(Source: ECI/ABP News/ABP Majha)
Harish Rao: మంత్రి హరీశ్ రావుకు వైద్య ఆరోగ్యశాఖ బాధ్యతలు.. ఉత్తర్వులు విడుదల
గత మే నెలలో ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేసిన సంగతి తెలిసిందే. భూ అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు ఈటలపై రావడంతో ప్రభుత్వం ఈటలను బర్తరఫ్ చేసింది.
తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు సీఎం కేసీఆర్ మరో శాఖ బాధ్యతలు అప్పగించారు. ఈటల రాజేందర్‌ను మంత్రి వర్గం నుంచి తొలగించాక ఖాళీ అయిన వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలను తాజాగా హరీశ్ రావుకు అప్పగించారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖను హరీశ్ రావుకు అప్పగిస్తూ తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగుతున్న హరీశ్ రావు ఇకపై వైద్య ఆరోగ్య శాఖను కూడా పర్యవేక్షించనున్నారు. ఇక నుంచి రెండు శాఖల బాధ్యతలను హరీశ్ రావు చేపడతారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గత మే నెలలో ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేసిన సంగతి తెలిసిందే. భూ అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు ఈటలపై రావడంతో ప్రభుత్వం ఈటలను బర్తరఫ్ చేసింది. వెంటనే ఆయన వద్ద ఉన్న వైద్యఆరోగ్యశాఖను తొలగించింది. అనంతరం ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. అప్పటి నుంచి గత ఆరు నెలలుగా కేసీఆర్ దగ్గరే వైద్య ఆరోగ్యశాఖ ఉంది. కరోనా సెకండ్ వేవ్ నుంచి వైద్య ఆరోగ్యశాఖపై హరీశ్ రావు పర్యవేక్షణ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ వద్ద వైద్య ఆరోగ్య శాఖ ఉన్నప్పటికీ, కేంద్రం కరోనాపై జరిపిన సమావేశాలు, సమీక్షలు అన్నింటికీ హరీశ్ రావే హాజరయ్యేవారు. ఇప్పుడు అధికారికంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యశాఖను హరీశ్ రావుకు కేటాయించారు.
Telangana Finance Minister Harish Rao has been given the additional portfolio of Health, Medical & Family Welfare department
— ANI (@ANI) November 9, 2021
(File photo) pic.twitter.com/y8sX2TYa6d
#HarishRao anna congratulations
— SWAMY TRS (@SWAMYLINGA8) November 10, 2021
Young and dainamic lead my boss💪💪 pic.twitter.com/DDn8I5GrS3
Also Read: Nalgonda: గుడిలో పూజారి.. చేసింది మాత్రం పాడు పని.. భార్య కూడా సహకారం, షాక్ అయిన పోలీసులు
Also Read: బట్టలిప్పేసి నగ్నంగా పక్కింటికి వెళ్లిన యువకుడు.. ఏం చేశాడంటే..!