By: ABP Desam | Updated at : 10 Nov 2021 08:21 AM (IST)
Edited By: Venkateshk
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్‌లో కింది స్థాయి హోటళ్లు, ఫుడ్ కోర్టుల పట్ల అప్రమత్తంగా ఉండండి. వాటిలో ఆహారం తినేటప్పుడు కాస్త జాగ్రత్త వహించండి. ఎందుకంటే తాజా ఆహారం కాకుండా నిల్వ ఉండే ఆహారాన్ని కొన్ని చోట్ల వినియోగదారులకు అందిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఆ ఫుడ్ కోర్టులో మటన్, చికెన్ వంటి మాంసాహార పదార్థాలు పరిశీలించగా.. అవి కొద్ది రోజుల క్రితం నాటివని తేలింది. అందులో ఫంగస్, బూజు వంటివి ఉండడం కూడా కనిపించింది. ఆహార భద్రతా అధికారులు జరిపిన తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. పూర్తి వివరాలివీ..
Also Read: Naked Man In Theater: మూవీ థియేటర్ గోడలో నగ్నంగా వ్యక్తి.. కొన్ని రోజులుగా అందులోనే.. ఎలా దూరావయ్య?
ఓ రెస్టారెంట్ నిర్వహకుడు రోజుల కొద్దీ నిల్వ ఉంచిన, పురుగులు, బూజు పట్టిన మాంసాన్ని వండుతూ మోసం చేస్తున్నట్లుగా ఆహార భద్రత అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బండ్లగూడ జాగీర్ నగర పాలక సంస్థ పరిధిలో వెలుగు చూసింది. బండ్లగూడ జాగీర్ జంక్షన్‌లో ఉన్న ఓ పెట్రోలు బంకు పక్కన ఓ ఫుడ్ కోర్టు ఉంది. దీని పేరు జస్ట్ డ్రైవ్ ఇన్ ఫుడ్‌కోర్టు. అయితే, ఇందులో అందిస్తున్న ఆహార పదార్థాల విషయంపై ఆహార భద్రత అధికారులు ఫిర్యాదులు అందాయి.
Also Read: TikTok: 16 ఏళ్ల బాలిక కిడ్నాప్.. కాపాడిన్ టిక్ టాక్.. ఎలా అంటే..?
ఈ మేరకు మంగళవారం నగరపాలక సంస్థ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ గౌరిశెట్టి మనోహర్, స్థానిక టీఆర్ఎస్ నాయకుడు మద్దెల ప్రేమ్ గౌడ్, మరికొంతమంది స్థానికులు జస్ట్ డ్రైవ్ ఇన్ ఫుడ్‌కోర్టు రెస్టారెంట్‌లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. దీంతో రెస్టారెంట్ లోపల ఉన్న ఫ్రిడ్జ్‌లో బూజు పట్టిన మాంసం, పురుగులు పట్టిన చికెన్ ముక్కలను వారు గుర్తించారు. రెండు రోజుల కిందటి బిర్యానీని తిరిగి వేడి చేసి పెడుతున్నట్లు ఆహార అధికారులు నిర్ధరించారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ గౌరిశెట్టి మనోహర్ వాటిని నాణ్యత పరిశీలన కోసం శాంపిల్స్ సేకరించారు. హోటల్ నిర్వహకుడిపై అక్కడికక్కడే రూ.5 వేల జరిమానా విధించారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే మరింత కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
TSRTC Dasara Offer: దసరాకు ఇంటికెళ్లే వాళ్లకు ఆర్టీసీ స్పెషల్ ఆఫర్ - 10 శాతం రాయితీ
JNV: నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి లేటరల్ ఎంట్రీ ప్రవేశాలు, ఎంపిక ఇలా!
Breaking News Live Telugu Updates: పుంగనూరు, అంగళ్లు కేసుల్లో టీడీపీ నేతలకు బెయిల్
Telangana News: వర్షాకాలంలోనూ వేసవి స్థాయిలో కరెంటు వినియోగం, ఎక్చేంజీల్లో విద్యుత్ కొంటున్న డిస్కంలు
Vande Bharat Express: ఈనెల 24వ తేదీన కాచిగూడ-యశ్వంత్ పూర్ వందేభారత్ రైలు ప్రారంభం
రాజమండ్రి సెంట్రల్ జైల్లో టైఫాయిడ్‌తో రిమాండ్ ఖైదీ మృతి- చంద్రబాబు భద్రతపై లోకేష్ అనుమానం
Akhil Mishra Death : హైదరాబాద్‌లో ప్రమాదవశాత్తూ బాలీవుడ్ యాక్టర్ మృతి
కెనడాలోని హిందువులంతా జాగ్రత్త, దాడులు జరిగే ప్రమాదముంది - కెనడా ఎంపీ హెచ్చరికలు
Nortje-Magala Ruled Out: తలచినదే జరిగినది! - సఫారీ జట్టుకు వరుస షాకులు
/body>