్ట్‌మెంట్ టెర్రస్‌పైకి వెళ్లి కిందకు దూకారు. తీవ్ర గాయాలపాలైన ఆమెను గుర్తించిన స్థానికులు వెంటనే ఎస్ఎల్‌జీ ఆస్పత్రికి తరలించగా కొంతసేపటికే మృతి చెందారు. కొన్నాళ్లుగా బ్యాంకులో పని ఒత్తిడి ఉన్నట్లు ఆమె బంధువుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Crime News: తెలంగాణలో దారుణం - 20 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం, పగతో కోడలిని చంపి పాతేసిన అత్తమామలు