Russia Ukraine Crisis: రష్యాపై ఆంక్షల కొరడా ఝుళిపించిన అమెరికా- పుతిన్ దూకుడు ఆపుతారా?
ఉక్రెయిన్‌పై రష్యా దూకుడుకు ప్రతిగా అమెరికా ఆ దేశంపై ఆంక్షలు విధించింది. ఆక్రమణ చర్యలు ఆపకపోతే మరిన్ని ఆంక్షలు విధిస్తామని బైడెన్ హెచ్చరించారు.
ఉక్రెయిన్‌పై దాడికి సిద్ధమవుతోన్న రష్యాపై అమెరికా ఆంక్షల కొరడా ఝుళిపించింది. రష్యాకు చెందిన రెండు అతిపెద్ద ఆర్థిక సంస్థలు వెబ్, సైనిక బ్యాంక్‌పై ఆర్థిక ఆంక్షలు విధించినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. శ్వేతసౌథంలో జాతినుద్దేశించి ప్రసంగించిన బైడెన్.. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలైందన్నారు.
President Putin’s actions are a flagrant violation of international law — and they demand a firm response from the international community. pic.twitter.com/iJPEEo4SyD
— President Biden (@POTUS) February 22, 2022
Today, I announced the first tranche of sanctions in response to Russia’s actions in Ukraine. And if Russia goes further with this invasion, we stand prepared to take further steps as necessary. pic.twitter.com/8t87wyMq6q
— President Biden (@POTUS) February 23, 2022
ఆ దేశాలు కూడా
ఐదు రష్యా బ్యాంకులు, ముగ్గురు కీలక వ్యక్తులపై ఆంక్షలు విధిస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. రష్యాతో దౌత్య సంబంధాలను తెంచుకునే అంశాలను పరిశీలిస్తున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ చెప్పారు. మాస్కోలోని రాయబారిని వెనక్కి పిలుస్తామన్నారు. ఐరోపా సమాఖ్య సైతం ఆంక్షలను విధించేందుకు సమావేశమైంది. అయినప్పటికీ పుతిన్ వెనక్కి తగ్గేటట్లు కనబడటం లేదు.
రష్యా దూకుడు
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్‌లోని వేర్పాటు వాద ప్రాంతాలను ప్రత్యేక దేశాలుగా గుర్తిసూ ఉత్తర్వులు జారీ చేశారు. పుతిన్ ప్రకటనతో ఉక్రెయిన్‌ను మూడు ప్రాంతాలుగా ముక్కలు చేసినట్లైయింది. అప్పటికే ఉన్న ఉక్రెయిన్‌కు తోడు డొనెట్స్‌క్, లుహాన్స్‌క్ ప్రాంతాలు దేశాలగా ఏర్పడినట్లు రష్యా గుర్తించింది.