Poll officer Reena Dwivedi: ఈ పోల్ బ్యూటీ గుర్తున్నారా? అప్పుడు అలా ఎల్లో శారీలో, ఇప్పుడు ఇలా!
2019 పార్లమెంటు ఎన్నికల టైంలో ఎల్లో శారీలో నెటిజన్ల గుండెల్ని కొల్లగొట్టిన అధికారిణి రీనా ద్వివేది.. మరో స్టైలిష్ లుక్‌లో కనిపించారు.
![Poll officer Reena Dwivedi: ఈ పోల్ బ్యూటీ గుర్తున్నారా? అప్పుడు అలా ఎల్లో శారీలో, ఇప్పుడు ఇలా! UP Poll officer Reena Dwivedi In Yellow Saree and Black Tee Goes Viral Poll officer Reena Dwivedi: ఈ పోల్ బ్యూటీ గుర్తున్నారా? అప్పుడు అలా ఎల్లో శారీలో, ఇప్పుడు ఇలా!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/22/47c764b7aaa69be66416219f9af477c1_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో లేత పసుపు రంగు చీర, కూలింగ్ గ్లాసులు, ఓ చేతిలో ఈవీఎం బాక్స్ , మరో చేతిలో సెల్ ఫోన్ పట్టుకొని స్టైలిష్‌గా కనిపించిన యువ అధికారిణి గుర్తున్నారా? అప్పట్లో సామాజిక మాధ్యమాలను షేక్ చేసిన ఆఫీసర్ రీనా ద్వివేది మళ్లీ దర్శనమిచ్చారు.
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ మరోసారి ఆమె అదిరే లుక్‌లో కనిపించారు. ఈసారి మరింత డోసు పెంచి స్టైలిష్ లుక్‌లో కనిపించారు. ట్రెండీ డ్రెస్‌కు తోడు కళ్లజోడు, ఓ చేతిలో ఈవీఎం బాక్స్, మరో చేతిలో హాండ్ బ్యాగ్, సెల్ ఫోన్‌తో పోలింగ్ కేంద్రంలో కనపించారు. ఎన్నికల విధుల కోసం వచ్చిన ఆమెను చూసి పోలింగ్ సిబ్బంది సెల్ఫీల కోసం ఎగబడ్డారు.
ఎవరో తెలుసా?
రీనా ద్వివేదీ.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో ప్రజాపన్నుల విభాగంలో పనిచేస్తున్నారు. 2019లో పోలింగ్‌కు ముందురోజు ఈవీఎంలను తీసుకెళ్తున్న సమయంలో ఓ ఫొటో గ్రాఫర్ రీనా ద్వివేదీ ఫొటో తీసి నెట్టింట్లో పోస్ట్ చేశారు. అంతే ఒక్కసారిగా ఆ ఫొటో కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
View this post on Instagram
View this post on Instagram
ఆ తర్వాత ఆమె స్టైప్పులేస్తున్న కొన్ని వీడియోలు నెట్టింట్లో తెగ చెక్కర్లు కొట్టాయి. రీనా ద్వివేదీ ఫొటో చూసిన నెటిజన్లు వినూత్నంగా స్పందించారు. ఆమె విధులు నిర్వరిస్తున్న పోలింగ్ కేంద్రంలో 100 శాతం పోలింగ్ శాతం నమోదు కావొచ్చని ఒకరు కామెంట్ చేస్తే.. రీనా ద్వివేది లాంటి అధికారిణిని దక్షిణాది రాష్ట్రాల్లో పోలింగ్ విధుల కోసం ఎందుకు నియమించలేదంటూ మరొకరు సరదాగా కామెంట్లు పెట్టారు.
Also Read: HC on Love Marriage: కులాంతర వివాహం చేసుకుంటే కూతురు కాకుండా పోదు: హైకోర్టు కీలక వ్యాఖ్యలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)