CM Revanth Reddy Saraswathi Pushkara Snanam | గోదావరి పుష్కరాలకు 200కోట్లు ప్రకటన | ABP Desam
సీఎం రేవంత్ రెడ్డి సర్వసతీ నదిలో పుష్కర స్నానం చేశారు. పవిత్ర త్రివేణీ సంగమంలో ప్రాణహిత, గోదావరి నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది కలిసే చోట మంత్రి వర్గంతో కలిసి సరస్వతీ నది పుష్కరం స్నానం చేశారు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి. పుష్కరాలను పురస్కరించుకుని కాళేశ్వరం వెళ్లిన రేవంత్ రెడ్డి...సహచర మంత్రులతో కలిసి వేదపండితుల మంత్రోచ్ఛరణ మధ్య సరస్వతి నదిలో మంగళకర స్నానాన్ని చేశారు. ఆ తర్వాత అక్కడే నూతనంగా నిర్మించిన వేదికలపై నిర్వహించిన హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. పుష్కరాల ప్రారంభోత్సవ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి నదీ పుష్కరాలను ముఖ్యమంత్రి హోదాలో నిర్వహించటం తనకు దక్కిన అదృష్టమన్నారు. ప్రజలంతా సరస్వతీ నది పుష్కరాలను తరలిరావాలని కోరారు. రాబోయే గోదావరి పుష్కరాల కోసం 200 కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తున్నట్లు సభలోనే ప్రకటించారు రేవంత్ రెడ్డి. గోదావరి నదీ పరివాహక ఘాట్ ల అభివృద్ధి...పుష్కరాలకు వచ్చే భక్తులకు సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.





















