Euphoria Teaser : గుణశేఖర్ 'యుఫోరియా' టీజర్ వచ్చేసింది - డిఫరెంట్ కాన్సెప్ట్‌లో భూమిక స్పెషల్ రోల్... రిలీజ్ ఎప్పుడంటే?
Euphoria Teaser Reaction : గుణశేఖర్ దర్శకత్వంలో సీనియర్ హీరోయిన్ భూమిక ప్రధాన పాత్రలో నటించిన 'యుఫోరియా' టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. వచ్చే ఏడాది మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Guna Sekhar's Euphoria Teaser Released : స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ అవెయిటెడ్ యూత్ ఫుల్ సోషల్ డ్రామా 'యుఫోరియా' టీజర్ వచ్చేసింది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మూవీని రూపొందించగా భూమిక, సారా అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలు పోషించారు. అసలు 'యుఫోరియా' అంటే అర్థం ఏంటో టీజర్‌లో వివరించారు.
టీజర్ ఎలా ఉందంటే?
డ్రగ్స్ వల్ల యూత్ ఎదుర్కొనే సమస్యలు, డ్రగ్స్ రాకెట్ ముఠా అరాచకాలు, యూత్ ఎలా ఈ డ్రగ్స్‌కు బానిసలవుతున్నారు? అనేదే ఈ మూవీలో చూపించినట్లు టీజర్‌ను బట్టి అర్థమవుతోంది. 'యుఫోరియా - తీవ్రమైన ఉత్సాహం ఆనందం, అనుభూతి లేదా స్థితి' ఓ పబ్‌లో యూత్ ఎంజాయ్ చేయడం, వాళ్లు డ్రగ్స్ తీసుకుని రోడ్డుపైకి రావడం... పోలీస్ ఆఫీసర్ ఎంక్వైరీతో టీజర్ ప్రారంభమైంది. 'యుఫోరియా' అంటే ఓ డ్రగ్ నేమ్ అని తెలుస్తుండగా... దానికి యూత్ ఎలా బానిసలయ్యారు. దాన్ని తీసుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? అనేది చూపించారు.
ఓ స్కూల్ ఛైర్మన్‌గా భూమిక కనిపించనున్నారు. 'నీ స్కూల్ దేశంలోనే టాప్ 10లో ఉండాలనుకున్నావ్. నీ కాన్సట్రేషన్ మొత్తం స్కూల్ మీదే పెట్టావ్. నీ నిర్లక్ష్యం వల్లే నీ కొడుకు ఇలా తయారయ్యాడు.' డైలాగ్ హైప్ క్రియేట్ చేస్తోంది. అసలు డ్రగ్స్‌కు, స్కూల్‌కు భూమిక కొడుకుకు ఏంటి సంబంధం? అనేది తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
రిలీజ్ ఎప్పుడంటే?
ఈ మూవీని వరల్డ్ వైడ్‌గా వచ్చే ఏడాది ఫిబ్రవరి 6న రిలీజ్ చేయనున్నారు. మూవీలో భూమిక, సారా అర్జున్, నాజర్, రోహిత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, లిఖిత యలమంచిలి, పృథ్వీరాజ్ అడ్డాల, కల్పలత, సాయి శ్రీనికరెడ్డి, విఘ్నేష్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. గుణశేఖర్ హోమ్ బ్యానర్ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నీలిమ గుణ, యుక్తా గుణ నిర్మిస్తున్నారు. కాల భైరవ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
View this post on Instagram






















