Viral Video: సెక్స్ వర్కర్‌తో ఓ రోజు గడిపిన ఇన్‌ఫ్లూయన్సర్స్ - ఆ పని కోసం కాదు - వీడియో చూస్తే శభాష్ అంటారు !
Influencer: రెడ్ లైట్ ఏరియాల్లో ఉండే వారు ఒళ్లు అమ్ముకుంటారు. కానీవారికీ మనసు ఉంటుంది. ఆ విషయాన్ని బయట పెట్టేందుకు ఓ ఇన్ ఫ్లూయన్సర్ డే విత్ సెక్స్ వర్కర్ గడిపి వీడిోయ షేర్ చేశాడు.
Influencer Spends A Day With Sex Worker: మన దేశంలో వేశ్యావృత్తి నిషేధం. కానీ ఎక్కడ చూసినా రెడ్ లైట్ ఏరియాలో ఉంటాయి. మెట్రో సిటీల్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి. కోల్ కతాలో అతి పెద్ద రెడ్ లైట్ ఏరియా ఉంటుంది. పుణెలో కూడా ఇలాంటి వృత్తుల్లో ఉన్న వారి ఉంటారు. అయితే వీరిని గతంలోలా తక్కువ చేసి చూసే వాతావరణం తగ్గిపోతోంది. వారు కూడా మనుషులేనని గుర్తించడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఓ ఇన్ స్టా ఇన్ ఫ్లూయన్సర్ పుణెలోని ఓ సెక్స్ వర్కర్ తో రోజంతా గడిపాడు. ఆమె లైఫ్ స్టైల్ ను చూశాడు. చివరికి సరదాకా ఓ హోటల్ కు కూడా తీసుకెళ్లాడు. తన డే విత్ సెక్స్ వర్కర్‌లో ఎక్కడా ... రెండో ఆలోచన రానీయలేదు. ఆమె ప్రపంచంలోని భిన్నమైన కోణాలను ఆవిష్కరించడానికే సమయం కేటాయించాడు.
అనిష్ భగత్ అనే ఇన్ ప్లూయన్సర్ సామాన్య వ్యక్తులతో కలిసి ఓ రోజంతా ప్రయాణించి వారి జీవితాల్లోని చీకటి వెలుగుల్ని ఆవిష్కరిస్తూ ఉంటారు. ఈసారి ఆయన సెక్స్ వర్కర్ ను ఎంచుకున్నారు. రోక్సీ డీ అనే ఆమెతో కలిశారు. ఆ వీడియోను ఇన్ స్టాలో షేర్ చేశాడు. రోక్సీ చాలా ఇన్ స్పరింగ్ అని చెబుతున్నారు. ఆమె కూతుర్ని ఆమె బతుకుతున్న ప్రపంచానికి దూరంగా ఉంచి చదివించుకుంటుందని తాను స్వయంగా పిల్లలుక ట్యూషన్లు కూడా చెబుతుందని ఆయన చెబుతున్నారు. గౌరవం అనేది ప్రవర్తన ఆధారంగా వస్తుందని చేసే పనుల బట్టిన కాదని తనకు తెలిసిందని భగత్ చెబుతున్నారు.
రోక్సీ తన స్టోరీని భగత్ కు వివరించడం వీడియోలో ఉంది. తాను పదిహేళ్ల కిందట ఈ ప్రపంచంలోకి రావాల్సి వచ్చిందని ఇ్పపుడు ఎలాంటి బాధ లేదని రోక్సీ తెలిపారు. పుస్తకాలు చదవడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందుతానని రోక్సీ తెలిపారు.
View this post on Instagram
చివరిగా నీకోసం నేను ఏమైనా చేయగలనా అని భగత్ ప్రశ్నించారు. హోటల్ కు వెళ్లి సుశి అనే వంటకాన్ని తిందామని అడగడంతో భగత్ ఆ కోరికను తీర్చారు. మొత్తంగా ఆమె ఇన్ స్పరింగ్ పర్సన్ అని.. ఆమె వృత్తి కారణంగా అలాంటి వారిని తప్పు పట్టాల్సిన అవసరం లేదని సందేశం ఇచ్చారు.
Also Read: మరింత బలహీనపడిన రూపాయి - నాటి జూహీచావ్లా "అండర్‌వేర్ జారిపోయే" కామెంట్స్ మరోసారి వైరల్