MLC Kavita : కల్వకుంట్ల కవితకు మరోసారి ఎమ్మెల్సీ చాన్స్ వస్తుందా ?
కేసీఆర్ కుమార్తె కవితకు మరోసారి ఎమ్మెల్సీ చాన్స్ ఇస్తారా లేదా అన్నదానిపై టీఆర్ఎస్‌లో జోరుగా చర్చ సాగుతోంది.
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో ప్రస్తుతం ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు జరుగుతోంది. ఆరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు, 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే ఒక గవర్నర్ కోటా ఎమ్మెల్సీని కూడా నామినేట్ చేయాల్సి ఉంది. పాడి కౌశిక్ రెడ్డిని కేబినెట్ సిఫార్సు చేసినా ఇంకా గవర్నర్ ఆమోదం తెలియచేయలేదు. ఆశావహులు తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. హైకమాండ్‌ను ప్రసన్నం చేసుకుంటున్నారు. అయితే టీఆర్ఎస్ అందరి కన్నా ఎక్కువగా ఒకరి ఎమ్మెల్సీ స్థానంపైనే చర్చ జరుగుతోంది. ఆ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ సారి ఆమెకు ఎమ్మెల్సీ చాన్స్ వస్తుందా లేదా అన్నదానిపైనే టీఆర్ఎస్ నేతల్లో అంతర్గతతంగా చర్చ జరుగుతోంది.
Also Read : షర్మిల పాదయాత్రకు ఎన్నికల కోడ్ అడ్డంకి .. వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటన !
నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీగా ఉండి గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కొన్నాళ్లు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక రావడంతో అక్కడ్నుంచి పోటీ చేసి ప్రజాప్రతినిధి అయ్యారు. శాసనమండలి సభ్యురాలిగా ఉన్నారు. 14నెలల క్రితమే నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయిన కల్వకుంట్ల కవిత పదవి కాలం జనవరితో ముగిసిపోయింది. డీఎస్ సన్నిహితుడు అయిన భూపతిరెడ్డిపై అనర్హతా వేటు వేయడంతో ఆ సీటు ఖాళీ అయింది.
Also Read : మంత్రి హరీశ్ రావుకు వైద్య ఆరోగ్యశాఖ బాధ్యతలు.. ఉత్తర్వులు విడుదల
ఇప్పడు ఆ ఎమ్మెల్సీ పదవి కూడా ముగియనుండటంతో ఎన్నికకు షెడ్యూల్ విడుదల అయింది. మొత్తం స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి, అలాగే కరీంనగర్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల నుంచి రెండేసి ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నవంబర్ 16వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.
Also Read : ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్ భార్య ప్రసవం.. ఆదర్శంగా నిలిచారంటూ IASపై ప్రశంసలు
ఇప్పుడు ఆమె మళ్లీ నిజామాబాద్ నుంచి పోటీచేస్తారా..? కేసీఆర్ చాన్స్ ఇస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. పార్టీలో పెద్దగా ప్రాధాన్యం దక్కడం లేదన్న కారణంగా కవిత అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం కొంత కాలంగా సాగుతోంది. హైదరాబాద్‌లోనే ఉన్నప్పటికీ ఆమె ఇటీవల ప్లీనరీకి కూడా హాజరు కాలేదు. ప్రస్తుతం కేసీఆర్ ఎమ్మెల్సీ కసరత్తు చేస్తున్నారు. ఒక వేళ నిజామాబాద్ నుంచి పోటీ వద్దని అనుకుంటే ఎమ్మెల్యే కోటా లేదా.. గవర్నర్ కోటాలో నామినేట్ చేసే అవకాశం ఉంది. ఒక వేళ అసలు అవకాశం ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతారని అంటున్నారు.
Also Read: ఎదురొచ్చిన ఎన్నికల కోడ్.. కేసీఆర్ వరంగల్ టూర్ వాయిదా.. విజయగర్జన సభ కూడా !