Ind vs Aus Super 8 Match Highlights | ఆస్ట్రేలియా పై ఘన విజయం సాధించిన సెమీస్ లో అడుగుపెట్టిన భారత్
ఆస్ట్రేలియాకు ఇంద మాదిరి ఒరు షాకు. అస్సలు వాళ్లు పాపం ఊహించి కూడా ఉండరు. వరల్డ్ కప్ లో వాళ్ల ఫేట్ ఇలా ఫ్లిఫ్ అయిపోతుందని. ఏ ముహార్తాన ఆఫ్గాన్ చేతిలో ఓడారో తెలియదు కానీ భారత్ చేతిలోనూ కంగారూలకు పరాభవం తప్ప లేదు. సెమీస్ బెర్త్ దక్కించుకోవాలంటే ఆస్ట్రేలియా కు భారత్ మీద తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ నిన్న. కానీ దురదృష్టం ఆస్ట్రేలియాను కంగారూలా వెంటాడింది. టాస్ గెలిచి టీమ్ ఇండియాకు బ్యాటింగ్ అప్పగించి తప్పు చేశామని ఆస్ట్రేలియా ఫీల్ అయ్యేలా మన కెప్టెన్ సాబ్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ చెలరేగిపోయాడు. విరాట్ కొహ్లీ తన డకౌట్ పరిశ్రమను కొనసాగిస్తూ మరోసారి డకౌట్ కాగా..హిట్ మ్యాన్ మాత్రం వీర విధ్వంసం చేశాడు. స్టార్క్, హేజిల్ వుడ్, కమిన్స్ ఎవడినైనా తెచ్చుకో ఎవడినీ వదలనన్నట్లు ఉతికిపారేశాడు. 41 బంతుల్లో 7ఫోర్లు 8 భారీ సిక్సర్లతో హిట్ మ్యాన్ చేసిన 92పరుగులే భారత్ చేసిన భారీ స్కోరుకు కారణమయ్యాయి. సూర్య 31, దూబే 28, పాండ్యా 27పరుగులతో తలో చేయి వేయటంతో టీమిండియా 205పరుగుల భారీ స్కోరు బాదింది. 206పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మొదట్లోనే వార్నర్ మావ వికెట్ సమర్పించేసుకున్నా..జిడ్డు వదలని తల హెడ్డు మన బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. మిచ్ మార్ష్, మ్యాక్స్ వెల్ తో కలిసి కాసేపు మనల్ని కలవరపెట్టాడు. 43 బాల్స్ లో 76పరుగులు హెడ్ వికెట్టును మన బౌలింగ్ దేవుడు బుమ్రా తీయటంతో ఆల్మోస్ట్ మ్యాచ్ మన చేతుల్లోకి వచ్చేసింది. అర్ష్ దీప్ 3, కుల్దీప్ యాదవ్ 2, బుమ్రా, అక్షర్ పటేల్ తలోవికెట్ తీసుకోవటంతో టీమిండియా 24పరుగుల తేడాతో గెలిచి సగర్వంగా సెమీస్ లోకి అడుగుపెట్టింది.