Pak vs Eng 1st Test Records | ముల్తాన్ టెస్ట్ మీద విరుచుకుపడుతున్న టెస్టు ప్రేమికులు | ABP Desam
ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్ జట్టు పాకిస్తాన్ లో పర్యటిస్తోంది. అందులో భాగంగా ముల్తాన్ లో జరిగిన మొదటి టెస్టు మీద క్రికెట్ ప్రేమికుల నుంచి గట్టిగా విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి రీజన్ ముల్తాన్ పిచ్ నుంచి అసలు ఏ మాత్రం స్పందన లేకపోవటమే. నాలుగు రోజుల పాటు నిద్రపోయింది ముల్తాన్ పిచ్. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ షఫీక్, మసూద్, సల్మాన్ సెంచరీలు కొట్టడంతో 556పరుగులు చేసింది. అక్కడికే అభిమానులకు విసుగు వచ్చేసింది. ఇక అది చాలదన్నట్లు బ్యాటింగ్ దిగిన ఇంగ్లండ్ సిమెంట్ రోడ్డు లాంటి పిచ్ పై పరుగులతో పండుగ చేసుకుంది. అంతా ఇంతా కాదు 7వికెట్ల నష్టానికి 823పరుగులు చేసి ఇక చాల్లేరా బాబు అనుకుని డిక్లేర్ ఇచ్చింది. హ్యారీ బ్రూక్ 317పరుగులు బాది ట్రిపుల్ సెంచరీ బాదుకుంటే...సచిన్ టెస్ట్ రికార్డును తిరగరాద్దామని ఆశగా ఉన్న జో రూటు 262పరుగులు చేశాడు. 267పరుగుల లీడ్ సాధించింది ఇంగ్లండ్. నాలుగు రోజుల తర్వాత పిచ్ స్పందించటం మొదలు పెట్టింది. ఫలితంగా పాకిస్తాన్ సెకండ్ ఇన్నింగ్స్ లో 6వికెట్ల నష్టానికి 152పరుగులు చేసింది. ఇంకా 115పరుగులు పాకిస్థాన్ వెనకబడి ఉంది. మరో రోజు మిగిలి ఉంది కాబట్టి ఇంగ్లండ్ బౌలర్లు పాకిస్థాన్ ను ఈ లోపే ఆలౌట్ చేసి ఇన్నింగ్స్ విజయం సాధిస్తారా..కాస్తో కూస్తో టార్గెట్ ఇచ్చినా ఛేజ్ చేసి సంచలనం నమోదు చేస్తారా..లేదా పాకిస్థాన్ పోరాడి డ్రా చేసుకుంటుందా చూడాలి.