ITR దాఖలు చేసేటప్పుడు ఈ తప్పులు చేశారా, మీకు నోటీసులు తప్పవు !
Income Tax Return | ఐటీఆర్ నింపేటప్పుడు చిన్న తప్పు కూడా సమస్యలకు దారి తీస్తుంది. తద్వారా మీకు ఐటీ శాఖ నుంచి నోటీసులు రావొచ్చు. కనుక జాగ్రత్తగా ఐటీఆర్ ఫైల్ చేయండి.

ITR Filling Tips 2025: ఆదాయపు పన్ను రిటర్న్ అంటే ITR ఫైలింగ్ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ చాలా మంది తెలిసో తెలియకో తరచుగా చిన్న చిన్న తప్పులు చేస్తారు. వీటిని నిర్లక్ష్యం చేస్తే తరువాత చాలా ఇబ్బంది పడతారు. చాలా మంది కేవలం ఫారమ్ నింపితే పని పూర్తయిందని భావిస్తారు. కానీ ఇది నిజం కాదు. ఆదాయపు పన్ను రిటర్న్ నింపేటప్పుడు సరైన సమాచారం ఇవ్వకపోతే లేదా తప్పు సమాచారం నింపితే, ఆదాయపు పన్ను (Income Tax) శాఖ మీకు నోటీసు పంపవచ్చు.
తప్పుడు పాన్ నంబర్, ఆదాయంలో తప్పు కేటగిరి, పన్ను క్రెడిట్ లో తప్పు లేదా సెక్షన్ లో తప్పు వంటివి సాధారణం. కొన్నిసార్లు, కొన్ని రూపాయల అవకతవకల్ని పట్టించుకోలేమని ప్రజలు భావిస్తారు. కానీ పన్ను శాఖ ఇప్పుడు డిజిటల్ ట్రాకింగ్ చేస్తుంది. ఇది చిన్న పొరపాటును కూడా గుర్తించగలదు. అందుకే ITR నింపేటప్పుడు ప్రతి వివరాలను సరిగ్గా ఉన్నాయో లేదో పూర్తిగా ధృవీకరించడం చాలా ముఖ్యం. లేకపోతే ఐటీ శాఖ నుంచి మీకు నోటీసులు రావచ్చు.
నోటీసులు ఎందుకు వస్తాయి..
పన్ను ఎగవేతతో పాటు ఐటీఆర్ ఫైలింగ్ లో మోసాలకు పాల్పడేవారికి మాత్రమే ఆదాయపు పన్ను కార్యాలయం నుండి నోటీసు వస్తుందని చాలా మంది భావిస్తారు. కానీ ITR లో తప్పు జరిగితే, ఆదాయపు పన్ను శాఖ ఎవరికైనా నోటీసు పంపుతుంది. ఇది సాధారణంగా ఈ-మెయిల్ లేదా డిజిటల్ పోర్టల్ లో చూడవచ్చు. నోటీసులో ఎక్కడ, ఎంత మొత్తంలో లోపం కనుగొన్నారో పేర్కొంటారు. దానిని సరిదిద్దడానికి మీకు సమయం కూడా ఇవ్వనుంది.
చాలా సార్లు, ఈ నోటీసు సమాచారం కోసం మాత్రమే ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో, మీరు అదనపు పన్ను లేదా జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. నోటీసు వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. బదులుగా, ఫారమ్‌లు, బ్యాంక్ డాక్యుమెంట్‌లను జాగ్రత్తగా చూసి తప్పును సరిదిద్దాలి. డిజిటల్ పోర్టల్‌లో అప్పీల్, దిద్దుబాటు ప్రక్రియ కూడా సులభమే. దీనితో మీ సమస్య త్వరగా పరిష్కారం అవుతుంది.
ITR ఫైలింగ్ సమయంలో ఈ తప్పులు చేయరాదు
ఆదాయపు పన్ను రిటర్న్ అంటే ITR నింపేటప్పుడు, ఫారమ్ నింపే ముందు మీ ఆదాయం, పన్ను క్రెడిట్, పాన్ సమాచారాన్ని పూర్తిగా తనిఖీ చేయండి. సెక్షన్లు, మినహాయింపులను సరిగ్గా నింపండి. బ్యాంక్ ఖాతా వివరాలను ధృవీకరించండి. వీలైతే డిజిటల్ రసీదు లేదా స్లిప్ రికార్డ్ ఉంచాలి. చాలా మంది TDS లేదా 26AS స్టేట్‌మెంట్‌లను చెక్ చేయరు. ఇది తరువాత నోటీసు రావడానికి కారణమవుతుంది.
మరొక సులభమైన విధానం ఏమిటంటే ప్రొఫెషనల్ టాక్స్ కన్సల్టెంట్ లేదా సాఫ్ట్‌వేర్ సహాయం తీసుకుంటే మంచిది. ఇది ఆటోమేటిక్ వెరిఫికేషన్ చేస్తుంది. చిన్న చిన్న పొరపాట్లను నివారించడం ద్వారా, మీరు ఐటీ శాఖ నుంచి నోటీసు వచ్చే అవకాశాలను చాలా వరకు తగ్గించవచ్చు. తద్వారా ఏ తప్పిదం లేకుండా మీరు ITR ని సరిగ్గా ఫైల్ చేయవచ్చు.























