(Source: ECI | ABP NEWS)
Hyderabad Beach : బీచ్ ఏర్పాటుకు కొత్వాల్ గూడ ఎందుకు ఎంచుకున్నారు..!? ఇక్కడ ప్రత్యేకతలేంటి..? | ABP
ఇప్పటి వరకూ హైదరాబాద్ వాసులు సముద్రతీరానికి వెళ్లాంటే 7 నుండి 8గంటలు ప్రయాణించి సూర్యలంక లేదా మచిలీపట్నం బీచ్ కి వెళ్లాల్సి వచ్చేది. సముద్రపు గాలుల అనుభూతి కావాలన్నా, ఆహ్లాదరకమైన బీచ్ వాతావరణంలో రోజంతా గడపాలన్నా వీక్ ఎండ్ ల్లో లాంగ్ డ్రైవ్ కు వెళ్లి , తెలంగాణ సరిహద్దులు దాటాల్సి వచ్చేది. కానీ ఇకపై బీచ్ కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదంటోంది రేవంత్ సర్కార్. హైదరాబాద్ వాసులకు బీచ్ అనుభూతికి ఏ మాత్రం తీసిపోకుండా, కృత్రిమ బీచ్ ను అతి త్వరలోనే, హైదరబాద్ నగరానికి అత్యంత చేరువలోనే , శంషాబాద్ ను ఆనుకుని ఉన్న కొత్వాల్ గ్రామంలో ఏర్పాటు చేయబోతున్నట్లు స్పష్టం చేసింది. ఇంతకీ దేశంలోనే మొట్టమొదటి కృత్రిమ బీచ్ ఏర్పాటుకు ఈ కొత్వాల్ గూడ గ్రామాన్నే ఎందుకు ఎంచుకుందనే సందేహాలు చాలా మందికి ఉన్నాయి..కొత్వాల్ గూడలో బీచ్ రాబోతుందనే వార్తలు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారాయి. సముద్రం ఉంటే కదా, బీచ్ ఉంటుంది. సముద్రం తెలంగాణలో ఎక్కడా లేదు, సముద్రతీర ఆనవాళ్లు లేవు. మరీ బీచ్ ఎలా నిర్మిస్తారు. నదిని సముద్రంగా మార్చాలన్నా, హైదరాబాద్ సమీపంలో నదికూడా లేదు. ఇలా అనేక ప్రశ్నలు , ఎన్నో సందేహాలు ప్రతీ ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. బయట జనం అంతలా షాక్ అవుతుంటే,దేశంలోనే మరో వింత, బీచ్ తమ గ్రామానికే వస్తోందని తెలిసిన కొత్వాల్ గూడ గ్రామ ప్రజల ఫస్ట్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయంటే.. మీరే వినండి..





















