Vizag Sky Walk Bridge: దేశంలోనే అతిపెద్ద విశాఖ స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభం.. ఇక పర్యాటకులకు పండుగే..
Indias Longest Glass Bridge | "వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ " ఎట్టకేలకు ప్రారంభమైంది. ఇక విశాఖపట్నం వాసులు, చుట్టుపక్కల ప్రాంతాల వారు గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జి చూసేందుకు క్యూ కట్టనున్నారు.

Vizag Glass Bridge | విశాఖపట్నం: వైజాగ్ వాసులతో పాటు టూరిస్ట్ లంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న " వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ " ప్రారంభం అయింది. టీడీపీ ఎంపీ భరత్ చేతుల మీదుగాకైలాసగిరి లోని ఈ స్కై వాక్ బ్రిడ్జ్ ని ప్రజలకు అందుబాటు లోనికి తీసుకొచ్చారు నిర్వాహకులు. డిసెంబర్ 1న ఉదయం ఈ గ్లాస్ బ్రిడ్జ్ ని ప్రారంభించారు భరత్. ఈ కార్యక్రమంలో వైజాగ్ ఎంపీ భరత్ తో పాటు VMRDA కమీషనర్ తేజ్ భరత్, మేయర్ పీలా శ్రీనివాసరావు, టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు తదితరులు హాజరయ్యారు.

ఎప్పుడో పూర్తయిన గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణం.. ఆరంభం ఆలస్యం ఎందుకంటే...
ఇండియాలోనే అతి పెద్ద కేంటి లివర్ గ్లాస్ బ్రిడ్జ్ విశాఖలో కట్టారనే విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లోని టూరిస్టులకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. కైలాసగిరి కొండ అంచు ఫై నుండి గ్లాస్ బ్రిడ్జిపై వాక్ చేస్తూ ఎత్తయిన కొండలు, అగాధం లా అనిపించే లోయ, దట్టమైన ఫారెస్ట్, విశాలమైన సముద్రం ఇలా విభిన్నమైన నేచర్ అందాలను ఆస్వాదించే అవకాశం ఈ స్కై వాక్ బ్రిడ్జ్ ఇస్తుందని అందరూ ఉత్సాహ పడ్డారు. నిజానికి ఆగస్టు 15 టైమ్ కి రెడీ అవుతుందని భావించినా పనులు ఆలస్యం వల్ల సెప్టెంబర్ కి బ్రిడ్జ్ రెడీ అయింది. కానీ అప్పటి నుండీ బ్రిడ్జ్ ఓపెన్ కాకుండా ఉండి పోయింది.

మంత్రి లోకేష్ చేతుల మీదుగా కైలాస గిరి బ్రిడ్జ్ ని ప్రారంభించాలని నిర్వాహకులు, VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్ ప్రారంభించాలని అనుకోవడం తో ఆయన టైం కోసం ఎదురుచూస్తూ ఉండిపోయారు. కానీ అయనకున్న బిజీ షెడ్యూల్స్ వల్ల అది కుదరలేదు. దానితో లోకేష్ సూచన మేరకు వైజాగ్ ఎంపీ భరత్ చేతుల మీదుగా డిసెంబర్ 1 న ఈ స్కై వాక్ బ్రిడ్జ్ ని ప్రారంభించారు.

7 కోట్ల ఖర్చు.. 55 మీటర్ల పొడవు
కైలాస గిరి స్కై వాక్ బ్రిడ్జ్ కోసం నిర్వాహకులు ఏడు కోట్లు ఖర్చుపెట్టారు. 55 మీటర్ల పొడవున ఈ గ్లాస్ బ్రిడ్జ్ ని PPP మోడల్లో నిర్మించారు. కేరళ లో ఇలాంటి బ్రిడ్జ్ ఇంకొకటి ఉంది కానీ దాని పొడవు 38 మీటర్లే. ఇదే ఏడాది మీజోరామ్ లో కూడా ఐజ్వాల్ స్కై వాక్ పేరుతో ఒక గ్లాస్ బ్రిడ్జ్ ఓపెన్ చేశారు కానీ దాని పొడవు 10 మీటర్లు మాత్రమే. ఇవే కాకుండా దేశంలో మరికొన్ని గ్లాస్ బ్రిడ్జ్ లు ఉన్నాయి. అయితే వాటన్నిటి కన్నా విశాఖపట్నం లోని స్కై వాక్ బ్రిడ్జ్ దేశం చాలా పెద్దది. తుఫాన్ సమయంలో 250km వేగం తో వీచే గాలులను సైతం తట్టుకునేలా దీన్ని నిర్మించినట్టు చెబుతున్నారు. ఆల్రెడీ మొన్నటి " మొంథా " తుఫాన్ దీన్ని రుజువు చేసింది కూడా.

VMRDA ఈ నిర్మాణన్ని సూపర్ వైజ్ చేస్తుండగా కేరళకు చెందిన RJ అడ్వవెంచర్స్ సంస్థ నిర్మాణం చేసింది. ఇది ఒకేసారి 100 మంది బరువును తట్టుకుంటుంది అని నిర్వాహకులు భరోసా ఇస్తున్నారు. ఏదేమైనా వైజాగ్ వాసులు ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్న కైలాస గిరి గ్లాస్ బ్రిడ్జ్ ఇప్పటికైనా ప్రారంభం కావడం ఎంతో సంతోషం గా ఉందని వైజాగ్ వాసులు అంటున్నారు. మరోవైవు ఈ గ్లాస్ వాక్ బ్రిడ్జ్ మరింత గా టూరిస్ట్ లను వైజాగ్ వైపు ఎట్రాక్ట్ చేస్తుంది అంటున్నారు అధికారులు.






















