Today Weather Update: అలర్ట్..అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లోని ఇవాళ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వాయువ్య పరిసర పశ్చిమ బంగాళాఖాతంలో కొనసాగుతోందని తెలిపింది.
తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. వాయువ్య పరిసర పశ్చిమ బంగాళాఖాతంలో కొనసాగుతోందని తెలిపింది. ఒడిశా తీరానికి చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది. దీని ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది సముద్ర మట్టానికి సగటున 1.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్య కొనసాగుతోందని తెలిపింది. ఎత్తుకు చేరే కొలదీ నైరుతి దిశ వైపునకు తిరిగి ఉన్నట్లు వివరించింది. ఫలితంగా ఏపీలో రానున్న మూడు రోజుల వరకు పలు చోట్ల తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఉత్తర కోస్తాంధ్రాలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. దక్షిణ కోస్తాంధ్రాలో నేడు ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాయలసీమలో కూడా మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. విశాఖ పట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వారు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణలో ఇవాళ పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఒకటి రెండు ప్రదేశాలలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఇవాళ, రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఓ వైపు శోభాయాత్ర.. మరోవైపు వర్షం
హైదరాబాద్ సిటీలో పలుచోట్ల సోమవారం వర్షం కురిసింది. మొజాంజాహి మార్కెట్, కోఠి, సుల్తాన్ బజార్, ట్యాంక్ బండ్ పరిసరాల్లో వర్షం కురిసింది. వర్షంలోనూ గణేశ్ శోభాయాత్ర కొనసాగింది. ఎన్టీఆర్, పీవీ మార్గ్ తో పాటు ట్యాంక్ బండ్ పరిసరాల్లో భక్తులు సందడి చేశారు.
Also Read: Gold-Silver Price: స్థిరంగా పసిడి ధరలు.. దిగొచ్చిన వెండి.. మీ ప్రాంతాల్లో తాజా రేట్లు ఇలా..