News
News
X

Malla Reddy: ‘50 కోట్లతో ఆ సీటు కొన్నవ్.. దగుల్బాజీ, ఆడోళ్లు చీపుర్లు తిరగేస్తరు..’ మళ్లీ రెచ్చిపోయిన మంత్రి

జవహార్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్, బీజేపీ నుంచి కొంతమంది కార్యకర్తలు టీఆర్ఎస్‌లోకి చేరారు. మంత్రి మల్లారెడ్డి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

FOLLOW US: 

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లక్ష్యంగా మంత్రి మల్లా రెడ్డి మరోసారి బూతు పురాణం వినిపించారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా జవహార్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పోరేటర్లు, కో ఆప్షన్స్‌తో జరిగిన సమావేశం ఇందుకు వేదికైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప మనిషని, ఆయన మహాత్ముడితో సమానమని మంత్రి మల్లా రెడ్డి కొనియాడారు. అలాంటి వ్యక్తిని ఇష్టమొచ్చినట్లుగా తిట్టడానికి రేవంత్ రెడ్డి ఎవరని పరుష పదజాలంతో మంత్రి దూషించారు.

‘‘ఇలాంటి వ్యక్తిని పట్టుకొని కొత్తగా పీసీసీ ప్రెసిడెంట్ అయిన దగుల్బాజీ, లఫూట్ నాయకుడు, దోకబాజీగాడు, చంచల్ గూడ జైలుకు వెళ్లొచ్చిన వ్యక్తి, ఈ దొంగ సీఎంను పట్టుకొని తిడుతున్నడు. నువ్వు పురుగులు పడి సచ్చిపోతవ్. మామూలుగా సావవు. వాడు రూ.50 కోట్లు పెట్టి పీసీసీ కొనుక్కొని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నడు. వాళ్ల ప్రభుత్వం ఏమన్న చేసిందా? గత 10 ఏళ్లు కాంగ్రెసే ఉంది కదా? వాళ్లేమన్నా చేసిన్రా. నీళ్లిచ్చిన్రా.. పింఛన్‌లు ఇచ్చిన్రా, కరెంటు ఇచ్చిన్రా వాళ్ల మొఖాలకు.. మొన్ననే జైలుకెళ్లి బయటికొచ్చి, ఢిల్లీలో పీసీసీ సీటు కొనుక్కొని వచ్చి.. సీఎం దొంగ.. సీఎం దొంగ అంటడు. మహాత్ముడు, గొప్పోడ్ని పట్టుకొని ఎంత మాట అంటున్నడు. వాడికి అసలు ఎంత ధైర్యం మన సీఎంను అనడానికి. ఒక దొంగ.. దగుల్బాజీ, ఒక లఫూట్, వాడు మన సీఎంను, కేటీఆర్‌ను తిడతడా? ఖబడ్దార్..! రేయ్ రేవంత్.. ఇయ్యలటినుంచి ఒక్కళ్లు కూడా ఇడవరు నిన్ను... వదిలేదే లేదు. మిమ్మల్ని కొట్టి ఇడిసిపెడతం. మా కార్యకర్తలు ఎవరు ఊకోరు.’’

‘‘మనకు మన కేసీఆర్ కల్యాణ లక్ష్మి ఇస్తుండు. బిడ్డ పుడితే కేసీఆర్ కిట్లు ఇస్తు్న్నడు. రెండు వేల పింఛన్లు ఇస్తున్నడు. అలాంటి వ్యక్తిని తిడితే ఎట్ల ఊరుకుంటరు? మా ఆడపడుచులు అస్సలు ఊరుకోరు. చీపురు కట్టలు తిరగేసి కొడతరు. పీసీసీ వచ్చినంత మాత్రాన అప్పుడే సీఎం అయిపోయనట్లు ఫీలైపోతున్నడు.’’అని మంత్రి మల్లా రెడ్డి తీవ్రమైన ఆగ్రహంతో దూషించారు.

టీఆర్ఎస్‌లోకి కార్యకర్తలు
జవహార్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్, బీజేపీ నుంచి కొంతమంది కార్యకర్తలు టీఆర్ఎస్‌లోకి చేరారు. మంత్రి మల్లారెడ్డి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై ఇలా వివాదాస్పద రీతిలో మాట్లాడారు. కొద్ది రోజుల క్రితం కూడా మంత్రి మల్లా రెడ్డి.. రేవంత్ రెడ్డిని బూతులతో దూషిస్తూ.. తొడ కొడుతూ సవాలు విసిరిన సంగతి తెలిసిందే.

Also Read: Anantapur: బ్యాలెట్ బాక్సులో వింత కోరిక.. ఆ స్లిప్‌ చదివిన అధికారులు అవాక్కు, నవ్వుకుంటున్న జనం.. వైరల్ వీడియో

Also Read: Photos: నిమజ్జనం వేళ Hyd విహంగ వీక్షణం, మెట్రో ఒంపుసొంపులతో అందమైన సిటీని పైనుంచి చూడండి

Published at : 19 Sep 2021 04:36 PM (IST) Tags: revanth reddy kcr Minister malla reddy Medchal malkajgiri Jawahar nagar municipal corporation

సంబంధిత కథనాలు

Minister Srinivas Goud:జింఖానా తొక్కిసలాట బాధితులకు అండగా ఉంటాం - మంత్రి శ్రీనివాస్ గౌడ్

Minister Srinivas Goud:జింఖానా తొక్కిసలాట బాధితులకు అండగా ఉంటాం - మంత్రి శ్రీనివాస్ గౌడ్

Telangana Free Electricity: వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ, మరెన్నో కీలక విషయాలు

Telangana Free Electricity: వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ, మరెన్నో కీలక విషయాలు

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

Hyderabad Crime : హైదరాబాద్ లో దారుణం, యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి!

Hyderabad Crime : హైదరాబాద్ లో దారుణం, యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి!

Kishan Reddy : అప్పుల కోసం కేంద్రాన్ని కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు- కిషన్ రెడ్డి

Kishan Reddy : అప్పుల కోసం కేంద్రాన్ని కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు- కిషన్ రెడ్డి

టాప్ స్టోరీస్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Bigg Boss 6 Telugu: ఇంట్లో ఎవరు గాడిద? ఎవరు పాము? ఎవరు ఊసరవెల్లి? ఇదిగో మీరే చూడండి

Bigg Boss 6 Telugu: ఇంట్లో ఎవరు గాడిద? ఎవరు పాము? ఎవరు ఊసరవెల్లి? ఇదిగో మీరే చూడండి