Jr NTR: అభిమాని ఆస్పత్రి బిల్స్ అన్నీ క్లియర్ చేసిన తారక్... ఇప్పుడైనా విమర్శలు ఆపేస్తారా?
‘దేవర’ విడుదలకు ముందు క్యాన్సర్‌తో బాధపడుతున్న కౌశిక్ అనే అభిమానికి సాయం చేస్తానని చెప్పిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, చేయలేదంటూ ఆమె తల్లి మీడియా ముందుకు రాగా.. ఎన్టీఆర్ టీమ్ వెంటనే రంగంలోకి దిగింది.
కొన్ని రోజులుగా అభిమానికి ఇస్తానన్న అమౌంట్ ఇవ్వలేదని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై, కొన్ని గంటలుగా హాస్పిటల్‌లో ఉన్న తన అభిమానికి ఇచ్చిన మాట నిలుపుకోలేదని యంగ్ టైగర్ ఎన్టీఆర్‌పై ఎలాంటి పోస్ట్‌లు వైరల్ అయ్యాయో తెలియంది కాదు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా, ఆ మహిళ కుటుంబానికి రూ. 25 లక్షలు ఇస్తానని వీడియో విడుదల చేసిన అల్లు అర్జున్.. ఆ తర్వాత కేవలం రూ. 10 లక్షలే ఇచ్చారనేలా రేవతి భర్త తెలపడంతో.. అల్లు అర్జున్ విమర్శలపాటు కావాల్సి వచ్చింది. అలాగే ‘దేవర’ సినిమా విడుదలకు ముందు అనారోగ్యంతో బాధపడుతున్న తన అభిమానికి హాస్పిటల్ ఖర్చులు ఎంతయితే అంత భరిస్తానని, ఆ తర్వాత అసలు పట్టించుకోకపోవడంతో.. ఆ అభిమాని తల్లి పబ్లిగ్గా మీడియా సమావేశంలో ఆ విషయం చెప్పేసింది. దీంతో ఎన్టీఆర్‌పై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఎన్టీఆర్ మాత్రం వెంటనే స్పందించి, విషయాన్ని పెద్దది కాకుండా, సింపుల్‌గా ముగించేశారు. అసలు విషయం ఏమిటంటే..
‘దేవర’ సినిమా విడుదల సమయంలో బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఏపీకి చెందిన కౌశిక్ అనే అభిమాని తల్లి.. మీడియా సమావేశం నిర్వహించి తన బిడ్డని బతికించాలని భోరుభోరున ఏడ్చేసింది. కౌశిక్ కూడా ‘దేవర’ సినిమా చూసే వారకు తనని బతికించాలని కోరినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయం ఎన్టీఆర్ టీమ్ ద్వారా తెలుసుకున్న ఎన్టీఆర్.. వెంటనే కౌశిక్‌కు వీడియో కాల్ చేసి.. తనకు నేను ఉన్నానంటూ భరోసా ఇచ్చారు. నువ్వు ముందు ధైర్యంగా ఉండు.. ఏం కావాలన్నా నేను చూసుకుంటాను అంటూ ఆ వీడియో కాల్‌లో కౌశిక్‌కు, అతని తల్లిదండ్రులకు తారక్ చెబుతూ.. తన టీమ్‌ని దగ్గరుండి అంతా చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశాడు.
Also Read: 'పుష్ప 2'లో బన్నీ... 'మార్కో'లో ఉన్ని... ఇద్దరూ ఫైట్స్‌లో అలా చేశారేంటి భయ్యా!
కట్ చేస్తే.. మంగళవారం కౌశిక్ తల్లి సరస్వతి మీడియా ఎదుట మాట్లాడుతూ.. క్యాన్సర్‌తో బాధపడుతున్న నా కుమారుడు కౌశిక్‌కు వైద్య సహాయం చేస్తానని చెప్పిన జూనియర్ ఎన్టీఆర్ మాట తప్పారు. ‘దేవర’ సినిమా విడుదలకు ముందు నాతోనూ, నా కుమారుడితోనూ వీడియో కాల్‌లో మాట్లాడిన ఎన్టీఆర్.. నా కుమారుడి వైద్యం కోసం సాయం చేస్తానని అన్నారు. కానీ ఎటువంటి సహాయం చేయలేదు. ప్రస్తుతం కౌశిక్‌కు చెన్నై అపోలో హాస్పిటల్‌లో చికిత్స పూర్తయింది. ప్రభుత్వం రూ. 11 లక్షలు, టీటీడీ రూ. 40 లక్షల ఆర్థిక సాయం అందించింది. ఇంకా రూ. 20 లక్షల బిల్ పెండింగ్ ఉందని హాస్పిటల్ వాళ్లు అడుగుతున్నారు. ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ మాకు పైసా కూడా ఇవ్వలేదు అంటూ.. సంచలన ఆరోపణలు చేసింది.
మీడియాలో వచ్చిన సరస్వతి మాటలు ఎన్టీఆర్ వరకు చేరడంతో.. వెంటనే స్పందించిన ఎన్టీఆర్.. ఆ పెండింగ్ బిల్ మొత్తం కట్టేసి.. విషయం పెద్దది కాకుండా చూసుకున్నారు. ఎన్టీఆర్ బిల్ పే చేసినట్లుగా సోషల్ మీడియాలో హాస్పిటల్‌కు చెందిన రిసిప్ట్ ఒకటి బాగా వైరల్ అవుతోంది. దీనిపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఎలాగూ అమౌంట్ కట్టక తప్పలేదు. అదేదో.. అప్పుడే చేసేసి ఉంటే.. సరస్వతి మీడియా ముందుకు వచ్చి.. మీ గురించి అలా చెప్పేది కాదు కదా. మరో వైపు అల్లు అర్జున్ కూడా అలాగే చేసి.. వార్తలలో నిలుస్తున్నాడు. అప్పుడైనా అలెర్ట్ కావాల్సింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో ఎన్టీఆర్ అండ్ టీమ్ స్పందించిన తీరుపై కొందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్ బిల్ క్లియర్ చేయడంతో.. కౌశిక్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయినట్లుగా తెలుస్తోంది.
Also Read: సీఎంను కలిశా... అల్లు అర్జున్ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్ రాజు