Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP Desam
అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటిడిఏ కార్యాలయం ముందు కోలాం ఆదివాసీలు మహాధర్నా కార్యక్రమం చేపట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి పెద్ద ఎత్తున కోలాం ఆదివాసీలు ఈ మహా ధర్నా కార్యక్రమానికి తరలివచ్చారు. డోలు వాయిద్యాలు వాయిస్తూ పెద్ద ఎత్తున ఉట్నూరు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ నుండి ఐటిడిఏ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఇంతకీ కోలాం ఆదివాసీలు ఈ మహా ధర్నా కార్యక్రమం ఎందుకు చేపట్టారు..? కోలాం ఆదివాసీల డిమాండ్లు ఏంటి..? ఈ అంశాలపై కోలాం ఆదివాసీ సంఘ నాయకులతో ఏబిపీ దేశం ఫేస్ టు ఫేస్. అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ IDTA కార్యాలయం ముందు కోలాం ఆదివాసీలు మహాధర్నా నిర్వహించారు. మున్నేవార్ లకు కేటాయించిన కోలావర్ అనే అంశాన్ని తొలగించాలంటూ ఆందోళనకు దిగిన కోలాం ఆదివాసీలు..ఉట్నూరు ఐటీడీఏ ముందు తమ డిమాండ్లను గట్టిగా వినిపించారు. అసలు మున్నేవార్ లకు , కోలావర్ లకు వచ్చిన వివాదం ఏంటీ..ఆదివాసీ సంఘాల నాయకులు ఏం చెబుతున్నారు...ఈ వీడియోలో చూడండి.





















