అన్వేషించండి
AK47 Gun USA Rules: 15 ఏళ్ళలో 15 లక్షల మరణాలు... అమెరికన్లు ఇంట్లో ఏకే47 ఉంచుకోవచ్చా? రూల్స్ ఏం చెబుతున్నాయ్?
అమెరికా 1971లో ఓ రాజ్యాంగ సవరణ జరిగింది. దాని తరువాత ఎవరైనా సరే ఆయుధాలు కొనవచ్చు. అమెరికన్లకు ఆ దేశ ప్రభుత్వం ఆయుధాలు కలిగి ఉండే హక్కు కల్పించింది. మరి, ఇంట్లో ఏకే 47 పెట్టుకోవచ్చా?
ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన దేశాలలో ఒకటైన అమెరికా భద్రతాపరంగా మెరుగైనదిగా పరిగణించబడుతున్నప్పటికీ... అక్కడి గన్ సంస్కృతి దేశానికి శాపంగా మారింది. అమెరికా ప్రభుత్వ గణాంకాలు అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అక్కడ కాల్పుల ఘటనల్లో లక్షలాది మంది పౌరులు మరణించారు.
1/6

గత 51 ఏళ్లలో అమెరికాలో జరిగిన కాల్పుల ఘటనల్లో 15 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు అమెరికాలోని వాషింగ్టన్‌లో కాల్పుల ఘటనలో ఒక నేషనల్ గార్డ్ మరణించాడు. అయితే ట్రంప్ దీనిని ఉగ్రవాద దాడిగా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో అమెరికన్ గన్ సంస్కృతి గురించి తెలుసుకుందాం.
2/6

భారత్ లాంటి దేశంలో సాధారణ పౌరులకు ఆయుధాలు కలిగి ఉండటానికి కఠినమైన నిబంధనలు ఉన్నాయి. అమెరికాలో అలా కాదు. అమెరికా చట్టాల ప్రకారం, 18 ఏళ్లు పైబడిన ఏ వ్యక్తి అయినా నేరుగా తుపాకీని కొనుగోలు చేయవచ్చు.
3/6

18 సంత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తి తుపాకీ అమ్మే షాపులో ఒక ఫారమ్ నింపాలి, వారి ధృవీకరణ జరిగిన తర్వాత తుపాకీని కలిగి ఉండటానికి అనుమతి లభిస్తుంది. ఈ ప్రక్రియ కేవలం ఒకటిన్నర గంటల్లో పూర్తవుతుంది.
4/6

అమెరికా చట్టాల ప్రకారం, ఏ అమెరికా పౌరుడైనా రైఫిల్ లేదా చిన్న ఆయుధం కలిగి ఉండవచ్చు. దీనికి కనీస వయస్సు 18 సంవత్సరాలు. అయితే, ఎవరికీ AK-47 వంటి ప్రమాదకరమైన ఆయుధాలను కలిగి ఉండటానికి అనుమతులు లేవు.
5/6

అమెరికాలో ప్రజలకు 1971లో ఆయుధాలు కలిగి ఉండే హక్కు ఇవ్వబడింది. రాజ్యాంగంలో సవరణ చేసిన తరువాత, ఏ వ్యక్తి అయినా ఆయుధాలు కొనవచ్చు. దీనిని ది గన్ కంట్రోల్ యాక్ట్ అని పిలుస్తారు. దాని తరువాత అమెరికాలో గన్ సంస్కృతి వేగంగా పెరిగింది.
6/6

అమెరికాలో తరచుగా జరిగే కాల్పులకు ఈ గన్ కల్చర్ కారణం. ఒక నివేదిక ప్రకారం, ఆ దేశ జనాభా దాదాపు 33 కోట్లు, అయితే దాదాపు 40 కోట్ల తుపాకులు ఉన్నాయి. గత 50 సంవత్సరాలలో గన్ కల్చర్ కారణంగా ఇక్కడ 15 లక్షల మరణాలు సంభవించడానికి ఇదే కారణం.
Published at : 29 Nov 2025 10:26 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
బిజినెస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















