అన్వేషించండి
Coldplay Concerts in Ahmedabad: అతిపెద్ద కన్సార్ట్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియం, ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన కోల్ట్‌ప్లే
Coldplay in Ahmedabad | బ్రిటీష్ రాక్ బ్యాండ్ కోల్డ్‌ప్లే ముంబైలో విజయవంతమైన ప్రదర్శనల అనంతరం అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో భారీ కన్సార్ట్ తో ఆకట్టుకుంటోంది.

అతిపెద్ద కన్సార్ట్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియం, ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన కోల్ట్‌ప్లే
1/8

బ్రిటిష్ రాక్ బ్యాండ్ కోల్డ్‌ప్లే ఇటీవల ముంబైలో మూడు అద్భుతమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసింది. తాజాగా జనవరి 25, 26 తేదీల్లో గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో రెండు భారీ కచేరీలు నిర్వహిస్తోంది.
2/8

బ్రిటిష్ రాక్ బ్యాండ్ కోల్డ్‌ప్లే కన్సార్ట్ అహ్మదాబాద్ మోతేరాలోని నరేంద్ర మోడీ స్టేడియంలో శనివారం జరిగింది. బుక్ మై షోలో ఇదివరకే టికెట్లు బుక్ చేసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో కోల్డ్ ప్లే క్రిస్ మార్టిన్ టీం కన్సార్ట్‌కు తరలివచ్చారు.
3/8

లక్ష కంటే ఎక్కువ సీటింగ్ సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా నిలిచిన నరేంద్ర మోదీ స్టేడియంలో కోల్డ్ ప్లే క్రిస్ మార్టిన్ కన్సార్ట్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులు, వీఐపీలు, సినీ సెలబ్రిటీలు, క్రీడా, వ్యాపార రంగాల ప్రముఖులు పాల్గొని సందడి చేశారు.
4/8

జనవరి 25న సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమై రాత్రి 10 గంటల వరకు కోల్డ్‌ప్లే కన్సార్ట్ ఘనంగా ముగిసింది. అయితే మధ్యాహ్నం 2 గంటల నుంచి గేట్లు తెరిచి స్టేడియంలోకి అనుమతించారు అధికారులు.
5/8

నరేంద్ర మోదీ స్టేడియం వద్ద 3,825 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అహ్మదాబాద్ అధికారులు. ఈ కన్సార్ట్ టికెట్ కొని ఈవెంట్ నేరుగా ఆస్వాదించలేని వారు డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రదర్శనను ప్రత్యక్షంగా వీక్షించారు
6/8

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో 1.2 లక్షల మంది కోల్డ్ ప్లే కన్సార్ట్‌కు హాజరై నేరుగా ప్రదర్శనను ఆస్వాదించారని క్రిస్ మార్టిన్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద కోల్డ్ ప్లే ప్రదర్శన ఇదేనని హర్షం వ్యక్తం చేశారు.
7/8

జనవరి 25న ప్రదర్శన వీక్షించని వారు రిపబ్లిక్ డే నాడు సైతం బ్రిటీష్ రాక్ బ్యాండ్ కోల్డ్ ప్లే కన్సార్ట్ ఈవెంట్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో వీక్షించవచ్చు అని నిర్వాహకులు చెబుతున్నారు. పాశ్యాత్య సంస్కృతికి సంబంధించిన కార్యక్రమాలపై రోజురోజుకూ భారత్‌లోనూ ఆధరణ పెరుగుతోంది.
8/8

బ్రిటీష్ రాక్ బ్యాండ్ కోల్డ్‌ప్లే తమ ప్రపంచ పర్యటనలో భాగంగా ఇండియా టూర్ కొనసాగిస్తోంది. మ్యూజిక్ ఆఫ్ ది స్పియర్స్ పర్యటనలో భాగంగా ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో కన్సార్ట్ నిర్వహించారు. జనవరి 18, 19, 21 తేదీల్లో కోల్డ్ ప్లే బ్యాంక్ తమ ప్రదర్శనలతో ప్రేక్షకుల్ని మెప్పించింది.
Published at : 26 Jan 2025 07:46 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఇండియా
ఇండియా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion