Ahmedabad Plane Crash May Day Call | గాల్లోకి ఎగరగానే మేడే కాల్..ఊహించలేని ఘోర విషాదం | ABP Desam
మేడే కాల్. విమాన ప్రమాదాలు, లేదా భారీ పడవలు ప్రమాదాలకు లోనైనప్పుడు ఇచ్చే సిగ్నల్ ఇది. దీన్ని యూనివర్సల్ డిస్ట్రెస్ సిగ్నల్ అంటారు. ఎయిర్ క్రాప్ట్ లో ఉండే అత్యవసర పరికరాల ద్వారా ఇచ్చే ఈ రేడియో కమ్యూనికేషన్ సిగ్నల్ వచ్చిందంటే ఆ క్యారియర్ ప్రమాదం అంచుల్లో ఉందని అర్థం. అహ్మదాబాద్ లో కుప్పకూలిపోయిన ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్ లైనర్ టేకాఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే మేడే కాల్ ఇచ్చింది. అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ దాటుకుని వచ్చే నెక్ట్ ఏరియానే మేఘాని నగర్. ఆ ప్రాంతం ఉపరితలానికి వెళ్లగానే ఏటీసీకి విమానాన్ని నడుపుతున్న కెప్టెన్ సుమీత్ సభర్వాల్ నుంచి మేడే కాల్ వచ్చింది. ఏటీసీ వెంటనే రెస్పాండ్ అయ్యి విమానం తో కనెక్ట్ అవ్వాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు. క్షణాల్లోనే భారీ ఎత్తున మంటలు గాల్లోకి ఎగసి ఏటీసీ వరకూ కనిపించాయి. కానీ ఈలోగానే ఘోర విషాదం జరిగిపోయింది. హుటాహుటిన అంబులెన్స్, ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకున్నా చేతుల్లో ఏమీ లేకుండా పోయింది.





















