(Source: ECI/ABP News/ABP Majha)
YS Sharmila : షర్మిల పాదయాత్రకు ఎన్నికల కోడ్ అడ్డంకి .. వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటన !
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర వాయిదా పడింది. ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా వేస్తున్నట్లుగా షర్మిల తెలిపారు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రకు బ్రేక్ పడింది. నిరాటంకంగా 400 రోజుల పాటు పాదయాత్ర చేయాలనుకున్న ఆమెకు ఎన్నికల కోడ్ అడ్డం వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ కారణంగా పాదయాత్రకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మళ్లీ ఎక్కడ పాదయాత్ర ఆపామో.. అక్కడ్నుంచే ప్రారంభిస్తామని షర్మిల తెలిపారు. 22 రోజుల క్రితం చేవెళ్లలో ప్రజా ప్రస్థానం పేరుతో ప్రారంభమైన పాదయాత్రలో ప్రస్తుతం నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లికి మండలం చౌడంపల్లికి చేరుకుంది. ఈ రోజు నకిరేకల్ నియోజకవర్గంలో పాదయాత్ర చేయాల్సి ఉన్నా.. వాయిదా నిర్ణయం తీసుకున్నారు.
Also Read : మంత్రి హరీశ్ రావుకు వైద్య ఆరోగ్యశాఖ బాధ్యతలు.. ఉత్తర్వులు విడుదల
తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకు రావాలన్న లక్ష్యంతో వైఎస్ షర్మిల నాలుగు నెలల కిందట పార్టీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరహాలోనే పాదయాత్రను చేసి ప్రజల సమస్యలను తెలుసుకోవాలని భావించారు. పార్టీ ప్రారంభం రోజున వంద రోజుల్లో పాదయాత్ర ప్రారంభిస్తానని చెప్పారు. ఆ ప్రకారం ప్రారంభించారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ 22 రోజుల పాదయాత్రలో ప్రజలకు సంబంధించి వందల సమస్యలు తెలుసుకున్నానని ప్రకటించారు.
Also Read : ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్ భార్య ప్రసవం.. ఆదర్శంగా నిలిచారంటూ IASపై ప్రశంసలు
వైఎస్ షర్మిల ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌పై మండి పడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను తప్పు పడుతున్నారు. రాజన్న రాజ్యం వస్తే ఏం చేస్తామో ప్రజలకు చెబుతూ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం పాదయాత్ర వాయిదా వేయడంతో మళ్లీ ఎప్పట్నుంచి ప్రారంభిస్తారో క్లారిటీ లేదు. డిసెంబర్ పదిహేనో తేదీ తర్వాత ఎన్నికల కోడ్ ముగిసిపోతుంది కాబట్టి ఆ తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
Also Read: ఎదురొచ్చిన ఎన్నికల కోడ్.. కేసీఆర్ వరంగల్ టూర్ వాయిదా.. విజయగర్జన సభ కూడా !
ఎన్నికల కోడ్ కారణంగా సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన, వరంగల్‌లో టీఆర్ఎస్ నిర్వహించాలనుకుంటున్న విజయగర్జన సభ కూడా వాయిదా పడింది.
Also Read : కేసీఆర్ ను టచ్ చేసి చూపిస్తాం... దళిత బంధుపై కుంటి సాకులు... టీఆర్ఎస్ పై బండి సంజయ్ ఫైర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి