(Source: ECI/ABP News/ABP Majha)
Bhadradri Kothagudem Collector: ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్ భార్య ప్రసవం.. ఆదర్శంగా నిలిచారంటూ IASపై ప్రశంసలు
ఇటీవల ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ స్నేహలత ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీకి జాయిన్ అయ్యి ఆడపిల్లకు జన్మనిచ్చారు. తాజాగా కలెక్టర్ అనుదీప్ (IAS Anudeep Durishetty) ఇదే బాటలో నడిచారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అంటే వెన్నులో వణుకు పుట్టేది. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి అలాగే ఉంటుంది. ఉదయం రావాల్సిన డాక్టర్ ఎప్పుడో సాయంత్రానికిగానీ ఆసుపత్రికి రాడని, అటెండర్లే చికిత్స చేస్తారని ప్రజలు భయపడుతుంటారు. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా అప్పులు చేసైనా ప్రైవేట్ ఆసుపత్రి బిల్లులు కడుతుంటారు. కానీ తెలంగాణలో ఈ పరిస్థితిలో మార్పులు కనిపిస్తున్నాయి. ఐఏఎస్, ఐపీఎస్‌లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరి ప్రజలలో స్ఫూర్తి నింపుతున్నారు.
ఇటీవల ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ స్నేహలత ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీకి జాయిన్ అయ్యి ఆడపిల్లకు జన్మనిచ్చారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ అదే మార్గంలో నడిచారు. కలెక్టర్ అనుదీప్ తన భార్యను ప్రసవం నిమిత్తం భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో జాయిన్ చేశారు. కలెక్టర్ భార్య ఓ పండంటి బాబుకు జన్మనిచ్చారు. సీనియర్ డాక్టర్లు రామకృష్ణ భార్గవి నేతృత్వంలో భద్రాచలం ఏరియా ఆస్పత్రి వైద్య బృందం శ్రీకాంత్, డా. దేవిక, కల్యాణి, రాజ్యలక్ష్మి.. విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించి డెలివరీ చేశారు.
Also Read: మంత్రి హరీశ్ రావుకు వైద్య ఆరోగ్యశాఖ బాధ్యతలు.. ఉత్తర్వులు విడుదల
Warmest Congratulations to @Collector_BDD & his wife. I hope both the mother & the child are doing well. It gives us immense pride to see how under the able leadership of CM KCR Garu, state medical infrastructure has proven to be the first choice of people. https://t.co/H7jN2ldMZi
— Harish Rao Thanneeru (@trsharish) November 10, 2021
ఐఏఎస్ అయినా కార్పొరేట్ వైద్యం అంటూ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లకుండా భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ప్రసవం కోసం భార్యను చేర్పించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ సామాన్యులకు స్ఫూర్తిగా నిలిచారు. ఏ భయాలు లేకుండా ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలన్నారు. ప్రభుత్వం చర్యలతో సర్కార్ దవాఖానాలలో మెరుగైన వైద్యం అందుతుందన్నారు. ఐఏఎస్‌లు ప్రభుత్వ ఆసుపత్రుల బాట పట్టడం సామాన్యులకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది.
#BhadradriKothagudem జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవ సేవలు పొంది పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన @Collector_BDD @anudeepd7, మాధవి గార్ల దంపతులకు హృదయ పూర్వక శుభాకాంక్షలు. కొర్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దిన @TelanganaCMO కేసీఆర్ గారు.@MinisterKTR @KTRTRS pic.twitter.com/rIfsNqbWgl
— Ajay Kumar Puvvada (@puvvada_ajay) November 10, 2021
ఇటీవల ఖమ్మం అడిషనల్ కలెక్టర్ ప్రసవం..
ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ స్నేహలత అక్టోబర్ చివరి వారంలో ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీకి జాయిన్ అయ్యి ఆడపిల్లకు జన్మనిచ్చారు. సామాన్య మహిళగా ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నారు. పురిటి నొప్పులతో సామాన్య మహిళగా ఆస్పత్రికి వచ్చి టెస్టులు చేయించుకుని... అనంతరం ఆపరేషన్ చేసిన డాక్టర్లు డెలివరీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకాన్ని పెంచేందుకు మొదటగా తామే చికిత్స తీసుకుని నిరూపిస్తున్నారు. అది కూడా ప్రసవం లాంటి ముఖ్యమైన చికిత్సకు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లడం శుభపరిణామం.
Also Read: మటన్ కర్రీలో బూజు, చికెన్‌లో పురుగులు.. ఇలాంటి చోట్ల తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త..!
Also Read: ప్రపంచంలోనే అతి పెద్ద నిధి.. తవ్వితే ఇంకాస్త దగ్గరలోనే.. వజ్రాలు, వైడూర్యాలు.. లక్ష కోట్ల పైమాటే