Eng vs Ind 3rd Test 136Years Record | లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ పేరిట నమోదైన చెత్త రికార్డు | ABP Desam
లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో 192 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఒక్కసారి ఈ స్కోరు బోర్డును చూడండి. టాప్ ఆర్డర్ ను మినహాయిస్తే రూట్ దగ్గర నుంచి చివరాఖరి బ్యాటర్ షోయబ్ బషీర్ వరకూ ఓసారి చూడండి. ఏమైనా సిమిలారిటీ గమనించారా. ఎస్ అందరూ క్లీన్ బౌల్డే అయ్యారు. మిడిల్ ఆర్డర్, లోయర్ మిడిల్, టెయిలెండర్లు ఇలా మ్యాచ్ లో ఆడినవాళ్లంతా క్లీన్ బౌల్డ్ అవ్వటం అరుదైన విషయం టెస్టుల్లో. ఇదెంత అరుదైన విషయం అంటే చివరి సారి ఇలా జరిగింది..136ఏళ్ల క్రితం. అవును 1889లో సౌతాఫ్రికా, ఇంగ్లండ్ దేశాల మధ్య కేప్ టౌన్ లో జరిగిన రెండో టెస్టు మ్యాచులో అచ్చం ఇలాంటి ఘటన జరిగింది. ఆ టెస్టులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 292పరుగులకు ఆలౌట్ అయ్యింది. మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికాను..ఇంగ్లండ్ స్పిన్నర్ జానీ బ్రిగ్స్ కుప్పకూల్చాడు. బ్రిగ్స్ 7వికెట్లు తీయటంతో సౌతాఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 47పరుగులకే ఆలౌట్ అయ్యింది. సరే ఫాలో ఆన్ కింద మళ్లీ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టిన సౌతాఫ్రికాను మళ్లీ జానీ బ్రిగ్సే చెడుగుడు ఆడుకున్నాడు. ఈసారి బ్రిగ్స్ 8వికెట్లు తీయటంతో ఫస్ట్ ఇన్నింగ్స్ లో కొట్టినంత స్కోరు కూడా కొట్టలేక సౌతాఫ్రికా ఈసారి 42పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఫలితంగా ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 202 పరుగుల తేడాతో భారీ విక్టరీ అందుకుంది. అయితే సౌతాఫ్రికా సెకండ్ ఇన్నింగ్స్ ఆడినప్పుడు అచ్చం నిన్న ఇంగ్లండ్, ఇండియా మ్యాచ్ లో ఇంగ్లండ్ అయిపోయినట్లే బ్యాటర్లంతా క్లీన్ బౌల్డ్ లే అయ్యారు చూడండి. సో 136ఏళ్ల క్రితం అప్పుడైన నమోదైన ఈ అందరూ క్లీన్ బౌల్డ్ ల రికార్డును మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత నిన్న లార్డ్స్ టెస్టులో నమోదు అయ్యిందన్నమాట. 1889లో ఇంగ్లండ్ వికెట్లు తీస్తే..2025లో ఇంగ్లండ్ వికెట్లు కోల్పోయి కాకతాళీయంగా రెండు రికార్డులలోనూ భాగస్వామ్యం అయ్యింది.





















