Hyderabad Gulzar House Fire Accident Reasons | నిర్మాణాలతోనే అసలు సమస్య..షార్ట్ సర్య్కూట్ కు 16ప్రాణాలు బలి | ABP Desam
హైదరాబాద్ చార్మినార్ పక్కనే ఉండే ప్రాంతం. గుల్జార్ హౌస్ కు అతి సమీపంలో ఉండే ముత్యాలు అమ్మే దుకాణంలో జరిగిన ప్రమాదం 16మంది ప్రాణాలను బలితీసుకుంది. దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కావటంతో చెలరేగిన మంటలను ఆపే లోపు అవి దట్టమైన పొగకు కారణమై..చుట్టు పక్కల ఇళ్లను నిమిషాల్లో కమ్మేశాయి. అసలు ఎటు నుంచి ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో..ఫైర్ ఎగ్జిట్ లాంటి ఎమర్జెన్సీ రెస్క్యూ ఫెసిలిటీస్ లేని నిర్మాణాలు..అడుగు తీసి అడుగు వేయలేని ఇరుకైన గల్లీలు..వెరసి పాతబస్తీలో 16ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కనీస జాగ్రత్త చర్యలు లేకుండా ఇబ్బడి ముబ్బడిగా వెలిసిపోయిన దుకాణాలు..కనీస జాగ్రత్త ప్రమాణాలు పాటించలేని నిర్మాణాలతో నే ఇంత మంది చనిపోవాల్సి వచ్చింది. ఫైర్ ఫైటర్లు అతి కష్టం మీద భారీ నిచ్చెనలు వేసుకుని..ఇళ్ల గోడలు బద్ధలు కొట్టి మనుషులను బయటకు లాగారంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎంతటి ఘోర పరిస్థితులు ఉన్నాయో. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సైతం ఇదే విషయాన్ని వెల్లడించారు. ఓ ప్లాన్ లేకుండా ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్ లో తప్పిచంుకునేందుకు కనీస అవకాశం నిర్మించిన ఈ భవనాలపై అధికారులు, ప్రభుత్వం దృష్టి సారించాలని కిషన్ రెడ్డి కోరారు.





















