Tirumala Tamilnadu Bakthulu: తిరుమలలో ఆందోళనకు దిగిన తమిళనాడు భక్తులు
అలిపిరి-జూపార్క్ బైపాస్ రోడ్డులో తమిళనాడు భక్తులు ఆందోళనకు దిగారు. భక్తులకు టిక్కెట్లు లేక పోవడంతో తిరుమలకు విజిలెన్స్ సిబ్బంది అనుమతించలేదు. దీంతో వందల కిలో మీటర్లు పాదయాత్రగా వచ్చిన తమకు స్వామి వారి దర్శనం కల్పించాలంటూ భక్తులు డిమాండ్ చేశారు.. ఈ సందర్భంగా తమిళనాడు భక్తులు మీడియాతో మాట్లాడుతూ, గత 26 సంవత్సరాలుగా వేలూరు జిల్లా గుడియాత్తం నుండి పాదయాత్ర గా వచ్చి స్వామి వారి దర్శించుకుని వెళ్తున్నామని, అయితే ఈ ఏడాది కూడా అదే విధంగా తిరుమలకు పాదయాత్రగా వచ్చామని తెలిపారు..ఆన్లైన్ లో టిక్కెట్లు విడుదల చేయడంతో కేవలం 150 మందికే దర్శన సదుపాయం కలిగిందని, మిగిలిన 350 మందికి దర్శన సదుపాయం లేదని, ఇదే విషయం టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి మెసేజ్ రూపంలో తెలియజేశామని కానీ ఆయన స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. 26 సంవత్సరాలుగా వస్తున్న తమకు ఇంత వరకూ ఇటువంటి పరిస్ధితి ఎదురు కాలేదని, దర్శనం అయ్యే వరకూ అలిపిరి నుండి కదిలేది లేదని తమిళనాడు భక్తులు హెచ్చరించారు.