Joe root vs Virat Kohli Test Runs | సచిన్ రికార్డు కొట్టేది కొహ్లీనే అనుకున్నాం..కానీ | ABP Desam
కొవిడ్ ఈ ప్రపంచానికి ఏం చేసిందో తెలియదు కానీ….భారత క్రికెట్ కు ఎస్పెషల్లీ టెస్ట్ క్రికెట్ కు మాత్రం తీరని అన్యాయం చేసింది. కొవిడ్ టైమ్ లో వచ్చిన ఓ చిన్న బ్రేక్ కింగ్ లాంటి ప్లేయర్ ను అథ: పాతాళానికి నెట్టేస్తే అనామకుడిలా అప్పటి వరకూ ఉన్న ప్లేయర్ మోడ్రన్ డే టెస్ట్ క్రికెట్ లెజెండ్ గా మారిపోయాడు. ఎస్ ఈ కంపారిజన్ జో రూట్ అండ్ విరాట్ కొహ్లీ గురించే. ఒరేయ్ బాబు కొహ్లీ రిటైర్మెంట్ ఇచ్చేశాడు కదరా ఇప్పుడెందుకు తలుచుకోకుండా ఉండలేరా అంటే..ఎస్ ఉండలేం అండీ. ఎందుకంటే ఇప్పుడు రూట్ ఉన్న స్థానం కింగ్ విరాట్ కొహ్లీదే అని అంతా భావించారు. 2020 వరకూ. ఆ ఏడాది జులై లో ఓ కంపారిజన్ జరిగింది ఫాబ్ 4 అని. అంటే టెస్టుల్లో సచిన్ రికార్డు బ్రేక్ చేయటానికి ఆస్కారం ఉన్న అంత టాలెంట్ ఉన్న టాప్ నలుగురు ఆటగాళ్లు అన్న మాట. వాళ్లలో సచిన్ దరిదాపుల్లోకి వెళ్లే ఆటగాళ్లగా విరాట్ కొహ్లీ, స్టీవ్ స్మిత్ మధ్య విపరీతమైన పోటీ ఉండేది. 2020 జులై టైమ్ కి కొహ్లీ 27 సెంచరీలు కొట్టాడు టెస్టుల్లో..కొహ్లీ వెనకాలే స్టీవ్ స్మిత్ 26 సెంచరీలతో ఉన్నాడు. మూడో స్థానంలో కేన్ విలియమన్స్ 21 సెంచరీలతో...నాలుగో ప్లేస్ లో ఏదో ఉండాలి కాబట్టి అన్నట్లు జో రూట్ 17సెంచరీలతో ఉన్నారు. అప్పటికి వాళ్ల కెరీర్ లో టెస్టుల్లో కొట్టిన సెంచరీలు అవి. కొవిడ్ బ్రేక్ తో కొన్నాళ్లు క్రికెట్ ఆగింది. మళ్లీ మొదలైంది. కానీ కింగ్ జోరు అనూహ్యంగా పతనమైంది. 2020 నుంచి 2025 అంటే కొహ్లీ రిటైర్ అయ్యే టైమ్ కి కొహ్లీ చేసిన టెస్టు సెంచరీలు 30. అంటే ఐదేళ్లలో కేవలం మూడు సెంచరీలు. పైగా రిటైర్ కూడా అయిపోయాడు. విలియమన్స్ 12 సెంచరీలు కొట్టాడు. స్టీవ్ స్మిత్ 10సెంచరీలు కొట్టాడు. బట్ ఎవ్వరూ ఊహించని విధంగా ఐదేళ్ల క్రితం 17సెంచరీలతో ఉన్న జో రూట్...ఈ ఐదేళ్లలో 21 సెంచరీలు కొట్టి మొత్తంగా 38సెంచరీలతో వీళ్ల నలుగురు ప్లేయర్లతో తనే తోపునని నిరూపించుకోవటంతో పాటు అత్యధిక పరుగుల జాబితాలో ద్రవిడ్, కలిస్, పాంటింగ్ లాంటి వాళ్లను వెనక్కి నెట్టి సచిన్ తర్వాత తనే అనేంత స్థాయిలో నిలబడ్డాడు. ఇప్పటికి 34 ఏళ్ల వయస్సు కాబట్టి ఇంకో ఇంతే బీభత్సమైన ఫామ్ ను కొనసాగిస్తే సచిన్ అత్యధిక పరుగుల రికార్డును కూడా బ్రేక్ చేసేస్తాడేమో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు సచిన్ కి రూట్ కి ఉన్న దూరాన్ని అంటే రెండు వేల పైచిలుకు పరుగులను ఏడాదిన్నరలో సాధించాడు జో రూట్. అంత టెర్రిఫిక్ ఫామ్ లో ఉన్నాడు. మొత్తంగా మన కింగ్ విరాట్ కొహ్లీ ఉండాల్సిన స్థానంలో ఇప్పుడు అనూహ్యంగా జో రూట్ వచ్చేశాడు. తన టాలెంట్ కావచ్చు...చిన్న దేశాలపైనా టెస్టులు ఆడాడు అనే విమర్శలు కావచ్చు. ఏదైమైనా విరాట్ కొహ్లీ టెస్ట్ కెరీర్ క్లోజ్ అయిపోవటం...జో రూట్ ఊహించని స్థాయిలో ఎదిగిపోయి సచిన్ తర్వాత ఆ స్థాయిలో నిలబడటం విరాట్ అభిమానులకు అయితే కాస్త నచ్చని విషయమే.





















