BRS First List : 18వ తేదీన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ? - ఎంత మంది సిట్టింగ్‌లకు సీట్లు గల్లంతు కాబోతున్నాయంటే ?
శ్రావణ శుక్రవారం రోజు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా రిలీజ్ చేస్తారా ?.20 మంది సిట్టింగ్‌లకు చాన్స్ నిరాకరించే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
BRS First List : భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు. అభ్యర్థుల కసరత్తును ఇప్పటికే పూర్తి చేశారు. మంచి రోజు చూసుకుని విడుదల చేయాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్చివరి వారంలో, లేదా నవంబర్ మొదటి వారంలోనే జరిగే అవకాశముందని అన్ని పార్టీలు అంచనా వేస్తున్నాయి. సెప్టెంబర్లోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే చాన్స్ ఉందని మంత్రి కేటీఆర్ చెబుతున్నారు. అందుకే అభ్యర్థుల జాబితాను రెడీ చేసారు. ప్రకటించాలని అనుకుంటున్నారు.
శ్రావణ శుక్రవారం రోజు బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్
బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ అభ్యర్థులపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు జాబితా కూడా రెడీ చేసుకున్నారు. ఈ నెల 17 నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. 18న శ్రావణ మొదటి శుక్రవారం ఉంది. అదే రోజు లేదా ఆ తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థుల మొదటి జాబితాను కేసీఆర్ ప్రకటించే అవకాశముందని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఫస్ట్ లిస్టులోనే 105 పేర్లు ప్రకటించే అవకాశముందని కూడా అంచనా వేస్తున్నారు. ఒకవేళ 105 పేర్లు ప్రకటించకుంటే.. కేసీఆర్ లక్కీ నంబర్అయిన ‘6’ సంఖ్య వచ్చేలా అభ్యర్థుల లిస్ట్ ఉండొచ్చని చెప్తున్నారు.
ప్రభుత్వం వద్ద లక్షల్లో పథకాల కోసం దరఖాస్తులు - ఓటర్లతో బీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతోందా ?
20 మందికి సీట్లు నిరాకరించే అవకాశం
పదేళ్లుగా అధికారంలో ఉండటంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉందని సర్వేల్లో తేలింది. 40 మంది ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉందని.. వారిలో అతి ఎక్కువ వ్యతిరేకత ఉన్న 20 మందిని మార్చి కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వనున్నట్టు చెబుతున్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే వేర్వేరు వేదికలపై అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేలను భారీ మెజార్టీతో గెలిపించాలంటూ పిలుపునిచ్చారు. తద్వారా ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఖరారు అయినట్టు సంకేతాలు ఇచ్చారు. కాంగ్రెస్, వీరిలో కాంగ్రెస్ , టీడీపీ నుంచి బీఆర్ఎస్‌లో జాయిన వారికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒక్క వనమా వెంకటేశ్వరరావుకు మాత్రం ఇంకా ఖరారు చేయలేదని చెబుతున్నారు. అనారోగ్యం కారణంగా చురుకుగా తిరగలేకపోవడంతో పాటు.. ఆయన కుమారుడి వ్యవహారాలపై వివాదాలతో ఆయనకు టిక్కెట్ ఇవ్వడం పెండింగ్‌లో ఉందంటున్నారు.
వైఎస్ఆర్టీపీ విలీనంపై షర్మిల స్పందన ఇదీ - ఇక ఖాయమే! ఆమె వెంటే కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
వామపక్షాలకు సీట్లు కేటాయిస్తారా ?
మునుగోడు ఉపఎన్నికల సమయంలో కమ్యూనిస్టు పార్టీలతో బీఆర్ఎస్ చీఫ్ పొత్తులు పెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ కలిసి పని చేస్తామన్నారు. ఆ ప్రకారం కమ్యూనిస్టులకు కొన్ని సీట్లు కేటాయించాల్సి ఉంది. కానీ అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్‌లో బలమైన పోటీ ఉంది. మారిన రాజకీయ పరిస్థితుల్లో చెరో రెండు అసెంబ్లీ స్థానాలు కేటాయించే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇంత వరకూ కమ్యానిస్టు పార్టీలతో కేసీఆర్ చర్చలు జరపలేదు.