PM Modi with Air Crash Survivors | ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మొత్తం 265 మంది మరణించారు. ప్రధాని నరేంద్ర మొదట అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుండి బయలుదేరిన ఎయిర్ ఇండియా AI171 విమానం కూలిపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆయన వెంటన కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. ప్రమాదానికి కారణాలపై అధికారులను, రామ్మోహన్ నాయుడును ఆయన ఆరా తీశారు.
అనంతరం అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్‌కు వెళ్లారు ప్రధాని మోదీ. ఘోర విమాన ప్రమాదంలో చనిపోయన వారి కుటుంబసభ్యులను ప్రధాని మోదీ పరామర్శించారు. వారి కుటుంబాలకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గాయపడి చికిత్స పొందుతున్న వారిని ప్రధాని పరామర్శించారు. విమాన ప్రమాదంలో బతికి బయటపడ్డ ఏకైక ప్రయాణికుడు మహేష్ విశ్వాస్ కుమార్ ను ప్రధాని మోదీ పరామర్శించి, అతడి అరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అహ్మదాబాద్ లో కూలిన ఎయిర్ ఇండియా విమానం మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో రాజస్థాన్‌కు చెందిన 10 మంది మరణించారు. వీరిలో 20 ఏళ్ల ఖుష్బూ రాజ్‌పురోహిత్ అనే అమ్మాయి కూడా ఉంది. ఖుష్బూకు లండన్ లో సెటిల్ అయిన డాక్టర్ విపుల్ తో జనవరిలో పెళ్లి అయింది. పెళ్లి జరిగిన రెండు నెలల తర్వాత విపుల్ లండన్‌కు తిరిగి వెళ్ళిపొయ్యాడు. పాస్‌పోర్ట్ , వీసా కోసమని ఖుష్బూ ఇండియాలోనే ఉండిపోయింది. వీసా రాగానే లండన్ కు బయలుదేరింది. ఎయిర్ ఇండియా AI171 ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది ఖుష్బూ.





















