News
News
వీడియోలు ఆటలు
X

Gold-Silver Price: స్థిరంగా పసిడి ధరలు.. దిగొచ్చిన వెండి.. మీ ప్రాంతాల్లో తాజా రేట్లు ఇలా..

భారత మార్కెట్‌లో బంగారం ధరలు నిలకడగా ఉండగా.. వెండి ధర కూడా అదేలా ఉన్నాయి. కానీ, హైదరాబాద్ మార్కెట్‌లో మాత్రం వెండి ధర గ్రాముకు రూ.1.70 పైసలు తగ్గింది.

FOLLOW US: 
Share:

భారత్‌లో బంగారం ధర ఈ రోజు (సెప్టెంబరు 20) స్థిరంగా ఉంది. హైదరాబాద్ మార్కెట్‌లో కూడా నిలకడగా పసిడి ధరలు ఉన్నాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ భారత మార్కెట్‌లో రూ.45,390 గానే కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర తాజాగా రూ.46,390 గా ఉంది. మొత్తానికి గత 10 రోజుల ధరలతో పోలిస్తే పసిడి ధర స్వల్పంగా పెరిగింది.

భారత మార్కెట్‌లో బంగారం ధరలు నిలకడగా ఉండగా.. వెండి ధర కూడా అదేలా ఉన్నాయి. కానీ, హైదరాబాద్ మార్కెట్‌లో మాత్రం వెండి ధర గ్రాముకు రూ.1.70 పైసలు తగ్గింది. తాజాగా భారత మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.63,000గా కొనసాగుతోంది. హైదరాబాద్‌ మార్కెట్‌లో కిలో వెండి ధర కాస్త ఎక్కువగా రూ.64,200 గా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ముఖ్య నగరాల్లో సెప్టెంబరు 20న బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

Also Read: KTR: కేటీఆర్‌కి అరుదైన ఆహ్వానం, ఈ ఛాన్స్ అందరికీ రాదట..! థ్యాంక్స్ చెప్పిన మంత్రి

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి తాజా ధరలివీ..
హైదరాబాద్‌ మార్కెట్‌లో బంగారం ధర స్థిరంగా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99) ధర ప్రస్తుతం రూ.47,350 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం (91.6) ధర రూ.43,400 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.64,200 పలికింది.

ఇక విజయవాడలో 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర సెప్టెంబరు 20న రూ.43,400 కాగా.. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.47,350గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.64,200గా ఉంది. విశాఖపట్నం పసిడి మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,400 గానే ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,350గా ఉంది. ఇక్కడ కూడా వెండి ధర కిలో హైదరాబాద్ తరహాలోనే రూ.64,200 పలుకుతోంది.

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు సెప్టెంబరు 20న ఇలా ఉన్నాయి. ముంబయిలో ఈరోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.45,390ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,390గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,710 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,690గా ఉంది.

Also Read: Malla Reddy: ‘50 కోట్లతో ఆ సీటు కొన్నవ్.. దగుల్బాజీ, ఆడోళ్లు చీపుర్లు తిరగేస్తరు..’ మళ్లీ రెచ్చిపోయిన మంత్రి

ప్లాటినం ధరలో స్వల్ప తగ్గుదల
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర హైదరాబాద్‌లో గ్రాము రూ.2,211గా ఉంది. ముందు రోజుతో పోలిస్తే ఈ ధర గ్రాముకు రూ.16 వరకూ తగ్గింది. 10 గ్రాముల ప్లాటినం ధర ఇక్కడ రూ.22,110 గా ఉండగా.. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర అదే కొనసాగుతోంది.

వివిధ అంశాలపై పసిడి ధర
బంగారం ధరల్లో ప్రతిరోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి.

Published at : 20 Sep 2021 06:30 AM (IST) Tags: Gold Price Silver Price Todays gold cost Todays silver price platinum price hyderabad gold silver price vijayawada gold price

సంబంధిత కథనాలు

Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లో నెగెటివ్‌ సెంటిమెంట్‌ - బిట్‌కాయిన్‌ 5వేలు జంప్‌!

Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లో నెగెటివ్‌ సెంటిమెంట్‌ - బిట్‌కాయిన్‌ 5వేలు జంప్‌!

Shloka Necklace: అంబానీ కోడలి డైమండ్‌ నెక్లెస్‌కు రిపేర్‌, దాని రేటు తెలిస్తే షాకవుతారు

Shloka Necklace: అంబానీ కోడలి డైమండ్‌ నెక్లెస్‌కు రిపేర్‌, దాని రేటు తెలిస్తే షాకవుతారు

Stock Market News: 18,600 కిందకు నిఫ్టీ - సెన్సెక్స్‌ 223 పాయింట్లు ఫాల్‌, పెరిగిన రూపాయి

Stock Market News: 18,600 కిందకు నిఫ్టీ - సెన్సెక్స్‌ 223 పాయింట్లు ఫాల్‌, పెరిగిన రూపాయి

Paytm Shares: పేటీఎం 'కరో.. కరో.. కరో జల్సా'! వారంలో 22% గెయిన్‌ - 10 నెలల గరిష్ఠానికి షేర్లు!

Paytm Shares: పేటీఎం 'కరో.. కరో.. కరో జల్సా'! వారంలో 22% గెయిన్‌ - 10 నెలల గరిష్ఠానికి షేర్లు!

Forex Trading: మీ ఫారెక్స్‌ ఫ్లాట్‌ఫామ్‌ ఒరిజినలా, నకిలీనా? ఈ లిస్ట్‌లో చెక్‌ చేసుకోండి

Forex Trading: మీ ఫారెక్స్‌ ఫ్లాట్‌ఫామ్‌ ఒరిజినలా, నకిలీనా? ఈ లిస్ట్‌లో చెక్‌ చేసుకోండి

టాప్ స్టోరీస్

2024 ఎన్నికలకు బీజేపీ బిగ్ ప్లాన్, RSS సలహాతో బ్రహ్మాస్త్రం సిద్ధం చేసిన హైకమాండ్

2024 ఎన్నికలకు బీజేపీ బిగ్ ప్లాన్, RSS సలహాతో బ్రహ్మాస్త్రం సిద్ధం చేసిన హైకమాండ్

WTC Final 2023: అజింక్య అదుర్స్‌! WTC ఫైనల్లో హాఫ్‌ సెంచరీ కొట్టిన తొలి భారతీయుడిగా రికార్డు!

WTC Final 2023: అజింక్య అదుర్స్‌! WTC ఫైనల్లో హాఫ్‌ సెంచరీ కొట్టిన తొలి భారతీయుడిగా రికార్డు!

Saroornagar Murder: నా కొడుకు అందుకే హత్య చేసి ఉండొచ్చు - కీలక విషయాలు చెప్పిన నిందితుడి తండ్రి

Saroornagar Murder: నా కొడుకు అందుకే హత్య చేసి ఉండొచ్చు - కీలక విషయాలు చెప్పిన నిందితుడి తండ్రి

Magunta Raghav : మాగుంట రాఘవ్ మధ్యంతర బెయిల్ రద్దు - 12న సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశం !

Magunta Raghav : మాగుంట రాఘవ్ మధ్యంతర బెయిల్ రద్దు - 12న సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశం !